STOCKS

News


ఇండస్‌ఇండ్‌, ఎయిర్‌టెల్‌, మారుతీ అప్‌

Thursday 9th January 2020
Markets_main1578547110.png-30794

సెన్సెక్స్‌ 445 పాయింట్లు జూమ్‌
నిఫ్టీ 135 పాయింట్లు ప్లస్‌

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తలు చల్లబడుతున్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 10.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 445 పాయింట్లు జంప్‌చేసింది. 41,263 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 135 పాయింట్లు ఎగసి 12160కు చేరింది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ప్రయివేట్‌ రంగ దిగ్గజాలు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ కౌంటర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
షేరు కొనుగోలుకి గతంలోనే సిఫారసు చేసిన విదేశీ బ్రోకింగ్‌ సంస్థ బీవోఎఫ్‌ఏఎంఎల్‌ తాజాగా టార్గెట్‌ ధరను పెంచడంతో ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌.. ఇండస్‌ఇండ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 2.5 శాతం పుంజుకుని రూ. 1494 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1501 వరకూ ఎగసింది. బ్యాంకింగ్‌ రంగంలో రిస్క్‌రివార్డ్‌  ఆధారంగా ఇండస్‌ఇండ్‌ ఉత్తమంగా కనిపిస్తున్నట్లు బీవోఎఫ్‌ఏఎంఎల్‌ పేర్కొంది. రానున్న రెండుమూడు క్వార్టర్లలో మరింత మెరుగైన పనితీరును చూపనున్నట్లు​అంచనా వేసింది. ఆర్జనలు 1-13 శాతం మధ్య పెరిగే వీలున్నట్లు పేర్కొంది. దీంతో గతంలో ఇచ్చిన రూ. 1500 టార్గెట్‌ ధరను తాజాగా రూ. 2000కు సవరించింది.

భారతీ ఎయిర్‌టెల్‌
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌) ద్వారా 200 కోట్ల డాలర్లు(రూ. 14,200 కోట్లు), మార్పిడికి వీలయ్యే విదేశీ మారకపు బాండ్ల(ఎఫ్‌సీసీబీలు) ద్వారా 100 కోట్ల డాలర్లు(రూ. 7100 కోట్లు) సమీకరించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా ప్రారంభమైన క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 435 ధరను నిర్ణయించింది. ఇది బుధవారం ముగింపుతో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్‌కాగా..  ఈక్విటీ 6 శాతం పెరగనున్నట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 62.70% వాటా ఉంది. నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్‌ అవసరాలు తదితరాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు 1.3 శాతం బలపడి రూ. 465 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 475ను తాకింది. గత 12 నెలల కాలంలో ఎయిర్‌టెల్‌ షేరు 52 శాతం ర్యాలీ చేయడం విశేషం!

మారుతీ సుజుకీ
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. వరుసగా ఎనిమిది నెలల క్షీణత తదుపరి డిసెంబర్‌(2019)లో దాదాపు 8 శాతం అధికంగా 1.16 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు తెలియజేసింది. 2018 డిసెంబర్‌లో 1,07,478 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసినట్లు గుర్తు చేసింది. ఇందుకు ప్రధానంగా కాంపాక్ట్‌ యుటిలిటీ వాహనాలకు పెరిగిన డిమాండ్‌ దోహదం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేరు 2 శాతం లాభపడి రూ. 7175 వద్ద ట్రేడవుతోంది. 
 You may be interested

రూ.1200 పతనమైన పసిడి

Thursday 9th January 2020

దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయి నుంచి భారీగా వెనక్కి వచ్చింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా రూ.1200లు నష్టాన్ని చవిచూసింది. నిన్నటి రోజున బంగారం ధర రూ.41,293 వద్ద రికార్డు గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ ఉ‍ద్రిక్తతలు తగ్గముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దిగిరావడం, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి అనూహ్య రికవరి, రికార్డు ధర

ఫలితాల ముందు ఇన్ఫీలో ఐరన్‌ ఫ్లై వ్యూహం!

Thursday 9th January 2020

నిపుణుల సలహా శుక్రవారం ఇన్ఫోసిస్‌ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కొంచెం రిస్కు తీసుకోదలిచిన ట్రేడర్లు ఐరన్‌ బటర్‌ ఫ్లై షార్ట్‌ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితాల అనంతరం తీవ్ర కదలికలు ఉండవన్న నమ్మకంతో ఈ వ్యూహం సూచిస్తున్నారు. ఫలితాల తర్వాత ఇన్ఫీ షేరు 60 రూపాయల రేంజ్‌(రూ.690- 750)లో కదలాడినంత కాలం ఈ వ్యూహంతో నష్టం ఉండదు. ఇదే సమయంలో ఐవీలో క్షీణత ఆప్షన్‌ సెల్లర్‌కు

Most from this category