News


భారతీ ఎయిర్‌టెల్‌ షేరుపై బ్రోకింగ్‌ హౌస్‌ల రేటింగ్స్‌

Friday 13th October 2017
Markets_main1507888318.png-9901

ముంబై: రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్‌ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర 9 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టస్థాయికి సమీపించింది. ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్‌ ఎలాంటి నగదును కానీ, వాటాలను కాని ఇవ్వకపోవడంతో షేరు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యింది. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.400 వద్ద ట్రేడింగ్‌ ముగించిన భారతీ ఎయిర్‌టెల్‌.. శుక్రవారం ఉదయం రూ.30 గ్యాప్‌ అప్‌తో ప్రారంభమై, ఇంట్రాడేలో రూ.437 వద్ద గరిష్టస్థాయిని నమోదుచేసింది. అంటే, కేవలం ఒక్క రూపాయి తేడాతో 52 వారాల గరిష్టస్థాయికి చేరుకుంది. విలీన అంశం కారణంగా దాదాపు 10 శాతం పెరిగిన ఈ షేరు ఇకమీదట కూడా పెరిగేందుకే అవకాశం ఎక్కువగా ఉందని పలు బ్రోకింగ్‌ సంస్థలు అంటుంటే, మరి కొన్ని సంస్థలు అండర్‌పెర్ఫార్మ్‌కే అవకాశం ఉందని భావిస్తు‍న్నాయి. ఈ విలీనం వల్ల రెవిన్యూ మార్కెట్‌ షేరులో 5 శాతం జతవుతుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనావేస్తోంది. 

భారతీ ఎయిర్‌టెల్‌కు బ్రోకింగ్‌ సంస్థలు ఇచ్చిన రేటింగ్స్‌

యూబీఎస్‌:
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ధర: రూ.495

 

హెచ్‌ఎస్‌బీసీ:
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ధర: రూ.490

 

కొటక్‌ సెక్యూరిటీస్‌:
రేటింగ్‌: యాడ్‌
టార్గెట్‌ ధర: రూ.470

 

సీఎల్‌ఎస్‌ఏ:
రేటింగ్‌: అండర్‌పెర్ఫార్మ్‌
టార్గెట్‌ ధర: రూ.430

 

క్రెడిట్‌ సూసీ:
రేటింగ్‌: న్యూట్రల్‌
టార్గెట్‌ ధర: రూ.400

 

నవంబర్ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్‌ఎల్‌), టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర (టీటీఎంఎల్‌) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్‌టెల్‌కి బదిలీ అవుతారని కంపెనీ ప్రకటించడంతో శుక్రవారం టీటీఎంఎల్‌ సైతం 10 శాతం పెరిగింది.

 

రేటింగ్స్‌ కేవలం బ్రోకింగ్‌ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఈ షేర్లలో పెట్టుబడిదలుచుకుంటే, ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోమని సాక్షిబిజినెస్‌డాట్‌కామ్‌ సూచిస్తోంది.



You may be interested

సుప్రీం తీర్పుతో జైప్రకాష్‌ ఆసోసియేట్స్‌ జూమ్‌

Friday 13th October 2017

ముంబై:- జైప్రకాష్‌ ఆసోసియేట్స్‌ షేరు శుక్రవారం బీఎస్‌ఈ ఇంట్రాడేలో దాదాపు 6శాతానికి పైగా లాభపడింది. గతంలో సుప్రీం కోర్టు ఒక దివాలా కేసులో అక్టోబర్‌ 27నాటికి రిజిస్ట్రీ వద్ద రూ.2,000 కోట్లు డిపాజిట్‌ చేయమని జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ జైపీఅసోసియేట్స్‌కు అనుబంధ సంస్థ.  డిపాజిట్‌ డబ్బు చెల్లించడానికి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన గౌతమి ఎక్స్‌ప్రెస్‌ హైవేలో కొంత వాటాను విక్రయించడానికి అనుమతులు కోరుతూ జైపీ అసోసియేట్స్‌ పిటిషన్‌

బీఎస్‌ఈ ‘ఏ’గ్రూప్‌లో ఓబెరాయ్‌ టాప్‌

Friday 13th October 2017

శుక్రవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ ‘ఏ’గ్రూప్‌ షేర్లలో ఓబెరాయ్‌ రియల్టీ టాప్‌లో నిలిచింది. మధ్యాహ్న సమయానికి ఈ షేరు సుమారు 11 శాతం లాభంతో ట్రేడవుతోంది. మొత్తంత 1.16 లక్షల షేర్లు చేతులు మారాయి. రెండో స్థానంలో దాదాపు 8 శాతం లాభంతో ఎయిర్‌టెల్‌ నిలిచింది. తర్వాత సుమారు ఏడున్నర శాతం లాభంతో శోభా, ఆర్‌కామ్‌ షేర్లు మూడు నాలుగు స్థానాల్లో ఉండగా, 6.35 శాతం లాభంతో సైయంట్‌ షేరు ఐదో

Most from this category