News


మార్జిన్లు క్రమంగా పెరుగుతున్నాయ్‌..! 

Saturday 30th November 2019
Markets_main1575055085.png-29962

లాభాల మార్జిన్లను క్రమంగా పెంచుకుంటున్న కంపెనీలు పెట్టుబడులకు మంచి అవకాశాలు అవుతాయా..? బీఎస్‌ఈ 500 సూచీలోని ఏడు కంపెనీలు గత నాలుగు త్రైమాసికాల నుంచి తమ లాభాల మార్జిన్లలో వృద్ధిని చూపిస్తున్నాయి. మరి పెరుగుతున్న మార్జిన్లకు అనుగుణంగా ఈ స్టాక్స్‌ ర్యాలీ చేయాలి కదా..! కానీ, అన్నింటిలోనూ ర్యాలీ కనిపించడం లేదు. వీటిల్లో ర్యాలీకి మంచి అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది. 

 

లాభాల మార్జిన్లను పెంచుకుంటున్న వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు ఈ ఏడాది ఇప్పటి వరకు 141 శాతం ర్యాలీ చేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ మార్జిన్‌ 73.90 శాతంగా ఉంది. జూన్‌ త్రైమాసికంలో ఉన్న 57.90 శాతం కంటే 16 శాతం అధికం. క్రితం ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఉన్న 42.9 శాతంతో పోలిస్తే 31 శాతం ఎక్కువ. ఎస్‌ఆర్‌ఎఫ్‌, దీపక్‌ నైట్రేట్‌ సైతం లాభాల మార్జిన్లను పెంచుకుంటూ వస్తున్నవే. కాకపోతే ఈ రెండు స్టాక్స్‌ 58 శాతం, 56 శాతం చొప్పున ఈ ఏడాది పెరిగాయి. అదే సమయంలో గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ ఇండియా, జేకే లక్ష్మీ సిమెంట్‌, నీల్‌కమల్‌, షీలాఫోమ్‌ కంపెనీల లాభాల మార్జిన్లు పెరుగుతున్నా, స్టాక్స్‌ మత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం చాలా కంపెనీలకు లాభాలు పెరిగేందుకు దోహదం చేసింది. అయితే, గత నాలుగు త్రైమాసికాలుగా లాభాల మార్జిన్లు పెంచుకుంటున్న కంపెనీల పట్ల అనలిస్టులు సానుకూలంగా ఉన్నారు. 

 

గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ ఈ విభాగంలో మార్కెట్‌ లీడర్‌ క్యాస్ట్రాల్‌ను మించి వృద్ధిని కనబరుస్తోందని అనలిస్టులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ స్టాక్‌ ఈ ఏడాది ఫ్లాట్‌గానే ఉంది. ఈ స్టాక్‌ ప్రస్తుత స్థాయి (రూ.800) నుంచి రూ.1,145 వరకు ర్యాలీ చేసే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా వేసింది. ఎంకే గ్లోబల్‌ అయితే రూ.1,200 టార్గెట్‌ ఇచ్చింది. జేకే లక్ష్మీ సిమెంట్‌ ప్రస్తుత ధర (రూ.290) నుంచి 60 శాతం అధికంగా రూ.464 వరకు ర్యాలీ చేయగలదని ఆనంద్‌రాఠి పేర్కొంది. జేఎం ఫైనాన్షియల్‌ ఈ స్టాక్‌కు రూ.450 టార్గెట్‌ ఇచ్చింది. ఇక నీల్‌కమల్‌ దీర్ఘకాలిక అవుట్‌లుక్‌ సానుకూలంగానే ఉందని తెలిపింది. నీల్‌కమల్‌కు ఆనంద్‌రాఠి రూ.1,525 టార్గెట్‌గా చ్చింది. షీలాఫోమ్‌కు ఎడెల్‌వీజ్‌ రూ.1,517 టార్గెట్‌గా ఇచ్చింది.



You may be interested

వృద్ధి వేగం మందగమనం!

Saturday 30th November 2019

జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి 4.5 శాతమే ఆరేళ్లలో ఎన్నడూలేనంత తక్కువ స్థాయి తయారీ, ‍వ్యవసాయం పేలవ పనితీరు నిర్మాణ రంగమూ నిరాశే! వియత్నాంకు ‘వేగవంతమైన వృద్ధి’ హోదా  ఆర్థిక సంవత్సరం ఆరు నెలల వృద్ధి 5 శాతం దిగువకు... న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వృద్ధి తీవ్ర మందగమనంలోకి జారినట్లు తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలు మరింత స్పష్టం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌- 2020 మార్చి) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) కేవలం 4.5

ఈ స్టాక్స్‌కు అంతర్జాతీయ బ్రోకరేజీల రేటింగ్‌లు

Saturday 30th November 2019

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు పలు స్టాక్స్‌కు ఇచ్చిన సిఫారసులు ఇలా ఉన్నాయి..   ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ బ్రోకరేజీ సంస్థ సిటీగ్రూపు గ్లోబల్‌ మార్కెట్స్‌ ఈ షేరుకు రూ.266 టార్గెట్‌ ఇచ్చింది. సానుకూల వృద్ధికి తోడు మార్జిన్ల పెరుగుదల కొనసాగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో కంపెనీ నికర రుణ భారం 2019-20లో పెరుగుతుందని పేర్కొంది.   ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు సిటీ రూ.450 టార్గెట్‌ ధరగా ఇచ్చింది. గతంలో ఇచ్చిన

Most from this category