News


ఇకపైనా పెద్ద బ్యాంకులదే హవా?

Friday 24th January 2020
Markets_main1579846701.png-31161

శ్రీ కార్తిక్‌ వెలమకన్ని, మార్కెట్‌ నిపుణులు, ఇన్వెస్టెక్‌ 

భారీ బ్యాలన్స్‌షీట్స్‌, రిస్క్‌లను తట్టుకునే సామర్థ్యం తదితర అంశాల నేపథ్యంలో పెద్ద బ్యాంకులకే ఆర్థిక వ్యవస్థ మద్దతిస్తున్న సంకేతాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు(ఇన్వెస్టెక్‌) శ్రీ కార్తిక్‌ వెలమకన్ని పేర్కొంటున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌ కొనసాగుతుందని, దీంతో పెద్ద బ్యాంకులు.. మరింత పెద్ద బ్యాంకులుగా అవతరిస్తాయని అంచనా వేస్తున్నారు. దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం...

15-20 శాతం వృద్ధి
ఇటీవల ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న కొన్ని సంస్కరణలు బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలకు కారణమయ్యాయి. అయితే రిస్క్‌ సామర్థ్యం, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం వంటి అంశాలు పెద్ద బ్యాంకులకు దన్నుగా నిలుస్తున్నాయి. దీంతో రుణ వృద్ధి నీరసించిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ వేగవంతంగా మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోగలుగుతున్నాయి. వెరసి పటిష్ట బ్యాలన్స్‌షీట్స్‌ కలిగిన పెద్ద బ్యాంకులకు ఆర్థిక వ్యవస్థ అవకాశాలు కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వార్షిక ప్రాతిపదికన దాదాపు 20 శాతం వృద్ధిని సాధించగలిగింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇలాంటి ట్రెండ్‌ కొనసాగే వీలుంది. సమీపకాలంలో కొంతమేర ఒడిదొడుకులు కనిపించినప్పటికీ అవకాశాలు ఊపందుకుంటాయి. వెరసి పెద్ద బ్యాంకులు 15-20 శాతం వృద్ధి బాటలో సాగే అవకాశముంది.

వ్యక్తిగత రుణ నాణ్యత?
బ్యాంకింగ్‌ రంగంలో వ్యక్తిగత రుణాల నాణ్యత అంశానికివస్తే.. ఉద్యోగులు, వృత్తి నిపుణులు(సెల్ఫ్‌ ఎంప్లాయ్‌డ్‌)గా విభజించవచ్చు. ఇదే విధంగా వివిధ బ్యాంకింగ్‌ ప్రొడక్టులు కూడా. సాధారణంగా వాణిజ్య వాహనాలు, ఆస్తులపై రుణాలు తీసుకునేవారు సెల్ఫ్‌ ఎంప్లాయ్‌డ్‌ విభాగంలోకి వస్తారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ విభాగంలో ఆర్థికపరమైన ఒత్తిళ్లు అధికంగా కనిపించవచ్చు. ఇక క్రెడిట్‌ కార్డుల విషయానికివస్తే.. సెల్ఫ్‌ ఎంప్లాయ్‌డ్‌ విభాగం వాటా 20 శాతంవరకూ ఉంటుంది. వెరసి విభిన్న విభాగాలలో బ్యాంకులిచ్చిన రుణాలు, ప్రొడక్టుల ఆధారంగా రిస్క్‌లు లేదా వృద్ధి కనిపించే వీలుంది. ఇటీవలి ట్రెండ్‌ను చూస్తే.. రిటైల్‌ రుణాలలో పెరుగుతున్న రుణ వ్యయాలు, స్లిప్పెజెస్‌లో అధిక భాగం సెల్ఫ్‌ ఎంప్లాయ్‌డ్‌ విభాగం నుంచే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రిటైల్‌ విభాగానికి సంబంధించినంతవరకూ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌డ్‌ కంటే ఉద్యోగులపై అధికంగా దృష్టిపెట్టే బ్యాంకులు మంచి ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది.

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ?
పీఎస్‌యూ విభాగంలో స్టేట్‌బ్యాంక్‌, ప్రయివేట్‌ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లను తీసుకుంటే.. కార్పొరేట్‌తోపాటు, రిటైల్‌ విభాగంపైనా దృష్టి పెట్టాయి. రిటైల్‌ విభాగంలో ప్రధానంగా ఉద్యోగులకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో రిటైల్‌ విభాగం నుంచి రుణ నాణ్యత విషయంలో ఈ రెండు బ్యాంకులూ అంతగా సమస్యలు ఎదుర్కోకపోవచ్చు. ఈ బ్యాంకులు చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్‌ఎంఈలు) రుణాల విషయంలో కొంతమేర ఒడిదొడుకులను చవిచూస్తున్నాయి. అయితే ఎస్‌ఎంఈ విభాగంలో ఎస్‌బీఐ 12 శాతం ఎక్స్‌పోజర్‌ను కలిగి ఉంటే.. ఐసీఐసీఐ మరింత తక్కువగా 4-5 శాతం వాటాతో సరిపెట్టుకుంది. వెరసి ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఎస్‌ఎంఈ రుణాల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను ఐసీఐసీఐ బ్యాంక్‌ సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశముంది.You may be interested

ఎల్‌ఐసీ ఈటీఎఫ్‌కి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, అనిల్‌ అంబానీ గ్రూప్‌ దెబ్బ..!

Friday 24th January 2020

దేశంలో అతిపెద్ద రుణ పత్రాల కొనుగోలుదారుగా పేరుపొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్‌ వద్దనున్న రూ.11,000 కోట్ల విలువైన బాండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో డిఫాల్ట్‌ అయ్యాయి. ఎల్‌ఐసీ నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న హెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కంపెనీల కమర్షియల్‌ పేపర్లను రేటింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. లైఫ్, పెన్షన్ ఫండ్ల నుంచి డిహెచ్ఎఫ్ఎల్లో రూ .6,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎల్ఐసి కేటాయింపులు

స్వల్పకాలానికి టాప్‌ సిఫార్సులు

Friday 24th January 2020

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే ఆరు స్టాకులను ప్రముఖ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 1. రామ్‌కో సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 890. స్టాప్‌లాస్‌ రూ. 797. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. అనంతరం స్వల్పకాలిక స్థిరీకరణ చూపింది. ఆర్‌ఎస్‌ఐలో బలమైన రివర్సల్‌ కనిపిస్తోంది. పైగా పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. త్వరలో మరింత అప్‌మూవ్‌ ఉంటుందని అంచనా. 2. క్రెడిట్‌ యాక్సిస్‌

Most from this category