News


భారతీ ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌!

Saturday 12th October 2019
Markets_main1570876639.png-28847

‘జీయో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై చార్జీలను వసూల్‌ చేయడం మొదలుపెట్టడంతో ఎయిర్‌టెల్‌కు లాభం చేకూరుతుంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నాం’ అని చార్ట్ అడ్వైజ్‌ వ్యవస్థాపకుడు, సీ.కే నారాయణ్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...
అరబిందో ఫార్మా పతనం కొనసాగుతుంది..
ఫార్మా సెక్టార్‌లో సన్‌ ఫార్మా, లుపిన్‌ వంటి కంపెనీల షేర్లు నష్టపోతున్నప్పటికి, అరబిందో ఫార్మా మాత్రం నెలల తరబడి స్థిరమైన ప్రదర్శన చేస్తూవచ్చింది. కానీ గతవారం అరబిందో ఫార్మాకు సంబంధించి ప్రతికూల వార్తలు వెలువడడంతో ఈ స్టాక్‌ గత కొన్ని సెషన్లలో భారీగా పడిపోయింది. ఈ స్టాక్‌పై ఉన్న లాంగ్‌ పొజిషన్‌లు వేగంగా ఆఫ్‌లోడ్‌ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ కంపెనీ షేరు మద్ధతు స్థాయికి చాలా దిగువన ట్రేడవుతోంది.  గతంలో మద్దతుస్థాయిగా నిలిచిన రూ. 650-రూ.750 స్థాయిలను ఈ షేరు తిరిగి చేరుకోవడం కష్టంగా కనిపిస్తోంది. స్వల్పకాలంలో రూ. 500- 550 స్థాయి నిరోధించవచ్చని, రూ. 400-430 శ్రేణి మద్దనివ్వచ్చన్నది నా అంచనా.
ఇండియాబుల్స్‌ అనిశ్చితి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది...
ఇండియా బుల్స్ గ్రూప్‌ కొన్ని వివాదాలలో​ చిక్కుకుంది. ఫలితంగా ఈ గ్రూప్‌కు సంబంధించిన షేర్లు భారీగా పడిపోతున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు ఈ స్టాకును కొనుగోలు చేయడానికి సిద్ధపడడం లేదు. ఈ స్టాకును అధికంగా కొనుగోలు చేస్తుంది కూడా ట్రేడర్లే. కానీ ఈ ట్రేడర్లు కొన్ని సమస్యలు ఏర్పడగానే భయపడుతున్నారు. వారు తమ లాంగ్‌ పొజిషన్లను క్లోజ్‌చేసుకుంటున్నారు. ఈ స్టాకుకు సంబంధించి బేర్స్‌ మాత్రం ఉత్సాహాంగా ఉన్నారు. ఫలితంగా ఇండియా బుల్స్‌ గ్రూప్‌ స్టాకులు కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. కానీ ఈ స్టాకుల కదలికలలో అనిశ్చితి అధికంగా ఉండడంతో రిస్క్‌ తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. అనిశ్చితి అధికంగా ఉన్న స్టాకులను సరియైన సమయంలో ఎంచుకుంటే స్వల్సకాలంలో మంచి లాభాల్లోచ్చే అవకాశం ఉండడంతో ఇండియా బుల్స్‌ స్టాక్‌లపై బుల్స్‌ కూడా కొంత ఆసక్తిని చూపిస్తున్నారు. గత సెషన్లో చూసుకున్న.. ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు లొయర్‌ సర్క్యూట్‌ను తాకింది. తర్వాత ఇదే సెషన్లో అప్పర్‌ సర్య్కూట్‌ వరకు కూడా కదిలింది.
ఎయిర్‌ టెల్‌ రూ. 400 వైపు...  
జియో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై 6 పై/నిముషానికి వసూలు చేయాలని నిర్ణయించడంతో, ఈ రంగంలోనే ఉన్న పెద్ద కంపెనీ భారతి ఎయిర్‌టెల్ బాగా లాభపడే అవకాశం ఉంది. అందుకే ఈ కంపెనీ షేరు గత రెండు సెషన్‌లో బాగా లాభపడింది. భారతీ ఎయిర్‌టెల్‌ షేరును కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నా. ఎన్నో నెలలుగా ఈ స్టాక్ రూ. 370-375 స్థాయిని అధిగమించడానికి కష్టపడినప్పటికి, ఈ వారం ఈ స్థాయిని అధిగమించి రూ. 384-రూ. 385 స్థాయి వద్ద ముగిసింది. టెలికాంలో సెక్టార్‌లో కీలక కంపెనీగా ఉండడంతో పాటు జియో నిర్ణయం వలన ఈ కంపెనీ ధరలను పెంచడంలో ఒత్తిడి గురికాకపోవచ్చు. ఫలితంగా భారతీ ఎయిర్‌టెల్‌ లాభం పెరిగే అవకాశం ఉంది. వచ్చే వారంలో ఈ స్టాక్‌ రూ. 400 ప్లస్‌ ధర వైపు కదులుతుందని అంచనావేస్తున్నా.

