News


ఎయిర్‌టెల్‌ షేరు మరింత పెరగనుందా?

Monday 20th January 2020
Markets_main1579497844.png-31042

మరో 8 శాతం బలపడే చాన్స్‌
సాంకేతిక నిపుణుల అంచనాలు
11 ఏళ్ల కన్సాలిడేషన్‌ తదుపరి బ్రేకవుట్‌

దశాబ్ద కాలానికిపైగా కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌ మరింత బలపడనుందంటున్నారు సాంకేతిక నిపుణులు. సమీప కాలంలో 8 శాతం వరకూ పుంజుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో ఓపెన్‌ ఇంట్రస్ట్‌ 14 నెలల గరిష్టానికి చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏజీఆర్‌ బకాయిలపై టెల్కోల రివ్యూ పిటిషన్‌ను గత వారం సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో దేశీయంగా టెలికం రంగంలో రెండు కంపెనీలే నిలదొక్కుకోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ సైతం రూ. 34,000 కోట్లమేర బకాయిలు చెల్లించవలసి ఉన్నప్పటికీ కంపెనీ ఇటీవల ప్రకటించిన 3 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ ప్రణాళికలు ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని కలుగజేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు రూ. 44,000 కోట్లు చెల్లించవలసిన వొడాఫోన్‌ ఐడియా సమస్యలు ఎదుర్కోనున్నట్లు భావిస్తున్నారు.

వారాంతాన దూకుడు
ఏజీఆర్‌ బకాయిల అంశంలో ప్రభుత్వ సహాయం అందకుంటే.. కార్యకలాపాల మూసివేత అంటూ ఇటీవల వొడాఫోన్‌ ఐడియా హెచ్చరించడంతో ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ వాటా పెంచుకోనున్న అంచనాలు పెరిగినట్లు సాంకేతిక  నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారాంతాన ఎయిర్‌టెల్‌ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 500ను దాటినట్లు తెలియజేశారు. వెరసి ఏడాది గరిష్టాన్ని తాకిన ఈ కౌంటర్‌ ఫ్యూచర్స్‌లో ఓఐ 10 శాతం పెరిగి 5.2 కోట్లకు చేరినట్లు వివరించారు. 2018 అక్టోబర్‌ తదుపరి ఇది అత్యధికంకాగా.. గత సిరీస్‌లో రోలోవర్లు 94 శాతం జరిగినట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ నిపుణులు చందన్‌ తపారియా తెలియజేశారు. ఎయిర్‌టెల్‌ షేరుకి రూ. 475 వద్ద సపోర్ట్‌ లభిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 220-545 మధ్య 11 ఏళ్ల  కన్సాలిడేషన్‌ తదుపరి గత వారం షేరు బ్రేకవుట్‌ సాధించినట్లు ఎడిల్‌వీజ్‌ నిపుణులు యోగేష్‌ వివరించారు. దీంతో రూ. 545 స్థాయిదాటి నిలవగలిగితే.. ఈ షేరు 50 శాతం వరకూ ర్యాలీ చేసే వీలున్నట్లు అంచనా వేశారు. మోర్గాన్‌ స్టాన్లీ సైతం రానున్న నెల రోజుల్లో ఎయిర్‌టెల్‌ షేరు మరింత బలపడనున్నట్లు అభిప్రాయపడింది.You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 20th January 2020

 వివిధ వార్తలకు అనుగుణంగా స్టాక్‌ మార్కెట్‌లో  సోమవారం ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక సంవత్సరం-20 మూడో త్రైమాసికంలో అత్యధికంగా నికర లాభం రూ.11,640 కోట్లుగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,251 కోట్ల కంటే ఈ సంవత్సరం నికర లాభం 13.5 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: ఈ బ్యాంక్‌ లాభం 33 శాతం పెరిగినప్పటికీ రుణ నాణ్యత బలహీన పడడంతో నిబంధనలు పెరిగాయి. ఈ

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 20th January 2020

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం పసిడి ఫ్యూచర్ల ధర స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.20ల నష్టంతో రూ.39927.00 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరిమితి శ్రేణిలో కదలాడటం, నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్‌ ప్రారంభం, దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు రికార్డు స్థాయి వద్ద ప్రారంభం కావడం పసిడి

Most from this category