News


భారతీ ఇన్ఫ్రాటెల్‌ 10శాతం క్రాష్‌..!

Friday 25th October 2019
Markets_main1571994900.png-29142

టవర్ల విలీన ప్రక్రియ వాయిదా ఎఫెక్ట్‌
భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లోకి ఇండస్ టవర్స్‌ను విలీనానికి మరి కొంతకాలం గడువును పొడిగించినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 10శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.240.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో ఇండస్‌ టవర్స్‌ విలీన గడువును మరో 60రోజుల పాటు పొడిగించేందుకు కమిటీ డైరెక్టర్లు ఆమోదం తెలినట్లు భారతీ ఇన్ఫ్రాటెల్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. గడువు పొడిగింపుతో విలీన ప్రక్రియపై అనుమానాలు తలెత్తడంతో భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో 10శాతం క్షీణించి రూ.213.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ ధర ఈ షేరుకు 5 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.2:20ని.లకు షేర్లు క్రితం ముగింపు(రూ.237.45)తో పోలిస్తే 7.50శాతం నష్టంతో రూ.219.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.213.75, రూ.333.80లుగా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌ చివర్లో భారతీ ఇన్‌ఫ్రాటెల్-ఇండస్ టవర్స్ విలీన ప్రక్రియను ప్రకటించాయి. ఇరు కంపెనీ విలీనం తరువాత ఏర్పడే నూతన కంపెనీ విలువ దాదాపు రూ. లక్ష కోట్లకు పైన,  ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టవర్ల సంస్థ ఆవిర్భవించనుంది. 



You may be interested

సుప్రీం తీర్పుతో టెలికాంలో కన్సాలిడేషన్‌!

Friday 25th October 2019

వొడాఫోన్‌ ఐడియాకు చిక్కులు తప్పవని నిపుణుల అంచనా ఏజీఆర్‌(అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ)కు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికం రంగంలో మరింత కన్సాలిడేషన్‌ జరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కన్సాలిడేషన్‌లో చివరకు ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే మిగులుతాయని, వొడాఫోన్‌ ఐడియా భవితవ్యం అనుమానాస్పదంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. వొడాఫోన్‌ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 400 కోట్ల డాలర్లుంటాయని, ఇది కంపెనీవద్ద ఉన్న మొత్తం నగదు రిజర్వుల కన్నా చాలా

అనూహ్య అమ్మకాలు: నష్టాల్లోకి సూచీలు

Friday 25th October 2019

ఉదయం నుంచి రిలీఫ్‌ ర్యాలీ చేస్తున్న సూచీలు... మిడ్‌సెషన్‌ ఒక్కసారి మొదలైన అమ్మకాలతో అనూహ్యంగా నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలతో పాటు బ్యాంకింగ్‌, ఫార్మా రంగ షేర్లల్లో ఒక్కసారి అమ్మకాలు నెలకొనడంతో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకోవడటంతో ఉదయం

Most from this category