మార్కెట్‌ హెచ్చుతగ్గుల గురించి....
ఈ అంశాన్ని రెండు భాగాలు చూడాల్సివుంటుంది. సెప్టెంబర్‌ 20న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వార్త వెలువడగానే నిఫ్టీ జోరుగా 1000 పాయింట్లకుపైగా పెరిగింది. అటుతర్వాత సెప్టెంబర్‌ 23 నుంచి క్షీణత మొదలై, అంతకుముందు ఆర్జించిన లాభాల్లో 50 శాతం తినేసింది. అయితే ఇండియాబుల్స్‌ హౌసింగ్, పీఈఎల్, యస్‌బ్యాంక్‌ వంటి భారీ పతనాల్ని మినహాయిస్తే ప్రధాన షేర్లేవీ పెద్దగా తగ్గలేదు. ఆటోమొబైల్స్, మెటల్స్, ఫార్మా రంగాల క్షీణత కొనసాగినప్పటికీ, నాలుగైదు పెద్ద షేర్లు మాత్రం స్థిరంగా ట్రేడయ్యాయి. అలాగని వాటిలో జోరుగా కొనుగోళ్లు కూడా జరగలేదు. ఎందుకంటే ఫలితాల సీజన్‌ ప్రారంభమైన తర్వాత వాటిపై తదుపరి నిర్ణయాన్ని మార్కెట్‌ తీసుకోదల్చినట్లుంది. ముఖ్యంగా సెప్టెంబర్‌ మూడోవారంలో జోరుగా పెరిగిన ఫలితంగా వాటిని అమ్మడానికి కూడా ఇన్వెస్టర్లు వెనుకంజ వేశారు. అందుచేత సూచీలు సమీపకాలంలో స్వల్పశ్రేణిలోనే కదలవచ్చు. You may be interested

టీసీఎస్‌ Vs ఇన్ఫోసిస్‌.. ఎలా ఉన్నాయి?

Saturday 12th October 2019

క్యు2లో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ కన్నా ఇన్ఫోసిస్‌ మెరుగైన ఫలితాలను ప్రకటించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్యు2లో ఇన్ఫీ తన పూర్తి సంవత్సర గైడెన్స్‌ను 9 నుంచి 10 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఆరంభంలో ఇన్ఫీ కన్నా వాల్యూషన్లలో ప్రీమియం సంపాదించిన టీసీఎస్‌ ప్రస్తుతం ఈ ప్రీమియం మొత్తం కోల్పోయిందని నిర్మల్‌బ్యాంగ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇందుకు తగ్గట్లే ఇన్ఫీ సైతం డిజిటల్‌ విభాగంలో మంచి వృద్ధి సాధిస్తామని చెబుతోంది. మరోవైపు

T2T, A, B, Z స్టాకులంటే ఏంటి?

Saturday 12th October 2019

లిస్టెడ్‌ స్టాకుల్లో అనేక వర్గీకరణలుంటాయి. ఇన్వెస్టర్లకు స్టాకుల గురించి అవగాహన పెంచేందుకు ఎక్చేంజ్‌లు ఇలా వర్గీకరణ చేస్తాయి. ఆయా ట్రేడింగ్‌ లక్షణాల ఆధారంగా షేర్లను ఎక్చేంజ్‌లు వర్గీకరిస్తాయి. ఒక షేరు ఏ తరగతిలో ఉందో తెలుసుకోవడం ద్వారా దాని స్వరూప స్వభావాలు అర్ధం చేసుకోవచ్చు. రెండు ప్రధాన ఎక్చేంజ్‌ల్లో ఈ వర్గీకరణ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ముందుగా బీఎస్‌ఈలో వివిధ గ్రూపుల గురించి తెలుసుకుందాం.. బీఎస్‌ఈలో స్టాకులను A, B, S,

Most from this category