News


ట్రేడింగ్‌ అకౌంట్‌ తెరిచేందుకు పెరిగిన ఆసక్తి

Friday 20th March 2020
Markets_main1584646414.png-32582

మార్కెట్‌ పతనం కోసం ఎదురు చూస్తున్న వారు.. ఆ అవకాశం రావడంతో ట్రేడింగ్‌ ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు నెల రోజుల్లోనే 33 శాతం వరకు పతనం అయ్యాయి. కానీ, విడిగా స్టాక్స్‌ను చూస్తే వాటి ధరలు ఇంతకంటే ఎక్కువే క్షీణించాయి. కోవిడ్‌ పరిణామంతో మార్కెట్లు రోజురోజుకీ నూతన కనిష్టాలకు పడిపోతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది మంచి అనుకూల సమయమని, కాకపోతే ఒకేసారి ఏకమొత్తంలో కాకుండా విడతల వారీగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలని నిపుణుల నుంచి సూచనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటి వరకు ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాల్లేని వారు వాటిని తెరిచేందుకు ఆసక్తి చూపిస్తుండడం అశావహం. స్మాల్‌కేస్‌ టెక్నాలజీస్‌, జెరోదా సంస్థ వద్దకు వస్తున్న నూతన ఇన్వెస్టర్ల గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. మార్చి నెలలో ఖాతాలు తెరిచేందుకు స్మాల్‌కేస్‌ టెక్నాలజీస్‌కు వద్దకు వచ్చే కస్టమర్లు ఒకటిన్నర రెట్లు పెరిగారు. జెరోదాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

 

‘‘మార్కెట్లు ఈ స్థాయిలో పతనం చెందినా నూతన ఇన్వెస్టర్లు వెనకడుగు వేయకపోవడం నిజంగా అద్భుతం. పైగా ఈ పరిస్థితి మరింత మందిని మార్కెట్లవైపు నడిపిస్తోంది. ఏడేళ్ల నుంచి నేను మార్కెట్లను అనుసరిస్తుండగా, ఈ విధమైన పరిస్థితి చూడడం ఇదే మొదటిసారి. నూతన ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం వస్తుండడం ఎంతో సానుకూల సంకేతం’’ అని స్మాల్‌కేస్‌ టెక్నాలజీస్‌ సీఈవో వసంత్‌ కామత్‌ తెలిపారు. జెరోదా వద్ద నూతన ఖాతాల ప్రారంభంలో 50 శాతం వృద్ధి నెలకొన్నట్టు ఆ సంస్థ చెబుతోంది. ‘‘మా కస్టమర్లు ఎక్కువగా రిటైలర్లే. హెచ్‌ఎన్‌ఐ తరహా కాదు. ముఖ్యంగా గత రెండు వారాల్లో నూతన ఖాతాల ప్రారంభంలో ఎంతో క్రేజీ కనిపిస్తోంది. ఖాతా ఎందుకు తెరుస్తున్నారు? అని వారిని ప్రశ్నిస్తే.. ‘మార్కెట్లు పడిపోయాయి. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది మంచి సమయం’ అనే సమాధానం వస్తోంది. 60 శాతం మంది మా కస్టమర్లు ఇంతకుముందు ఏ విధమైన వ్యూచువల్‌ ఫండ్‌ లేదా ఈక్విటీ పెట్టుబడులు చేయని వారే’’ అని జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ తెలిపారు. You may be interested

సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌!

Friday 20th March 2020

కోలుకున్న ప్రపంచ మార్కెట్లు అమెరికా, యూరప్‌ ఇండెక్సులు 1-2% అప్‌ ఆసియా మార్కెట్లు 1-3 శాతం లాభాల్లో నామమాత్ర నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో నామమాత్ర నష్టంతో 8,207 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,211 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే

ధరల పతనమే.. విలువ మారలేదు: రామ్‌దేవ్‌ అగర్వాల్‌

Friday 20th March 2020

అమెరికాలో మాదిరే ప్రపంచం అంతా ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు మారుతోందని, కొత్తగా వచ్చే సబ్‌స్క్రిప్షన్లు ప్యాసివ్‌ ఫండ్స్‌లోనే ఉంటున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం అమ్మకాలు కూడా ప్యాసివ్‌ ఫండ్స్‌ (ఇండెక్స్‌ ఫండ్స్‌/ఈటీఎఫ్‌) చేస్తున్నాయని చెప్పారు. మార్కెట్‌ పతనం, సంక్షోభంపై ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.    కరోనా సంక్షోభంపై మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఒక్కరికీ ఇది ఒకటి రెండు నెలలే అని తెలిసినప్పటికీ.. మార్కెట్‌

Most from this category