News


భెల్‌ డివిడెండ్‌ వంద శాతం

Saturday 21st September 2019
Markets_main1569042469.png-28466

  • గతంలో 40 శాతం చెల్లింపు 
  • ఏజీఎమ్‌లో 60 శాతం తుది డివిడెండ్‌ ప్రకటన 

న్యూఢిల్లీ: భెల్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం వంద శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. గతంలోనే 40 శాతం డివిడెండ్‌(రూ.279 కోట్లు)ను చెల్లించిన ఈ కంపెనీ గురువారం జరిగిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో 60 శాతం అదనపు తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో గత నలభై ఏళ్లుగా అప్రతిహతంగా డివిడెండ్‌ను చెల్లిస్తున్నట్లయిందని భెల్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం 30 శాతం వృద్ధితో రూ.2,058 కోట్లకు, నికర లాభం 51 శాతం వృద్ధితో రూ.1,215 కోట్లకు పెరిగాయని భెల్‌ సీఎమ్‌డీ నళిన్‌ సింఘాల్‌ తెలిపారు. 2017-18లో రూ.27,850 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.29,349 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పోటీ తీవ్రంగా పెరిగినప్పటికీ, వ్యాపార వాతావరణం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో రూ.23,859 కోట్ల విలువైన ఆర్డర్లు సాధించామని తెలిపారు. రైల్వే రవాణా, రక్షణ, విమాన రంగం, ఈ-మొబిలిటీ, వాటర్‌ బిజినెస్‌ వంటి కొత్త రంగాల్లోకి ప్రవేశించడం ద్వారా వృద్ధిని మరింతగా పెంచుకునే విషయమై దృష్టి సారిస్తున్నామని వివరించారు. రానున్న ఏళ్లలో వేగవంతమైన వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.  You may be interested

డిసెంబర్‌కల్లా నిఫ్టీ టార్గెట్‌ 12,200

Saturday 21st September 2019

 ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో, ఆర్థిక సంవత్సరం 2020 కి గాను ద్రవ్యలోటు 3.7 శాతానికి పెరిగే అవకాశం ఉందని యెస్‌ సెక్యురిటీస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అమర్‌ అంబానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు.. నిఫ్టీ వృద్ధి అంచానాలు పెరిగాయి.. ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి అతి పెద్ద ఉద్దీపనాన్ని అందించింది. అంతేకాకుండా మ్యాట్‌(మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ ట్యాక్స్‌)ను 18

సున్నిత అంశాల డేటా భారత్‌లోనే ఉండాలి: రవిశంకర్ ప్రసాద్

Saturday 21st September 2019

న్యూఢిల్లీ: దేశ డేటా సార్వభౌమాధికారం చేజారి పోనిచ్చేది లేదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఉద్ఘాటించారు. సున్నిత, అతి సున్నిత అంశాలకు సంబంధించిన సమాచారం దేశంలోనే ఉండాలని వ్యాఖ్యానించారు. డేటా లభ్యత, వినియోగం, ఆవిష్కరణ.. డేటా గోప్యతల మధ్య సమతుల్యత అవసరమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ ఆవిర్భావం, ప్రభావం అనే అంశంపై జైపురియా స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన సమావేశానికి

Most from this category