News


రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో భెల్‌కు జోష్‌

Wednesday 30th October 2019
Markets_main1572409107.png-29226

  • 13.50శాతం ర్యాలీ చేసిన షేర్లు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో ప్రారంభంలో 13.50శాతం లాభపడ్డాయి. ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ షేర్లపై రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం చేయడం ఇందుకు కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.58.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 13.50శాతం లాభపడి రూ.61.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.9:40ని.లకు షేర్లు క్రితం ముగింపు ధర(రూ.53.80)తో పోలిస్తే 11.34శాతం లాభంతో రూ.59.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.41.30లు, రూ.78.85లుగా నమోదయ్యాయి. 
భెల్‌ షేర్లపై సీఎల్‌ఎస్‌ఏ వ్యూ:- 
రేటింగ్:- ‘‘సెల్‌’’ రేటింగ్‌ నుంచి ‘‘బై’’
టార్గెట్‌ ధర:- రూ.54నుంచి రూ.67లకు
విశ్లేషణ:- వ్యాల్యూను అన్‌లాక్‌ చేయడానికి కంపెనీ చర్యల్ని చేపడుతోంది. వివిధ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా కంపెనీ లాభాలను ఆర్జించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఒకవేళ కంపెనీ ప్రభుత్వ వాటా ఉపసంహరణ జరగకపోతే షేరు ప్రస్తుత మార్కెట్‌ ధర నుంచి కొద్దిగా డౌన్‌సైడ్‌ను కనబరుస్తుంది. 



You may be interested

బలమైన మద్దతు...11700 పాయింట్ల స్థాయి!

Wednesday 30th October 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు కొత్త సంవత్‌లో కదం తొక్కడం ఆరంభించాయి. దీపావళి నుంచి ఆటో, మెటల్‌, ఎనర్జీ స్టాకుల్లో పెరిగిన కొనుగోళ్లు నిఫ్టీని 11800 పాయింట్ల పైకి పంపాయి. దీంతో ఇప్పటివరకు కీలక నిరోధంగా ఉన్న 11700 పాయింట్లను నిఫ్టీ విజయవంతంగా దాటినట్లయింది. ఇప్పటివరకు నిరోధంగా ఉన్న 11700 పాయింట్లు ఇకపై కీలక మద్దతుగా నిలుస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. దీపావళికి ముందు ఐదు సెషన్లుగా నిఫ్టీ 11500-

బ్రోకరేజ్‌లు టార్గెట్‌ ధరల్ని పెంచిన షేర్లివే!

Wednesday 30th October 2019

స్టాక్‌మార్కెట్లో ప్రతి ఇన్వెస్టరుకు ఎదురయ్యే ధర్మసందేహం... బాగా పతనమైన షేర్లను కొనాలా? లేక మంచి అప్‌మూవ్‌ చూపుతూ ఆల్‌టైమ్‌ హైని చేరిన స్టాకులను కొనాలా? అని.. ఈనేపథ్యంలో షేరు ధరను చూసి కాకుండా వాటి పనితీరును, వాటిపై ప్రముఖ బ్రోకరేజ్‌ల అభిప్రాయాన్ని అధ్యయనం చేసి పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గత నెల రోజుల్లో కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో కొన్ని స్టాకులు భారీ ర్యాలీలు జరిపాయి. ఇలాంటివాటిలో కొన్ని నాణ్యమైన

Most from this category