News


కొన్ని మరీ చౌక.. మరికొన్ని బాగా ఖరీదు!

Thursday 27th June 2019
Markets_main1561626226.png-26624

నిఫ్టీ స్టాక్స్‌ వాల్యూషన్లలో భారీ వ్యత్యాసాలు
నిఫ్టీలో భాగమైన స్టాక్స్‌ వాల్యూషన్లలో, ప్రదర్శనలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీలోని కొన్ని స్టాకులు భారీ ప్రీమియంలతో ట్రేడవుతుంటే, మరికొన్ని తమ దీర్ఘకాలిక సరాసరి కన్నా డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. ప్రస్తుత డౌన్‌సైడ్‌ రిస్కుల కారణంగా ఇండెక్స్‌ స్థాయిలో వాల్యూషన్‌ రీరేటింగ్‌కు చాలా స్వల్ప అవకాశాలున్నాయని తెలిపింది. స్టాకుల్లో వాల్యూషన్ల వ్యత్యాసాలు సూచీల్లో సందిగ్ధతకు కారణమవుతున్నాయని పేర్కొంది. 
డిస్కౌంట్‌లో ఉన్న స్టాకులు: ఐషర్‌ మోటర్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు తమ దీర్ఘకాలిక సరాసరి కన్నా తక్కువకు డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి.
ప్రీమియంలో ఉన్న స్టాకులు: బజాజ్‌ ఫైనాన్స్‌, ఆర్‌ఐఎల్‌, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు తమ సరాసరి ధరకు ప్రీమియంలో ఉన్నాయి.
ప్రీమియంలో ఉన్న స్టాకులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పతనమయ్యే రిస్కులుంటాయని బ్రోకింగ్‌సంస్థ తెలిపింది. ఈ విధంగా నిఫ్టీ స్టాకుల్లో వాల్యూషన్ల పరంగా స్పష్టమైన విభజన కనిపిచడం రెండు అంశాలను సూచిస్తోందని తెలిపింది. ఇన్వెస్టర్లు క్వాలిటీ స్టాకుల్లో ఎక్కువ పొజిషన్లు తీసుకోవడం, బ్రాడర్‌ మార్కెట్లో ఎర్నింగ్స్‌ గ్రోత్‌ పెద్దగా ఉండదనే అంశాలను ఈ విభజన సూచిస్తోందని తెలిపింది. బ్యాంకింగ్‌ రంగంలో క్రెడిట్‌ కాస్ట్‌లు సాధారణ స్థాయిలకు వచ్చాక నిఫ్టీ ఎర్నింగ్స్‌లో పునరుజ్జీవం ఉండవచ్చని అంచనా వేసింది. 


లార్జ్‌క్యాప్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా, ఇన్ఫీ, ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ షేర్లను...

 మిడ్‌క్యాప్స్‌లో డీసీబీ బ్యాంక్‌, ఫెడరల్‌బ్యాంక్‌, ఇండియన్‌ హోటల్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌, కేఈసీ, అశోకా బిల్డ్‌కాన్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, జెన్సార్‌ షేర్లను మోతీలాల్‌ ఓస్వాల్‌ రికమండ్‌ చేసింది. 
 



You may be interested

మార్కెట్లో లాభాలు మాయం

Thursday 27th June 2019

మార్కెట్‌ ప్రారంభం నుంచి లాభాల్లో ట్రేడైన సూచీలు మిడ్‌సెషన్‌లో ఒక్కసారిగా నష్లాల్లోకి మళ్లాయి. ఐటీ, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో అకస్మత్తుగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని హరించుకుపోయాయి. సెనెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(39,817) నుంచి 268 పాయింట్లను కోల్పోయి 39,549 వద్ద, నిఫ్టీ డే హై( 11,911.15) నుంచి 81 పాయింట్లు నష్టపోయి 11,830 వద్ద కనిష్టాలను నమోదు చేశాయి. నేడు జూన్‌ ఎఫ్‌అండ్‌ఓ ఫ్యూచర్‌ కాంట్రాక్టు

స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తుల జప్తు

Thursday 27th June 2019

న్యూఢిల్లీ: బ్యాంకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న గుజరాత్ సంస్థ స్టెర్లింగ్ బయోటెక్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ. 9,778 కోట్లు ఉంటుంది. జప్తు చేసిన వాటిలో ఓడలు, బిజినెస్ జెట్‌ విమానం, నైజీరియాలోని ఆయిల్ రిగ్గులు, లండన్‌లోని విలాసవంతమైన ఫ్లాట్ మొదలైనవి ఉన్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వీటి జప్తునకు సంబంధించి ప్రొవిజనల్‌ ఆర్డరు జారీ

Most from this category