News


భిన్న మార్గాల్లో బ్లూచిప్‌, స్మాల్‌క్యాప్స్‌ 

Thursday 4th July 2019
Markets_main1562262965.png-26804

స్మాల్‌ క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే బ్లూచిప్‌ షేర్లు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. ఏడాదికి పైగా ఇదే దృశ్యం ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ముందు కదలాడుతోంది. ఆర్థిక రంగ మందగమనంలో ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో దశాబ్ద కాలంలోనే బ్లూచిప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల మధ్య అంతరం గరిష్ట స్థాయికి చేరింది. 

 

కేంద్రంలో పూర్వపు ప్రభుత్వానికే ఓటర్లు భారీ మెజారిటీతో పట్టం కట్టడంతో ఈక్విటీ మార్కెట్ల ప్రధాన సూచీలు గత నెలలో గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. కానీ, అప్పటి నుంచి మార్కెట్లు బ్లూచిప్‌ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50 గత ఏడాదిలో 12 శాతం పెరిగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ మాత్రం 13 శాతం పడిపోయింది. 2005 తర్వాత ఈ రెండింటి మధ్య ఇంత అంతరం మళ్లీ ఇదే కావడం గమనార్హం. ఆర్థిక మందగమనం మరింత కాలం కొనసాగడం, అంతర్జాతీయ ట్రేడ్‌ వార్‌ వంటి అంశాలు పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కేవలం పెద్ద కంపెనీలైన టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి ఎంపిక చేసిన స్టాక్స్‌లోకే వెళుతున్నాయని మనీ మేనేజర్లు చెబుతున్నారు. మార్కెట్‌ లీడర్లుగా ఉన్న ఈ కంపెనీలు రెండంకెల వృద్ధి నమోదు చేస్తుండడం, మందగమనంలో సురక్షిత కంపెనీలుగా ఇన్వెస్టర్లు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిపోయిన విషయం గమనార్హం. రుతుపవన కాలంలో వర్షాలు ఆలస్యం కావడం వల్ల జీడీపీలో 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంపై ప్రభావం చూపిస్తుందన్నది విశ్లేషణ. 

 

‘‘ఆర్థిక రంగంలో సైక్లికల్‌ మందగమనం ఏర్పడింది. సమీప కాలంలో ఇది పుంజుకుంటుందన్న నమ్మకం ఇన్వెస్టర్లలో లేదు’’ అని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ సీఐవో మహేష్‌ పాటిల్‌ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నిధుల కటకట సంక్షోభం సైతం ప్రైవేటు వినియోగాన్ని దెబ్బతీస్తోందని, నిర్మాణ రంగ పరికరాల నుంచి ఆటో విడిభాగాల వరకు అన్ని రకాల మార్కెట్‌ అమ్మకాలపై ఈ ప్రభావం ఉన్నట్టు నిపుణులు చెబతున్నారు. మార్చి త్రైమాసికంలో ప్లైవుడ్‌ కంపెనీ సెంచురీ ప్లైబోర్డ్స్‌, టైర్ల కంపెనీ సియట్‌ (ఈ రెండూ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీలోని కంపెనీలు) తక్కువ అమ్మకాలు నమోదు చేశాయి. రియల్‌ ఎస్టేట్‌, ఆటో కంపెనీల అమ్మకాలు మందగించడమే దీనికి కారణం. పెద్ద కంపెనీలతో పోలిస్తే అదే రంగంలోని చిన్న కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గుతున్నట్టు, ఆర్థిక మందగమన పరిస్థితులే కారణమన్నది విశ్లేషణ. కొన్ని చిన్న కంపెనీలు భారీగా రుణ భారంతో ఉండగా, కొన్ని కార్పొరేట్‌ గవర్నెన్స్‌ పరంగా ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి వాటికి తాము దూరమని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీస్‌ హెడ్‌ జినేష్‌ గోపాని తెలిపారు. You may be interested

బడ్జెట్‌ గురించి పది విశేషాలు

Thursday 4th July 2019

మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే బడ్జెట్‌కు విశేష ప్రాధాన్యం ఉంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాల జీవితాలను బడ్జెట్‌లోని కేటాయింపులు, నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. అందుకే బడ్జెట్‌ను ఎక్కువ మంది ఆసక్తిగా పరిశీలిస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను, కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు తొలి బడ్జెట్‌ అవుతుంది. ఈ సందర్భంగా బడ్జెట్‌ గురించి కొన్ని

జీ వాటాను కోనుగోలుకు కామ్‌కాస్ట్‌ కన్సార్షియం రెడీ

Thursday 4th July 2019

 జీ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం బిడ్‌ దాఖలుచేయడానికి కామ్‌కాస్ట్‌ నాయకత్వంలోని కన్సార్షియం ప్రయత్నిస్తోందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ప్రైవేట్‌ ఈక్వీటీ సంస్థ బ్లాక్‌ స్టోన్‌, జేమ్స్‌ మర్డోక్స్‌ లుపా సిస్టమ్స్‌ ఈ కన్సార్షియంలో భాగస్వామిగా ఉన్నాయని తెలిపింది. ఇవే కాకుండా కామ్‌కాస్ట్‌ మాజీ సీఎఫ్‌ఓ మైకెల్‌ ఏంజిల్‌కిస్‌ సంస్థైనా అటైరోస్‌ కూడా కన్సార్టియంలో ఉందని వివరించింది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని, లావాదేవిగా మారకపోవచ్చన్న అనుమానం వ్యక్తం

Most from this category