భారతీ ఆక్సా జనరల్‌కు లాభాలు
By Sakshi

ప్రీమియం ఆదాయంలో 29 శాతం ప్రగతి ముంబై: భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభాలను ఆర్జించినట్టు ప్రకటించింది. ప్రీమియం వసూళ్లలో 29 శాతం వృద్ధిని సాధించామని, ఇది పరిశ్రమ వృద్ధి రేటు కంటే ఎక్కువని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల రిటన్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) రూ.2,285 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సంలో ఇది రూ.1,772 కోట్లుగా ఉంది. అన్ని రకాల బీమా ఉత్పత్తుల్లోనూ, పంపిణీ విభాగాల్లోనూ వృద్ధి నమోదైనట్టు సంస్థ తెలిపింది. ఇదే కాలంలో పరిశ్రమ సగటు వృద్ధి 12.9 శాతమేనని, ప్రైవేటు రంగ వృద్ధి కూడా 25 శాతంగానే ఉందని పేర్కొంది. పరిశ్రమ వృద్ధి తో పోలిస్తే ప్రీమియంలో రెట్టింపు పెరుగుదల సాధించామని, దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్టు తెలిపింది. 2017-18 సంవత్సరంలో సంస్థ రూ.92.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.
You may be interested
ఇండిగో విమానాలకు సీఎఫ్ఎం ఇంజిన్లు
Tuesday 18th June 201920 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆర్డరు న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో కొత్తగా కొనుగోలు చేస్తున్న 280 విమానాలకు సంబంధించి లీప్-1ఏ ఇంజిన్లను వినియోగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆ ఇంజిన్లను తయారు చేసే సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ సంస్థకు 20 బిలియన్ డాలర్ల ఆర్డరిచ్చింది. ప్రస్తుతం ఇండిగో నిర్వహిస్తున్న ఏ320నియో రకం విమానాలు చాలా మటుకు ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లతో నడుస్తున్నాయి. అయితే కొన్నాళ్లుగా
మన డేటా మన దగ్గరే ఉండాలి..
Tuesday 18th June 2019దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలి విదేశాల్లో భద్రపర్చడం శ్రేయస్కరం కాదు కేంద్ర మంత్రితో భేటీలో ఈ కామర్స్ వర్గాలు న్యూఢిల్లీ: దేశీ యూజర్ల డేటా... మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాలని, ఇతర దేశాల్లో దీన్ని భద్రపర్చడం శ్రేయస్కరం కాదని ఈ-కామర్స్ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ-కామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్‌తో సోమవారం సమావేశమైన