News


అంచనాల్ని అందుకోని భెల్‌...షేరు 7 శాతం క్రాష్‌

Thursday 25th October 2018
Markets_main1540460081.png-21483

ముంబై:- విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి.  బీహెచ్‌ఈఎల్‌ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రూ.185.17 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.115.42 కోట్లతో పోలిస్తే ఇది 60శాతం అధికం. అయితే విశ్లేషకులు మాత్రం ఈ క్యూ2లో భెల్‌ కంపెనీ రూ.218 కోట్ల నికరలాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. ఇదే క్యూ2లో నికర అమ్మకాలు 7.1శాతం పెరిగి రూ.6,606.90 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్యూ2లో రూ.6,168 కోట్లను సాధించగా, విశ్లేషకులు అంచనాలు మాత్రం రూ.6,902 కోట్లుగా ఉన్నాయి. ఇతర ఆదాయాలు సైతం రూ.151 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ2లో ఇతర ఆదాయం రూ.218కోట్లుగా నమోదైంది. గత క్యూ2లో రూ.171 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ2లో రూ.240 కోట్లకు పెరిగింది. విశ్లేషకుల అంచనాలు మాత్రం రూ.362కోట్ల ఇబిటా సాధించగలదని అంచనా వేశారు.
భెల్‌ షేరు బోల్తా:-
క్యూ2 ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో భెల్‌ కంపెనీ షేరు బోల్తా పడింది. బీఎస్‌ఈలో గురువారం షేరు రూ.74.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 7.50శాతం పతనమై రూ.70.25ల కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు ధర(రూ.75.95)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.71.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.64.50లు, రూ.108.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ప్రపంచ మార్కెట్ల కల్లోలం...సెన్సెక్స్‌ 344 పాయింట్లు డౌన్‌

Thursday 25th October 2018

10150 దిగువకు నిఫ్టీ ముంబై:- ప్రపంచ మార్కెట్లు తీవ్ర పతనం చవిచూసిన నేపథ్యంలో భారత్‌ సూచీలు గురువారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. గత రాత్రి అమెరికా సూచీలు 2-3 శాతం, నేడు ఆసియాలో ప్రధాన సూచీలు 1-4 శాతం మధ్య పతనమైన నేపథ్యంలో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన భారత్‌ సూచీలు...ప్రతీ చిన్న పెరుగుదలలోనూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నేడు అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ గడువు నేపథ్యంలో ట్రేడర్లు...వారి పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్‌ కార్యకలాపాల్లో నిమగ్నంకావడంతో దిగువస్థాయిలోనే

కరెక‌్షన్‌లో కొంటునే ఉన్నాడు..

Thursday 25th October 2018

ఆరు కంపెనీల్లో వాటాలు పెంచుకున్న రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా దేశీయ మార్కెట్లో పతనం కొనసాగుతూనే ఉంది. ఆగస్టు గరిష్టాల నుంచి మార్కెట్లు దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇదే సమయంలో ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా పాత సూత్రాన్ని పాటిస్తూ కొనసాగుతున్నారు. అందరూ అమ్ముతుంటే కొను, అంతా కొనేటప్పుడు అమ్ము.. అనే ప్రాథమిక సూత్రాన్ని అనుసరిస్తూ రాకేశ్‌ ఈ త్రైమాసికంలో కొనుగోళ్లు కంటిన్యూ చేశారు. ప్రస్తుతం 27 కంపెనీల్లో రాకేశ్‌కు ఒక శాతానికి

Most from this category