News


ఫలితాల షాక్‌..52 వారాల కనిష్టానికి భెల్‌

Wednesday 12th February 2020
Markets_main1581494434.png-31727

ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ భెల్‌ కంపెనీకి మూడో త్రైమాసిక ఫలితాలు షాక్‌నిచ్చాయి. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహరపచడంతో షేరు బుధవారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి దిగివచ్చింది.  మంగళవారం మార్కెట్‌ ముగిసిన తరువాత కంపెనీ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో  నికరలాభం 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్‌ తెలిపింది. ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అందుకోలేకపోవడంతో షేరు ఇంట్రాడేలో 7.13 శాతం నష్టాన్ని చవిచూసి రూ.35.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు ఏడాది కనిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.35.80)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.36.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.35.80, రూ.78.75లుగా నమోదయ్యాయి.

భెల్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌

బ్రోకరేజ్‌ పేరు:- మోర్గాన్‌ స్టాన్లీ
రేటింగ్‌:- అండర్‌వెయిట్‌
టార్గెట్‌ ధర:- రూ.37లు
విశ్లేషణ:- కంపెనీ ఈబిటా వృద్ధి 22శాతం కంటే తక్కువగా నమోదైంది. ఆదాయం 32శాతానికి కంటే తక్కువ నమోదైంది. ఆర్డర్ల స్వీకరణ ఆలస్వం కావడం కారణంగా ఎగ్జిక్యూషన్‌ నెమ్మదించే అవకాశం ఉంది. 

బ్రోకరేజ్‌ పేరు:- జెఫ్ఫారీస్‌
రేటింగ్‌:- అండర్‌ఫెర్‌ఫాం
టార్గెట్‌ ధర:- రూ.37ల నుంచి రూ.33లకు తగ్గింపు
విశ్లేషణ:- ఆదాయ క్షీణత ప్రభావం మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. చాలా త్రైమాసికాల తర్వాత ఈ క్యూ3లో ఎబిటా అంచనాలకు అనుగుణంగా నమోదుకావడం విశేషం. ఈ క్యూ4లో ఆదాయం 20శాతం తగ్గవచ్చు. ఓవర్‌కెపాసిటీ కారణంగా క్యాపెక్స్‌ జనరేషన్‌ ఆంతంత మాత్రంగానే  ఉంటుంది.You may be interested

మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 సీరిస్‌ ఫోన్లు!

Wednesday 12th February 2020

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌ ఫోన్లను బుధవారం అంతర్జాతీయంగా విడుదల చేసింది. గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 అల్ట్రాతో పాటు మరో నూతన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ను తాజాగా విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు శాన్‌ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌-2020 ఈవెంట్‌లో ఈ ఫోన్లను

52 వారాల గరిష్టానికి 48 షేర్లు

Wednesday 12th February 2020

బుధవారం 48 షేర్లు 52 వారాల గరిష్టానికి పెరిగాయి. వీటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అఫెల్‌ ఇండియా, ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఆల్బర్ట్‌ డేవిడ్‌, ఆర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌,అసోసియేటెడ్‌ అల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఏస్టర్‌ డీఎం హెల్త్‌ కేర్‌, అతుల్‌, బాలకృష్ణా ఇండస్ట్రీస్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, డాబర్‌ ఇండియా, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, ఎఫ్‌డీసీ, జీఎంఎం

Most from this category