News


26 నెలల గరిష్టానికి ఎయిర్‌టెల్‌

Friday 17th January 2020
Markets_main1579249365.png-30992

ఏజీఆర్‌ రివ్యూ పిటీషన్‌ సుప్రీం కోర్టుకు కొట్టివేసిన నేపథ్యంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 26నెలల గరిష్టస్థాయిని అందుకుంది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో అధిక భాగం మార్కెట్‌ వాటాను దక్కించుకుంటుందనే అంచనాలు షేరు ర్యాలీకి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో​కంపెనీ షేరు రూ.470.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీం కోర్డు శుక్రవారం కొట్టివేసింది. గతవారంలో భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ 2బిలియన్‌ డాలర్లు క్యూఐపీ ఇష్యూ ద్వారా, 1బిలియన్‌ డాలరు ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్ల జారీ ద్వారా మొత్తం 3బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. సమీకరించిన మొత్తం నిధుల్లో అధిక భాగం చట్టబద్ధమైన బకాయిలు చెల్లింపులకు వినియోగిస్తామని తెలిపింది. అలాగే బ్యాలెన్స్‌ షీట్‌ను బలపరుచుకోవడానికి, స్వల్ప, దీర్ఘకాలిక రుణ మూలధన వ్యయాల తిరిగి చెల్లించడానికి వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. 

సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌ కొట్టివేత కారణంగా వోడాఫోన్‌-ఐడియా తిరిగి కోలుకునే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నాము. మూతపడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మా అంచనా నిజమైతే... వోడాఫోన్‌ ఐడియాకు చెందిన మొత్తం సబ్‌స్క్రైబర్ల వాటాలో 40శాతం ఎయిర్‌టెల్‌ దక్కించుకోనుంది. అందుకు కోసం ఎయిర్‌టెల్‌ కనీసం 5బిలియన్ డాలర్ల స్పెక్ట్రం పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇటీవల కంపెనీ సమీకరించిన మొత్తం పెట్టుబడుల్లో అధిక భాగం రుణాలను చెల్లించడానికి వినియోగిస్తామని ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఒకవేళ కన్సాలిడేషన్‌ మార్కెట్‌ నిర్మాణం నుంచి ఇది లాభపడితే పైన పేర్కొన్న విధంగా స్పెక్ట్రం మూలధనానికి మరోసారి రుణ సమీకరణ అవసరం అవుతోందని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 

ఈ కారణాలతో నేడు భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ఇంట్రాడేలో 6.23శాతం పెరిగి రూ.503.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరుకు 26నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.503.60)తో పోలిస్తే 5.50శాతం లాభంతో రూ.500.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.269.25లు, రూ.503.60లుగా నమోదయ్యాయి. You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా...

Friday 17th January 2020

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది. ఈ క్యూ3లో కంపెనీ నికరలాభం 10-14శాతం వృద్ధిని సాధించవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, టెలికాం వ్యాపారాల పనితీరు మెప్పించవచ్చు. పెట్రోకెమికల్స్‌ వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. డిసెంబర్‌ క్వార్టర్‌లో రిఫైనింగ్ మార్జిన్లు 9.2-9.6డాలర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. జేఎం ఫైనాన్సియల్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు:- త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం

బ్యాంకులకు ఏజీఆర్‌ భయాలు?!

Friday 17th January 2020

సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలపై టెలికం కంపెనీలు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగంవైపు దృష్టిసారిస్తున్నారు. యూబీఎస్‌ గ్రూప్‌ వివరాల ప్రకారం మొబైల్‌ టెలికం కంపెనీలు ప్రభుత్వానికి 13 బిలియన్‌ డాలర్ల బకాయిలను చెల్లించవలసిఉంది. ఈ కారణంగా వైర్‌లెస్‌ టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులపై ఈ ప్రభావం కనిపించే అవకాశముంది. ఏజీఆర్‌ చెల్లింపులు టెలికం కంపెనీల క్యాష్‌ ఫ్లోలను దెబ్బతీసే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు

Most from this category