News


‘‘భెల్‌’’ 29 శాతం హై జంప్‌

Friday 18th October 2019
Markets_main1571380295.png-28978

ప్రభుత్వ రంగ విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల మోత మోగిస్తున్నాయి. కంపెనీలో కంపెనీలో ప్రభుత్వం వాటా తగ్గించుకోవచ్చనే వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమవుతున్నాయి. నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.49.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భెల్‌ కంపెనీ పాటుతో ఎన్‌ఎండీసీలోనూ ప్రభుత్వం వాటాను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సీఎస్‌బీసీ మీడియా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భెల్‌ కంపెనీకి చెందిన 4లేదా 5యూనిట్లను ప్రైవేట్‌ సంస్థలకు విక్రయించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  తద్వారా కంపెనీలో ప్రభుత్వం వాటా 63.17 శాతం నుండి 26 శాతానికి పరిమితం కావచ్చు. వాటా విక్రయంపై చర్చించడానికి ఇంటర్ మినిస్టీరియల్ బృందం త్వరలో సమావేశమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆయా కంపెనీల్లో తన వాటా ఉపసంహరణ ద్వారా రూ.1.05లక్షల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ అక్టోబర్‌ మొదటి వారంలో ఐదు ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటా విక్రయం ద్వారా 60శాతం నిధుల సమీకరణకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వాటా విక్రయ వార్తలతో ఇంట్రాడే భెల్‌ షేర్లకు భారీగా డిమాండ్‌ నెలకొంది. ఒకదశలో షేర్లు 29.29శాతం వరకు లాభపడి రూ.57.60లు వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేర్లు క్రితం ముగింపు(రూ.44.55)తో పోలిస్తే  28శాతం లాభంతో రూ.57 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.41.35లు రూ.78.75లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ 18.82% ర్యాలీ

Friday 18th October 2019

 ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలలో మెచ్యుర్‌ కాబోతున్న ఎన్‌సీడీ(నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌)లను ముందుగానే విడిపించేందుకు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సిద్ధమవుతుండడంతో ఈ కంపెనీ షేరు విలువ శుక్రవారం ట్రేడింగ్లో 18.80 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ. 235.20 వద్ద ముగిసింది. గత సెషన్‌లో 14.4 శాతం జంప్  చేసి 197.95 వద్ద ముగిసిన ఈ కంపెనీ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 198.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో

రూ. 50 స్థాయిని దాటిన యస్‌ బ్యాంక్‌

Friday 18th October 2019

వివిధ మార్గాల ద్వారా నిధులను సేకరించేందుకు మేనేజ్‌మెంట్‌ ప్రయత్నిస్తోందని యస్‌ బ్యాంక్‌ ప్రకటించడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ శుక్రవారం సెషన్‌లో 5.80 శాతం లాభపడి రూ. 50.15 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో 15 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 47.40 వద్ద ముగిసిన ఈ బ్యాంక్‌ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 46.60 వద్ద ప్రారంభమై, రూ. 51.80 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.  యస్‌ బ్యాంక్‌

Most from this category