News


భారత్‌-22 ఈటీఎఫ్‌ నాలుగో విడత రేపే..!

Wednesday 2nd October 2019
Markets_main1570013504.png-28677

భారత్‌-22 ఈటీఎఫ్‌(ఎక్చ్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌) నాలుగో విడుత ఇష్యూ గురువారం ప్రారంభం కాబోతుంది. తొలిరోజు యాంకర్‌ ఇన్వెస్టర్లు, మరుసటి రోజు సంస్థాగత, రిటైల్‌ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇష్యూ ద్వారా కేంద్రం రూ.8000 కోట్ల నిధుల సమీరకణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరపై 3 శాతం డిస్కౌంట్‌తో లభించనుంది. ఇష్యూ ద్వారా మొత్తం రూ.2000 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నాం. ఒకవేళ ఇష్యూకు అధిక స్పందన వస్తే కోట్లను గ్రీన్-షూ అప్షన్‌ను పరిశీలిస్తున్నాం. మొత్తం ఇష్యూ పరిమాణం రూ.8000 కోట్లకు చేరుతుందని ఇష్యూతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర నిర్దేశించుకున్న రూ.1.05లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈటీఎఫ్‌ ద్వారా వచ్చే ఆదాయం సహాయపడుతుందని ఆయన తెలిపారు. భారత్‌-22 ఈటీఎఫ్‌ ఇష్యూ ద్వారా ఇప్పటి వరకు కేంద్రం రూ.35,900 కోట్లు సేకరించింది. 2017 నవంబరులో రూ.14,500 కోట్లు, 2018 జూన్‌లో రూ.8,400 కోట్లు, 2019 ఫిబ్రవరిలో రూ.13,000 కోట్లు సమీకరించింది.  

భారత్‌ ఈటీఎఫ్‌లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, నాల్కోలతో పాటు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇంజనీర్స్‌ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌జేవీఎన్‌ఎల్‌, గెయిల్‌, పీజీసీఐఎల్‌, ఎన్‌సీఎల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ కంపెనీలున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగం నుంచి ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులున్నాయి. 



You may be interested

రాబడుల్నిచ్చే టాప్‌ సిఫార్సులు ఇవే

Wednesday 2nd October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం నెగిటివ్‌లోనే ప్రారంభమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో పాటు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌-లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ సంఘటన, పీఎంసీ(పంజాబ్‌, మహారాష్ట్ర కో ఆపరేటివ్‌) బ్యాంక్‌ మోసం వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. గత సెషన్‌లో షార్ట్‌కవరింగ్‌ జరగడంతో సెన్సెక్స్‌ 700 పాయింట్లు నష్టాన్ని పూడ్చుకోగలిగి 38,000 స్థాయి పైన ముగిసింది.      సెన్సెక్స్‌ సెప్టెంబర్‌లో

డాలర్‌ ఎఫెక్ట్‌: లాభాల్లోకి పసిడి

Wednesday 2nd October 2019

గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల్లో ట్రేడైన పసిడి ధర తిరిగి లాభాల బాట పట్టింది. సెప్టెంబర్‌లో అమెరికా ఫ్యాక్టరీ యాక్టివిటీ పదేళ్ల కనిష్ట స్థాయికి  క్షీణించినట్లు నిన్నరాత్రి గణాంకాలు వెలువడ్డాయి. దీంతో ఆర్థిక మందగమన ఆందోళనలు తెరపైకి రావడంతో పాటు డాలర్‌,  బాండ్‌ ఈల్డ్స్‌ బలహీనడ్డాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  ఈ పరిణామాలు పసిడి ర్యాలీకి మద్దతినివ్వడంతో అమెరికా మార్కెట్లో రాత్రి ఒకదశలో పసిడి ధర 1500డాలర్ల

Most from this category