News


ఎయిర్‌టెల్‌ క్యూ3 గణంకాలపై బ్రోకరేజ్‌ల అంచనాలివే..!

Tuesday 4th February 2020
Markets_main1580812703.png-31506

టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ మంగళవారం మార్కెట్ ముగింపు అనంతరం డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్‌) బకాయిలకు క్యు2లో కేటాయింపులు చేసిన నేపథ్యంలో ఈ డిసెంబర్‌ క్వార్టర్‌లో నష్టాలు తక్కువగా ఉండవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో టారీఫ్‌ల పెంపు క్వార్టర్‌ లాభదాయకతకు మద్దతునిస్తుంది. 

అంచనాలు...

ఈ క్యూ3లో కంపెనీ రూ.780.8 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయవచ్చు. ఆదాయం 3.1శాతం వృద్ధి ఉండొచ్చు. భారత వ్యాపారం 6 శాతానికి పైగా వృద్ధిని సాధించడంతో పాటు ఆఫ్రికా విభాగపు వ్యాపారం క్యూ3లో 2-3శాతం పెరుగుతుందనే అంచనాలతో నిర్వహణ నుండి వచ్చే మొత్తం ఆదాయం వరుసగా 3-4 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో టారీఫ్‌ల పెంపు నేపథ్యంలో యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌ కార్వర్ట్‌ టు క్వార్టర్‌ 6శాతం పెరగచ్చని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది.

ఇదే క్యూ3 కాలంలో క్వార్టర్‌ టు క్వార్టర్‌ ఆదాయం 4.5శాతం వృద్ధి సాధిస్తుందని ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తుంది. ఇండియా వ్యాపార ఆదాయం 6.3శాతంగానూ, ఆఫ్రికాలో 2.3 శాతం వృద్ధిని చూస్తున్నట్లు బ్రోకరేజ్‌ సం‍స్థ తెలిపింది. సబ్‌స్క్రైబర్ల గణాంకాలు ఫ్లాట్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌ కార్వర్ట్‌ టు క్వార్టర్‌ 6.8శాతం పెరగచ్చని ఎడెల్వీజ్‌ తన నివేదికలో పేర్కోంది. ఇండియా, ఆఫ్రికాలో వైర్‌లైస్‌ వ్యాపారంద్వారా  నిర్వహణ విభాగంలో ఈబిటా వృద్ధి 5శాతంగానూ, మార్జిన్‌ అరశాతం పెరగవచ్చని ఎడెల్వీజ్‌ తెలిపింది.

మెరుగైన ఆఫ్రికా వ్యాపారపు ఆదాయాన్ని, ఎబిటాల వృద్ధి 3శాతం చొప్పున అందించే అవకాశం ఉంది. కన్సాలిడేషన్‌ స్థాయిలో ఎబిటా  5.2 శాతం వృద్ధిని,  ఆదాయం 3.7 శాతం పెరుగుతుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. 



You may be interested

కేజీ బ్లాక్‌ వార్తలా? డివిడెండ్‌పై ఆశలా?

Tuesday 4th February 2020

3 శాతం దూసుకుపోయిన ఆర్‌ఐఎల్‌ షేరు మంగళవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 3 శాతం దూసుకుపోయింది. కేజీ డీ6 బ్లాకులో ఉత్పత్తి ఈ ఏడాది మధ్య నుంచి ఆరంభమవుతుందన్న వార్తలు, ఏప్రిల్‌లోపు భారీ మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించవచ్చన్న ఆశలు.. షేరులో ఉత్సాహం పెంచాయి. కేజీ బేసిన్‌ డీ6లో ఉత్పత్తికి అన్ని సురక్షిత ఏర్పాట్లు చేశామని ఆర్‌ఐఎల్‌- బీపీ జేవీ ప్రకటించింది. మరోవైపు  ఏప్రిల్‌ అనంతరం డివిడెండ్‌ టాక్స్‌ గ్రహీతలు కట్టాల్సిఉంటుందని

సెన్సెక్స్‌ ర్యాలీకీ కారణాలు

Tuesday 4th February 2020

  మంగళవారం సెక్టోరియల్‌ ఇండెక్స్‌లన్నీ గ్రీన్‌లో ట్రేడ్‌ అయ్యాయి. మెటల్‌ షేర్లు  2.4 శాతం పెరగగా ఇదే బాటలో నడిచిన ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, ఫార్మాలు 1 శాతం పెరిగాయి. శనివారం పడిపోయిన మార్కెట్‌లు మంగళవారం భారీగా పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 600 పాయిట్లు పెరిగింది. మరోపక్క నిఫ్టీ 11,900 పాయింట్ల పైకి ఎగబాకింది.ఈ విధంగా షేర్‌ మార్కెట్‌ ర్యాలీ కొనసాగడానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.   గ్లోబల్‌ రికవరీ ఆసియా

Most from this category