News


భారత్‌-22 ఈటీఎఫ్‌కు 12రెట్లు అధిక స్పందన

Saturday 5th October 2019
Markets_main1570269618.png-28738

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ నిర్వహించిన భారత్‌ 22 ఈటీఎఫ్‌ నాలుగో విడుత ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభిస్తుంది. రూ.2000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఆఫర్‌ తీసుకురాగా. 12రెట్ల అధికంగా రూ.23, 500 కోట్ల విలువైన బిడ్లు ధాఖలయ్యాయి. ఆఫర్‌ నుంచి అదనంగా మరో రూ.4368 కోట్ల బిడ్లను అట్టిపెట్టికోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ తెలిపారు. తక్కువ వాల్యూవేషన్లు, పెట్టుబడుల ఉపసంహరణలపై ఆశలు, మంచి కార్పొరేట్ గవర్నెన్స్‌ కారణంగా పెట్టుబడిదారులు ప్రభుత్వరంగ స్టాక్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఇష్యూ ధరపై మూడు శాతం డిస్కౌంట్‌ ఇవ్వడం కూడా కలిసొచ్చినట్లు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం రూ.500 కోట్ల విలువైన యూనిట్లు రిజర్వు చేయగా రూ.13,569 కోట్ల విలువైన యూనిట్లకు బిడ్లు అందాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన మొత్తానికి ఇది 27రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం భారత్‌-22 ఈటీఎఫ్‌ల ద్వారా ఇప్పటివరకు రూ.35,900 కోట్లను సమీకరించింది. భారత్‌-22 ఈటీఎఫ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 22 షేర్లు కేంద్రీకృమైన ఉన్నాయి. ఈ ఫోర్ట్‌ఫోలియో టాప్‌ హోల్డింగ్‌ సంస్థలైన ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీలకు 56శాతం వాటా ఉంది. 
 



You may be interested

డిజిన్వెస్ట్‌మెంట్‌ను వేగవంతం చేసిన ప్రభుత్వం

Saturday 5th October 2019

ప్రభుత్వరం‍గ సంస్థలలోని తమ వాటాను వేగంగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్‌, డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియను వేగతరం చేసేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆర్థిక శాఖ కింద పనిచేస్తున్నా ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(డీఐపీఏఎం) శాఖను డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియలో కీలక డిపార్ట్‌మెంట్‌గా మార్చింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధిగమనించేందుకు, వేగంగా ఈ పక్రియను పూర్తిచేసేందుకు, మంత్రుల

అంత ర్యాలీ అనంతరం ఇంత పతనం.. మాములే!

Saturday 5th October 2019

నిపుణుల అభిప్రాయం గతనెల ప్రభుత్వ ప్రకటన అనంతరం వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించాలని బుల్స్‌ ఎంత ప్రయత్నించినా చివరకు మార్కెట్‌ మాత్రం బేర్స్‌ పట్టులోకే జారింది. ఆర్‌బీఐ వృద్ధి రేటు అంచనాలను తగ్గించడంతో మార్కెట్‌ ఈ వారాన్ని నష్టాలతో ముగించింది. అయితే గత నెల చివర్లో భారీగా పెరిగిన సూచీలు ఈమాత్రం పతనం కావడం కామనేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 11000- 11100 పాయింట్ల వరకు దిగజారడాన్ని సాధారణ పతనంగానే భావించాలంటున్నారు. ఈవారం

Most from this category