News


భారత్‌ 22 ఈటీఎఫ్‌ నాలుగో ఇష్యూ ఆకర్షణియం!

Monday 30th September 2019
Markets_main1569827057.png-28624

-పీఎస్‌యూ స్టాకుల ర్యాలీతో స్వల్పకాలానికి ఈ ఈటీఎఫ్‌ మంచిదే
-కానీ దీర్ఘకాల ఇన్వెస్టర్లు దూరంగా ఉండే అవకాశం: విశ్లేషకులు

  ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంకులు, కొన్ని ప్రైవేట్‌ కంపెనీల స్టాకులను కలిగి ఉన్న భారత్‌ 22 ఈటీఎఫ్‌(ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) నాలుగో విడత ఇష్యు అక్టోబర్‌ 3 వ తేది నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఇష్యు ద్వారా రూ. 8,000 కోట్లను సమీకరించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకొస్తుంది. అక్టోబర్‌ 3 వ తేదిన యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం ఈ ఇష్యు సిద్ధమవుతుండగా, సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్‌ 4 న అందుబాటులోకి రానుంది. 
  
పీఎస్‌యూల ర్యాలీ..భారత్‌ 22 ఈటీఎఫ్‌ మంచిదే
భారత్‌ 22 ఈటీఎఫ్‌ నాల్గవ విడత ఇష్యు బేష్‌ ఆఫర్‌ రూ. 2,000 కోట్లుగా ఉండగా, అదనంగా రూ. 6,000 కోట్ల సబ్‌స్క్రయిబ్‌ చేసుకునే  అవకాశం ఉంది. ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇంజనీరింగ్‌ ఇండియా, ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి ప్రభుత్వం రంగ కంపెనీలు షేర్లు, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ ప్రైవేట్‌ కంపెనీల షేర్లు భారత్‌ 22 ఈటీఎఫ్‌లో ఉన్నాయి. పీఎస్‌ఈ(ప్రభుత్వ రంగ యూనిట్లు) స్టాకుల వాల్యుషన్‌లు పడిపోవడంతోపాటు, డివిడెండ్‌లపై అధిక రాబడి వంటి అంశాల వలన పీఎస్‌యూ స్టాకులలో స్వల్పకాల ర్యాలీ జరిగే అవకాశం ఉందని, ఫలితంగా భారత్‌ 22 ఈటీఎఫ్ కోసం ఇన్వెస్టర్లు అధికంగా వేచి చూస్తున్నారని విశ్లేషకులు తెలిపారు. ‘చాలా వరకు పీఎస్‌యూ స్టాకుల వాల్యుషన్‌లు పడిపోవడంతో, స్వల్పకాలానికి గాను ఇన్వెస్టర్లు భారత్‌ 22 ఈటీఎఫ్‌ను వినియోగించుకుంటారు’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్‌ అడ్వజర్స్‌, వ్యవస్థాపకుడు తరుణ్‌ బిరన్‌ అన్నారు.  గత కొంత కాలంగా పీఎస్‌యూల పనితీరు బాగుండకపోవడంతో పాటు, ప్రభుత్వానికి ఈ సంస్థలకు తగినంత క్యాపిటల్‌ను కేటాయించే సామర్ధ్యం లేకపోవడంతో దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఈ ఇష్యుపై అంతగా దృష్ఠి పెట్టరని ఆయన అన్నారు. కాగా 2017 నవంబర్‌లో మొదటి భారత్‌ 22 ఈటీఎఫ్‌ ఇష్యు ప్రారంభమైంది. గత ఏడాది కాలంలో భారత్‌ 22 ఈటీఎఫ్‌ 1.6 శాతం పతనమవ్వగా, ఇదే సమయంలో ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6.22 శాతం పెరగడం గమనార్హం. 



You may be interested

రియల్‌ ఎస్టేట్స్‌ షేర్ల భారీ పతనం

Monday 30th September 2019

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ షేర్ల భారీ పతనంతో సోమవారం నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 261.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సంస్థలో మోసం జరిగిందనే ఆరోపణలపై కోర్టు దర్యాప్తునుకు ఆదేశించిన నేపథ్యంలో తన సహచర కంపెనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఒకరోజులో అతిపెద్ద నష్టాన్ని చవిచూసి ఐదేళ్ల కనిష్టానికి పతనమైంది. ఈ ప్రభావంతో ఇదే

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం

Monday 30th September 2019

నష్టాల మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌  ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 4శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,380.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ పతనం నుంచే ప్రభుత్వరంగ రంగ షేర్లలో భారీ అమ్మకాలు నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో దాదాపు 4శాతం నష్టపోయి 2286.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని

Most from this category