News


అస్థిర పరిస్థితులలో లార్జ్‌ క్యాప్‌లను విడిచిపెట్టకండి

Friday 26th July 2019
Markets_main1564130968.png-27329

‘కొన్ని బ్యాంకులు మంచి ఫలితాలను ప్రకటించడం గమనించాం. కానీ ప్రస్తుత పరిస్థితులు సమస్యగా ఉన్నాయి’ అని మోతిలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌ , రిటైల్ రీసెర్చ్ హెడ్, సిద్ధార్థ ఖేమ్కా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

లార్జ్‌ క్యాప్‌లను విడిచిపెట్టొద్దు..
ప్రస్తుత అస్థిర పరిస్థితులలో  నాణ్యమైన  లార్జ్‌క్యాప్‌లను ఎంచుకోవడం మంచిది. అలాగే ప్రస్తుత సమస్యాత్మక పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్స్‌ను విడిచిపెట్టడం కూడా మంచిదికాదు. ఇప్పటికే కొన్ని లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు జూన్‌ త్రైమాసిక ఫలితాలలో మంచి ఫలితాలతో వచ్చాయి. యునైటెడ్‌ స్పిరిట్స్‌ ప్రస్తుత పరిస్థితులలో కూడా మంచి ఫలితాలను ప్రకటించింది. స్పిరిట్‌ వ్యాపారంలో అంతరాయాలను దాటుకొని మార్జిన్లను మెరుగుపరచడానికి కంపెనీ పయత్నాలు చేస్తోంది. సంస్థ కొన్ని వ్యయ-పొదుపు చర్యల నుంచి లబ్ది పొందుతోంది. ప్రస్తుతం ఈ స్టాక్ ఆర్థిక సంవత్సరం 2021 లాభాలకు సుమారు 35 రెట్లుగా ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ స్టాకును పరిశీలించవచ్చు. ఈ కంపెనీ టార్గెట్‌ ధరను రూ.700 గా నిర్ణయించాం.

బజాజ్‌ ఆటో ఫలితాలు 
బజాజ్ ఆటో త్రైమాసిక ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ క్వార్టర్‌లో మొత్తం వాల్యూమ్‌ల వృద్ధి చాలా ఫ్లాట్‌గా 2 శాతం పెరిగింది.  మోటారుసైకిల్ విభాగంలో బజాజ్‌ వాల్యూమ్‌లు పెరిగాయి. మాస్ వాల్యూమ్‌లోకి, ఎంట్రీ లెవల్ విభాగంలోకి మారే వ్యూహం మార్కెట్ వాటాను కొంత పొందటానికి సహాయపడింది. మోటారుసైకిల్ వాల్యూమ్‌లు ఏడాది నుంచి ఏడాది ప్రాతిపదికన 4 శాతం పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ ఈ వ్యూహం కొంత మార్జిన్లు  తగ్గడానికి కారణం కావచ్చు.  బజాజ్ ఆటో మార్జిన్లలో 180 బేసిస్‌ పాయింట్ల తగ్గుదల ఉంటుందని అంచనా వేశాం. ఫలితంగా పాట్(పన్నుల తర్వాత లాభం) ఈ త్రైమాసికంలో 3 శాతం తగ్గునుంది. 

ఐసీఐసీఐ ప్రూడ్‌ను పరిశీలించండి
ఇన్సురెన్స్‌ రంగాన్ని గమనిస్తున్నాం.  హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ బలమైన ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ కూడా మంచి సంఖ్యలతోనే వచ్చింది. గత కొన్నేళ్లు నుంచి ఐసిఐసిఐ ప్రూడ్‌ వృద్ధిలో అనిశ్చితి ఉంది. కానీ ఈ జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ మొత్తం వృద్ధి పరంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. యులిప్‌(యూనిట్‌ లింక్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌) విభాగంలో గత కొన్నేళ్ల నుంచి క్షీణించిన వార్షిక ప్రీమియం ఆదాయం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కొంత వృద్ధిని సాధించింది. ఇది స్థిరంగా కొనసాగగలదని అంచనావేస్తున్నాం. రాబోయే రెండేళ్ల దృక్పథాన్ని పరిశీలిస్తే హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్‌ 30 శాతం పైనే వృద్ధిని నమోదు చేస్తుంది. ఐసీఐసీఐ ప్రూడ్‌ వృద్ధి ‍కూడా ఇప్పుడు 20 శాతం పైనే ఉంది. ఈ కంపెనీ టార్గెట్‌ ధరను రూ.475 గా నిర్ణయించి ‘బై’ రేటింగ్‌ను ఇస్తున్నాం. 

 You may be interested

యస్‌బ్యాంక్‌ 10శాతం జంప్‌

Friday 26th July 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌లో యస్‌బ్యాంక్‌ షేర్లు రూ.88.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా దేశపు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ టీపీజీ క్యాపిటల్‌, బ్రిటన్‌ దేశపు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషన్‌లు సంస్థలు యస్‌ బ్యాంకులో దాదాపు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఈ బ్యాంకు షేర్లకు

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Friday 26th July 2019

1శాతం లాభపడ్డ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మార్కెట్లో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 1శాతం లాభపడింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు 29,062.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరు రోజుల వరుస పతనం అనంతరం నేడు మార్కెట్లో జరుగుతున్న కొనుగోళ్లతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా ఇండెక్స్ ఒక దశలో 300

Most from this category