News


బ్లూచిప్స్‌ పైనే ఫండ్‌ మేనేజర్ల ఆసక్తి

Thursday 7th November 2019
Markets_main1573121660.png-29419

గత రెండేళ్లుగా దలాల్‌-స్ట్రీట్‌ ప్రైజ్‌ యాక‌్షన్‌లో లార్జ్ క్యాప్స్‌ ఆధిపత్యం చెలాయించాయి. రెండో క్వార్టర్లో ఫండ్‌ మేనేజర్ల కొనుగోళ్ల జాబితాలో బ్లూచిప్స్‌ అగ్రస్థానంలో ఉండటం చూస్తే ఈ విషయం అవగతమతోంది. ఈ హవా ఇప్పటికీ కొనసాగుతోందని ఏస్ ఈక్విటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే, సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఫండ్ మేనేజర్లు 388 కంపెనీలలో తమ వాటాను పెంచారు. వీటిలో ఎక్కువ భాగం బడా కంపెనీలే ఉన్నాయి. మేనేజర్లు కొనుగోలు చేసిన వాటిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పేయింట్స్‌, విప్రో లాంటి లార్జ్‌ కంపెనీలున్నాయి. 

‘‘బ్లూచిప్‌ కంపెనీలు 2017 ప్రారంభం నుంచి ఫండ్‌ మేనేజర్లకు ఫెవరెట్‌గా మారాయి. జీడీపీ రోజురోజూకు క్షీణిస్తున్న తరుణంలో ఫండ్‌ మేనేజర్లు తమ నిధులను కాపాడుకోవడానికి, స్మాల్‌క్యాప్‌, స్మాల్‌మిడ్‌క్యాప్‌ల హోల్డింగ్‌ రిస్క్‌ను తగ్గించుకోవడానికి మరికొన్నేళ్లు బ్లూచిప్‌,  కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగించే అవకాశం ఉంది.’’ అని బోనాంజా పోర్ట్‌ఫోలియో రీసెర్చ్‌ హెడ్‌​విశాల్‌ భాగ్‌ తెలిపారు.

వివిధ కంపెనీల్లో ఫండ్స్‌ వాటాలు(శాతాల్లో), ఆయా షేర్ల ధరల్లో మార్పు(శాతాల్లో)

మరోవైపు, ఇదే సెప్టెంబర్‌లో ఫండ్‌ మేనేజర్ల దాదాపు 297 కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో బాటా ఇండియా, ఎంసీఎక్స్‌, పీఐ ఇండస్ట్రీస్‌, సిమెన్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, బంధన్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, డాబర్ ఇండియా, ఎం అండ్ ఎం.. వాటిలో ఉన్నాయి. ఫండ్ మేనేజర్లు తమ వాటాను తగ్గించిన కొన్ని కంపెనీలు ఆటో మరియు మెటల్ రంగాలలోని పేర్లకు చెందినవి, ఈ ఏడాదిలో అత్యధిక లాభాలను లాభాలను ఆర్జించిన కంపెనీలు కూడా ఉన్నాయి.

ఫండ్‌ మేనేజర్లు వాటాలను తగ్గించుకున్న ఈ 297 కంపెనీల్లో 15 కంపెనీల షేర్లు 50శాతం వరకు లాభపడ్డాయి. వాటిలో రిలయన్స్‌ నిప్పన్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, డాక్టర్‌ లాల్‌, ఇన్ఫో ఎడ్జ్‌, పీఐ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌, బాటా ఇండియా, సిమెన్ష్‌ లాంటి కంపెనీలున్నాయి.ఇప్పటికే ర్యాలీ చేసిన కొన్ని పేర్లలో ఫండ్ మేనేజర్లు లాభాలను బుక్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీలన్నీ వాల్యుయేషన్‌లో ఉన్నాయి, చాలా ఖరీదైనవిగా మారాయి. అందువలన ప్రాఫిట్‌ బుకింగ్ జరిగింది ఫండ్‌ మేనేజర్లు ఈ కంపెనీలలో తమ వాటాను తగ్గించాయి. సాధారణంగా, అలాంటి స్టాక్స్ కొంత బలహీనత కోసం ఎదురుచూడకుండా ర్యాలీలలో అమ్మవలసి ఉంటుంది. ఉదాహరణకు డాక్టర్‌ లాల్‌ పాథ్‌లాబ్స్‌ షేరు 4రోజుల్లో 13శాతం వరకు దిద్దుబాటుకు లోనైంది.

అయితే ఫండ్‌ మేనేజర్లు అనుసరించాలా..?
సాధారణ ఇన్వెస్టర్లు ఫండ్‌ మేనేజర్లను గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. తమ మూలధన అవసరాలు, పెట్టుబడి పెట్టగల మూలధన నిధలు, కాల వ్యవధి, పెట్టుబడి పెట్టడానికి ముందు వారు సాధించాలనుకున్న లక్ష్యాలను అంచనా వేసుకోవాలి. రిస్క్‌-సామర్థ్యం, కాల వ్యవది, పెట్టుబడి పెట్టడానికి మూలధనం మొత్తం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోని ఫండ్‌ మేనేజర్లు ఆయా ఆయా స్టాకుల కొనుగోలు, విక్రయం చేస్తుంటారు. అందువల్ల గుడ్డిగా వీరిని అనుకరించకూడదు. దానికి బదులు ఆయా మేనేజర్ల కొనుగోళ్లు, అమ్మకాలతో తమ ఫోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌లను సరిచూసుకోవచ్చు. 
 You may be interested

బలహీన ఆర్థిక వ్యవస్థలో సెన్సెక్స్‌ ఎందుకు గరిష్ఠాలను తాకింది?

Thursday 7th November 2019

దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికి కూడా మందగమనం నుంచి బయటపడలేదు. ఉత్పదాక రంగానికి సంబంధించి అక్టోబర్‌ నెల పీఎంఐ(పర్చేజ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) డేటా రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదేవిధంగా సర్వీస్‌ సెక్టార్‌ సెప్టెంబర్‌ నెల పీఎంఐ డేటా 19 నెలల కనిష్ఠానికి చేరుకుంది. డిమాండ్‌ పుంజుకోవడంతో గత నెలలో ఆటో స్టాకులు పుంజుకున్నప్పటకి, ఇవి వాటి వేగాన్ని కోల్పోయాయి. స్థూల ఆర్థిక అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ

పడి లేచిన ఈక్విటీ మార్కెట్లు

Thursday 7th November 2019

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒత్తిళ్లు సరళతరమవ్వడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం సెషన్లో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి తిరిగి కోలుకున్నాయి. అయినప్పటికి ట్రేడ్‌వార్‌కు సంబంధించిన ప్రతి వార్తను గుడ్డిగా నమ్మొద్దని విశ్లేషకులు సలహాయిస్తున్నారు.  కాగా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించుకున్న సుంకాలను తిరిగి వెనక్కి తీసుకునేందుకు యుఎస్‌-చైనా అంగీకరించాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఈ వార్త వెలువడిన తర్వాత, ఇంట్రాడే కనిష్ఠాలను

Most from this category