News


బీటా ర్యాలీతో బాగుపడేవి ఇవే!

Wednesday 11th September 2019
Markets_main1568196521.png-28310

అంతర్జాతీయంగా ఈక్విటీలకు సానుకూలతలు కనిపిస్తున్నాయని, అందువల్ల దేశీయ మార్కెట్లో కూడా షార్ట్‌టర్మ్‌లో బీటా ర్యాలీ వస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ర్యాలీ అంచనాల నేపథ్యంలో హైబీటా ఉండి, వడ్డీరేట్ల ప్రభావితమయ్యే స్టాకులు మంచి దూకుడు చూపుతాయని పేర్కొంది. అలాంటి ఏడు స్టాకులను సూచించింది. అవి... ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌.

(బీటా అనేది స్టాక్‌ ఒడిదుడుకులను మార్కెట్‌ సాపేక్ష దృష్టితో లెక్కించే సాధనం. మార్కెట్‌కు 1.0 బీటా ఉందని గణించి స్టాక్స్‌ బీటాను లెక్కిస్తారు. మార్కెట్‌ కన్నా వేగంగా చలించే స్టాకుల బీటా 1.0 కన్నా ఎక్కువ ఉంటుంది, వీటిని హైబీటా స్టాకులంటారు. ఇవి అధిక ఒడిదుడుకులు చూపుతాయి, కానీ అధిక రాబడులు ఇచ్చే సత్తా కలిగి ఉంటాయి.) 
బీటా ర్యాలీకి కారణాలివే...
- ఫెడ్‌ నిర్ణయంలో మార్పు: వడ్డీరేట్లు తగ్గించాలని యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయించడంతో వర్ధమాన మార్కెట్లలోకి విదేశీ నిధుల వెల్లువ తిరిగి ఆరంభం అవుతుంది. అంతేకాకుండా కరెన్సీ పతనం కూడా ఆగుతుంది.
- లిక్విడిటీ పెరుగుదల: అంతర్జాతీయంగా క్రమంగా లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. భారత నిజ బాండ్‌ఈల్డ్‌ 3.4 శాతం వద్ద ఉంది. వర్దమాన దేశాల్లో ఇదే అధికం. దీనికి రూపీ బలపడడం జత ఐతే ఎఫ్‌పీఐలు మరింతగా పెరుగుతాయి.
- బ్యాంకులకు నిధులు: జూలై నుంచి బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగులు లిక్విడిటీ లక్ష కోట్ల రూపాయల పైనే ఉంది. ఈ ధోరణి కొనసాగితే మార్కెట్లో పెట్టుబడులు పెరుగుతాయి. 
- చమురు ధరలు బలహీనపడడం: చమురు ధరలు తగ్గడం క్యాడ్‌ కట్టడికి తద్వారా ఎకానమీలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరగడానికి దోహదం చేస్తుంది. 
- ప్రభుత్వం తెచ్చే సంస్కరణలు: ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలు, ఆర్‌బీఐ మిగులు నిధులు కేంద్రానికి బదిలీ వంటివి ఆశావహ వాతావరణం ఏర్పరుస్తాయి.You may be interested

నిఫ్టీ ఐదో రోజూ లాభంతోనే ముగింపు

Wednesday 11th September 2019

రాణించిన అటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంతో సూచీలు విఫలమైనప్పటి సూచీలు లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 125 పాయింట్లు లాభంతో 37,270.82 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,035.70 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకిది వరుసగా 5రోజూ లాభాల ముగింపు. అలాగే నిఫ్టీ వరుసగా రెండోరోజూ 11000 స్థాయిపైన, సెన్సెక్స్‌ సూచి సెప్టెంబర్‌లో తొలిసారిగా 37,200 పాయింట్లపైన ముగిసింది. అటో, మెటల్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఫార్మా, రియల్టీ

జీఎస్టీ రేట్ల తగ్గింపు అంచనాలతో జోరుగా అటోషేర్ల ర్యాలీ

Wednesday 11th September 2019

మందగమనంలో ఉన్న అటోరంగానికి ఊతమిచ్చేందుకు అటోరంగంపై జీఎస్టీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో అటో షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఈ సెప్టెంబర్‌ 20తేదిన కేంద్రం జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనుంది. తీవ్ర సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న అటో రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం అటో రంగంపై విధించిన 28శాతం

Most from this category