News


భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ షేరుకు ఫలితాల షాక్‌

Tuesday 5th November 2019
Markets_main1572938368.png-29364

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 6శాతం నష్టపోయింది. కంపెనీ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం షేరు నష్టానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.115.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 6శాతం నష్టపోయి రూ.112.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.119.45)తో పోలిస్తే 5.50శాతం నష్టంతో రూ.113.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.72.55, రూ.122.15లుగా ఉన్నాయి. ప్రసుత్తం కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.29,105.10 కోట్లుగా ఉంది. 

క్యూ2 ఫలితాలు:- 
సెప్టెంబర్‌ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపాదికన కంపెనీ నికర లాభం 40.58శాతం క్షీణించింది. గతేడాదిలో క్యూ2లో రూ.571.31 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఈ క్యూ2లో రూ.339.49 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు సైతం 19శాతం తగ్గాయి. గతేడాది ఇదే క్యూ2లో రూ.3282.40 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది క్యూ2లో రూ.2661.25 కోట్లకు తగ్గాయి. 



You may be interested

లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లిన మార్కెట్‌

Tuesday 5th November 2019

300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 11900 దిగువకు నిఫ్టీ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ షేర్ల అ‍మ్మకాలు మొదలవడంతో మంగళవారం మిడ్‌సెషన్‌ మార్కెట్‌ నష్టాల్లోకి మళ్లింది. దీంతో ఏడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడినట్లైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడే మార్కెట్‌ పాజిటివ్‌గానే ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కిత్రం రోజు రికార్డు స్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్‌ నేడు మరో 164 పాయింట్లు లాభపడి 40,466.55 వద్ద,

ఈ స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్‌ సంకేతాలు!

Tuesday 5th November 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 42 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌, టాటాపవర్‌, మాక్స్‌ ఫైనాన్షియల్స్‌, కరూర్‌ వైశ్యాబ్యాంక్‌, టొరెంట్‌ పవర్‌, వరుణ్‌ బెవరేజెస్‌, షాలిమార్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రాలీస్‌ ఇండియా, చోళమండలం, సెంచరీ ప్లైబోర్డ్స్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌

Most from this category