News


భారతి ఇన్‌ఫ్రాటెల్‌ 10 శాతం అప్‌

Friday 29th November 2019
Markets_main1575004149.png-29947

వరుసగా రెండోరోజూ భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేరు లాభాల బాట పట్టింది. నేడు ఈ షేరు రూ.248.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఈ షేరుకు ట్రేడర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 10శాతానికి పైగా లాభపడి రూ.282.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:20ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.256.50)తో పోలిస్తే 7.76శాతం లాభంతో రూ.276.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డిసెంబర్‌01 నుంచి టెలికాం సంస్థలు కాల్‌ సర్వీసెస్‌ ఛార్జీలను పెంచనుండటం కలిసింది. అలాగే ఎలారా సెక్యూరిటీస్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం భారతీ ఇన్‌ఫ్రాటెల్ బీఎస్‌ఈ 100 జాబితాలో నాలుగు త్రైమాసికాలలో చివరి మూడు క్వార్టర్లో ఆర్థిక సంవత్సరం 2021నాటి ఈపీఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేయబడింది. భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేరు నిన్న మార్కెట్‌ ముగిసే సరికి 14శాతం పెరిగి రూ.256.85 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.రూ.175.35లు, రూ.333.80లుగా నమోదయ్యాయి. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో సుప్రీంకోర్టు టెలికం సంస్థలకు ఎదురుదెబ్బ తగలడంతో గత నెలరోజులుగా ఈ రంగానికి చెందిన షేర్లన్నీ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి.



You may be interested

ఆరేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి?!

Friday 29th November 2019

రాయిటర్స్‌ పోల్‌ అంచనా దేశీయ ఎకానమీ గత ఆరేళ్లలో అత్యంత కనిష్ఠ వృద్ధిని సెప్టెంబర్‌ త్రైమాసికంలో నమోదు చేయవచ్చని రాయిటర్స్‌పోల్‌లో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. క్యు2లో జీడీపీ 4.7 శాతానికి పరిమితం కావచ్చని పోల్‌లో సరాసరిన అంచనా వేశారు. ఇది గత త్రైమాసికం వృద్ధి 5 శాతం కన్నా తక్కువ. ప్రైవేట్‌ పెట్టుబడులు బలహీనపడడం, కన్జూమర్‌ డిమాండ్‌ మందగమనం, అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు.. ఎకానమీపై ప్రభావం చూపాయని నిపుణులు భావిస్తున్నారు. తాజా అంచనాలు

ఆర్‌కామ్‌ ఆస్తుల కోసం ఎయిర్‌టెల్‌ రూ.9500 కోట్ల బిడ్‌!

Friday 29th November 2019

రుణాల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం‍టున్న రిలయన్స్‌ కమ్యునికేషన్స్‌ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రూ. 9,500 కోట్ల విలువైన షరతులతో కూడిన బిడ్లను టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ సమర్పించిందని టెలికాం పరిశ్రమకు చెందిన ఓ అధికారి తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు వీఎఫ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్‌ ప్రై., యూవీ అసెట్‌ రికనస్ట్రక్షన్‌ కంపెనీ కూడా తమ బిడ్లను సీఓసీ(క్రెడిటర్స్‌ కమిటీ)కి అందించాయి. ‘మిగిలిన కంపెనీల కంటే భారతీ ఎయిర్‌టెల్‌

Most from this category