News


బేర్‌ గుప్పిట్లో బిగ్‌ బుల్‌..!

Thursday 12th March 2020
news_main1584009700.png-32439

  • మార్కెట్లో పతనంలో కొట్టుకుపోయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా షేర్లు

దలాల్‌ స్ట్రీట్‌ భారీ పతనం సాదరణ ఇన్వెస్టర్లకే కాదు బడా ఇన్వెస్టర్లకు సైతం పీడ కలలు మిగులుస్తోంది. దేశీయ ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సైతం కోట్లలో నష్టాలను చవిచూశారు. ఝున్‌ఝున్‌వాలాకు పెట్‌ స్టాక్‌గా పిలవబడే టైటాన్‌ షేరు ఏడాది గరిష్టం నుంచి 20శాతం పతనమైంది. ఆయన దగ్గర టైటాన్‌ సంబంధించిన రూ.6500 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్‌ పతనంలో భాగంగా లుపిన్‌ షేరు సైతం బేర్స్‌ గుప్పిట్లో విలవిలలాడుతోంది. ఝున్‌ఝున్‌వాలా వద్ద మొత్తం రూ.400 కోట్ల విలువైన లుపిన్‌ షేర్లున్నాయి. కేవలం ఈ రెండు షేర్లు మాత్రమే కాకుండా ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌పోలియోలో షేర్లు ఏడాది గరిష్టం నుంచి 80శాతం నుంచి 20శాతం నష్టాలను చవిచూశాయి. 

కరోనా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడంతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు కొట్టుకుపోతున్నాయి. ఈ అల్లకల్లోలంలో ఝున్‌ఝున్‌వాలా షేర్లు సైతం భారీ నష్టాలను చవిచూశాయి. నేడు టైటాన్‌ 10శాతం నష్టాన్ని చవిచూసి రూ.1069 వద్ద కనిష్టానికి చేరుకుంది. ఈ స్థాయి షేరు ఏడాది గరిష్టం(రూ.1,389) నుంచి 25శాతం కావడం గమనార్హం. లుపిన్‌ షేరు సైతం ఏడాది గరిష్టం నుంచి 32శాతం నష్టాన్ని చవిచూసింది. ఝున్‌ఝున్‌వాలా మరో ఫేవరెట్‌ షేరు వీఐపీ ఇండస్ట్రీస్‌. ఈ షేరు సైతం గరిష్టం నుంచి 35శాతం పడిపోయింది.

ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ ఫోలియోలోకి మెన్‌ ఇన్ఫ్రా, బిల్‌కేర్‌, ఆల్ఫాటెక్‌, టీవీ18 బ్రాండ్‌కాస్ట్‌, డెల్పా కార్ప్‌, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ప్రోజెన్‌ షేర్లు సైతం బేర్స్‌ గుప్పిట్లో బందీలుగా మిగిలిపోయాయి. మంధన రిటైల్‌ ఇన్వెస్టర్లు, డీబీ రియల్టీ, అటోలైన్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌సీసీ షేర్లు ఏడాది గరిష్టాల నుంచి ఏకంగా 70శాతం నుంచి 85శాతం నష్టపోయాయి.

2008 సంక్షోభ సమయంలో, మార్కెట్‌ పతనానికి కారణం తెలుసు. వ్యవస్థలో ద్రవ్య మూలధనాన్ని పెంచినట్లతే కొంతవరకు సంక్షోభం నుంచి బయటపడవచ్చనే అంచనాలుండేవి. కాని ఇప్పటి పరిస్థితులను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ పతనం ఎంతవరకు జరుగుతుందో తెలియడం లేదని జిరోధా సీఐఓ నిఖిల్‌ కమత్‌ తెలిపారు. 

మార్కెట్ 16-18 శాతం పడిపోయినప్పుడు, గతంలో ఇలాంటి భయాందోళనలను తాను చూశానని షేర్‌ఖాన్‌కు చెందిన హేమాంగ్ జానీ అన్నారు. అయితే మరి ఇంత వేగంగా పతనమైతే తాను చూడలేదని తెలిపారు. రాబోయే కొద్ది రోజులలో, ఏదో ఒకస్థాయి వద్ద అయితే పడిపోవడం ఖాయమన్నారు.  You may be interested

షేర్లు వద్దు... డబ్బులిచ్చేయండి!

Thursday 12th March 2020

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓలో ధరఖాస్తు చేసుకున్న వారంతా తమకు షేర్లు కేటాయించకుండా ఉంటే బాగుండు దేవుడా అని అనుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు పడిపోతుండడంతో ఇన్వెస్టర్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ షేర్లు తమకు కేటాయించకుండా తమ డబ్బులను వెనక్కి ఇస్తే చాలు అనుకుంటున్నారు.  మార్కెట్లు పతనమవుతుండడంతో వివిధ కంపెనీల షేర్లు తక్కువ ధరలలో లభ్యమవుతున్నందున ఎస్‌బీఐ కార్డ్స్‌ షేర్లు కాకుండా ఇతర షేర్లుకొనేందుకు ఇన్వెస్టర్లు ఉవ్విళ్లూరుతున్నారు.

పతనంలో కొత్త రికార్డ్‌- ఇన్వెస్టర్లు బేర్‌

Thursday 12th March 2020

వెల్లువెత్తిన అమ్మకాలు కుప్పకూలిన బ్లూచిప్స్‌ 8 శాతం పతనమైన మార్కెట్‌ అన్ని రంగాలూ 8 శాతం డౌన్‌ యూరప్‌ మార్కెట్లు 5 శాతం వీక్‌ యూఎస్‌ ఫ్యూచర్స్‌ నేలచూపు ఓవైపు కరోనా భయాలు, మరోపక్క ప్రయాణాలపై నిషేధాలు, ఇంకోపక్క యస్‌ బ్యాంక్‌ వైఫల్యం వంటి ప్రతికూల అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో రెండు రోజుల్లోనే తిరిగి మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా సెన్సెక్స్‌ 2919 పాయింట్లు పడిపోయింది. 32,778 వద్ద ముగిసింది.

Most from this category