News


బీజీఆర్‌, అదానీ, యాస్టర్‌.. జోరు

Thursday 9th January 2020
Markets_main1578560244.png-30801

బీజీఆర్‌ ఎనర్జీ
అదానీ గ్రీన్‌ ఎనర్జీ
యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌

ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 570 పాయింట్లు జంప్‌చేసి 41,387కు చేరగా.. నిఫ్టీ 170 పాయింట్లు జమ చేసుకుని 12,195 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ వార్తల ఆధారంగా మూడు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

బీజీఆర్‌ ఎనర్జీ
ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ విభాగం ద్వారా తమిళనాడులో సబ్‌స్టేషన్‌ ఎరక్షన్‌ కాంట్రాక్టును పొందినట్లు విద్యుత్‌ రంగ మౌలిక సదుపాయాల కంపెనీ బీజీఆర్‌ ఎనర్జీ వెల్లడించింది. రూ. 224.3 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌లో భాగంగా 400/230-110 కేవీ ఏఐఎస్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు అవసరమైన డిజైన్‌, ఫ్యాబ్రికేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్లు, తయారీ, సరఫరా, ఇంజినీరింగ్‌, సివిల్‌ తదితర పలు రకాల పనులను చేపట్టవలసి ఉన్నట్లు వివరించింది. ఏడాదిన్నర కాలంలో ప్రాజెక్టును పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో బీజీఆర్‌ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 14 శాతం దూసుకెళ్లింది. రూ. 40 వద్ద ట్రేడవుతోంది. 

అదానీ గ్రీన్‌ ఎనర్జీ
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌లో సోలార్‌ (ఏసీ)నిర్వహణ సామర్థ్యం 13 శాతంపైగా పెరిగి 2148 మెగావాట్లను తాకినట్లు అదానీ గ్రీన్‌ ఎనర్జీ పేర్కొంది. ఇక డీసీ విభాగం సైతం 15 శాతం పుంజుకుని 2803 మెగావాట్లకు చేరినట్లు వెల్లడించింది. అయితే వరదల కారణంగా సోలార్‌ పోర్ట్‌ఫోలియో పీఎల్‌ఎఫ్‌ 2 శాతం నీరసించి 97.3 శాతానికి పరిమితమైనట్లు వెల్లడించింది. ఇక పవన విద్యుత్‌ విభాగంలో 21.5 శాతం సామర్థ్య వినియోగం అందుకున్నట్లు తెలియజేసింది. గతేడాది(2018-19)లో ఇది 8.3 శాతమేనని తెలియజేసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 232 వద్ద ఫ్రీజయ్యింది. 

యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చిన ఆరోగ్య పరిరక్షణ రంగ కంపెనీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం లాభపడి రూ. 163 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 6 శాతం జంప్‌చేసి రూ. 167ను తాకింది. ఈక్విటీ  షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను నేడు సమావేశంకానున్న బోర్డు పరిశీలించనున్నట్లు యాస్టర్‌ డీఎం ఇప్పటికే  తెలియజేసింది. కంపెనీ గల్ఫ్‌ సహకార సమితి(జీసీసీ) దేశాలతోపాటు, దేశీయంగానూ ఆసుపత్రులు, ఫార్మసీలను నిర్వహిస్తున్న విషయం విదితమే.You may be interested

చిన్న స్టాకులు కొనే సమయం ఇదేనా?!

Thursday 9th January 2020

అవునంటున్న బ్రోకరేజ్‌లు కొత్త ఏడాది దలాల్‌ స్ట్రీట్‌లో ట్రెండ్‌ మారుతుందని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే రెండేళ్లుగా మార్కెట్లో నీరసంగా ఉంటున్న చిన్న షేర్లు ఈ ఏడాది పుంజుకుంటాయంటున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్‌ యూఎస్‌, జపాన్‌ మార్కెట్లలో కనిపిస్తోందన్నారు. దేశీయ మిడ్‌క్యాప్స్‌ సైతం అంతర్జాతీయ మిడ్‌క్యాప్‌ సూచీలతో సమన్వయం కలిగి ఉంటాయని, అందువల్ల మన దగ్గర కూడా స్మాల్‌స్టాక్స్‌ పరుగులు తీసే సమయం వచ్చిందని చెబుతున్నారు. యూఎస్‌లో, యూరప్‌లో మిడ్‌క్యాప్‌

32వేల పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 9th January 2020

799 పాయింట్లు లాభపడ్డ ఇండెక్స్‌ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న భారీ కొనుగోళ్ల మద్దతు కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం తిరిగి 32వేల స్థాయిని అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ బుధవారం క్లోజింగ్‌ 31373 పాయింట్ల నుంచి దాదాపు 400 పాయింట్ల లాభంతో 31748 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటికి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో

Most from this category