News


రిలయన్స్‌ కదులుతున్న రైలు!

Thursday 28th November 2019
Markets_main1574934292.png-29926

‘రిలయన్స్‌ కదులుతున్న ట్రైన్‌ లాంటింది. ప్రస్తుత స్థాయిల వద్ద ఈ షేరును కొనుగోలు చేయడం ఉత్తమం కాదు. కానీ ఈ షేరు దిద్దుబాటుకు గురయినప్పుడు కొనుగోలు చేయడం మంచిది. కానీ రిలయన్స్‌లో ఇప్పటికే ఇన్వెస్టర్‌గా ఉన్నవాళ్లు మరికొన్ని షేర్లను జోడించుకోండి. ప్రస్తుత స్థాయి నుంచి రిలయన్స్‌ 8-10 శాతం కదులుతుందని అంచనా వేస్తున్నాం. కానీ కొత్త పెట్టుబడులకు ఈ షేరు మంచి రిస్క్‌ రివార్డును అందించలేదు’ అని ఎలిక్సిర్‌ ఈక్విటీస్‌, వ్యవస్థాపకుడు, డైరక్టర్‌ దీపన్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
రిలయన్స్‌పై రిస్క్‌రివార్డు తక్కువ..
మార్కెట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు అధికంగా వస్తున్నాయి. అందులోనూ ఇన్వెస్టర్లు చాలా వరకు పెట్టుబడులను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు కేటాయిస్తున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ పరంగా పెద్ద కంపెనీయే కాకుండా, కంపెనీ ఫ్రీ ప్లోటింగ్‌ ఈక్విటీ కూడా చాలా ఎక్కువ. అందువలన ఈ కంపెనీ స్పష్టంగా ప్రయోజనం పొందడమే కాకుండా, కంపెనీ రిటైల్‌ ఆధారిత వ్యాపారాలలో అధిక విలువ ఏర్పడుతుంది. అయినప్పటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ డిజిటల్‌, రిటైల్‌ వ్యాపారాలలో ఏర్పరిచిన విలువను ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెస్తుందా? లేదా? అనేదే పెద్ద ప్రశ్న. వాళ్లు కంపెనీలను విడదీసి, మైనార్టీ షేర్‌ హోల్డర్లకు షేర్లను పంచుతారా లేదా రిలయన్సే హోల్డింగ్‌ కంపెనీగా నడుస్తుందా? అనేది చూడాలి. 
   మేమయితే హోల్డింగ్‌ కంపెనీలపై సానుకూలంగా లేము. నమోదైన అనుబంధ కంపెనీలకు ఎంత వరకు రాయితీలను ఇస్తారనే విషయంలో అధికంగా అవకతవకలు జరుగుతుంటాయి. ఇది ఏ విధంగా మారుతుందో చూడాలి. రిలయన్స్‌ కదులుతున్న ట్రైన్‌ లాంటింది. ప్రస్తుత స్థాయిల వద్ద ఈ షేరును కొనుగోలు చేయడం ఉత్తమం కాదు. కానీ ఈ షేరు దిద్దుబాటుకు గురయినప్పుడు కొనుగోలు చేయడం మంచిది. కానీ రిలయన్స్‌లో ఇప్పటికే ఇన్వెస్టర్‌గా ఉన్నవాళ్లు మరికొన్ని షేర్లను జోడించుకోండి. ప్రస్తుత స్థాయి నుంచి రిలయన్స్‌ 8-10 శాతం కదులుతుందని అంచనా వేస్తున్నాం. కానీ కొత్త పెట్టుబడులకు ఈ షేరు మంచి రిస్క్‌ రివార్డును అందించలేదు. 
మిడ్‌క్యాప్స్‌.. మంచి రిటర్న్స్‌
సెక్టార్‌ను నడిపిస్తున్న కంపెనీల కంటే రెండవ, మూడవ స్థాయి కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. బ్యాంకింగ్‌ లేదా ఫార్మా లేదా ఆటో లేదా ఆటో అనుబంధ రంగాలు ఏదైనా సెక్టార్‌పై పాజిటివ్‌గా ఉంటే, ఆ సెక్టార్‌లోని పెద్ద కంపెనీలలో కంటే మధ్య తరహా లేదా చిన్న కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయండి. ఎందుకంటే రిటర్న్‌ల పరంగా ఈ కంపెనీలు పెద్ద కంపెనీలను అధిగమిస్తాయి. పడిపోయిన మధ్య, చిన్న తరహా కంపెనీల పీఈలో రీరేటింగ్‌ జరుగుతుందని అంచనావేస్తున్నాం.  ప్రతి సెక్టార్‌లో తక్కువ పేరున్న కంపెనీలను ఎంచుకోండి. ఈ కంపెనీలు ఆదాయాల దృక్పథం, బ్యాలెన్స్‌ షీట్ నాణ్యత ఆందోళన కలిగిస్తున్నప్పటికి, ఇంకా చెప్పాలంటే ఈ కంపెనీల కార్పోరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికి, మార్కెట్‌ పెరుగుతూ పోతుంటే, వచ్చే 6-12 నెలల్లో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు, లార్జ్‌క్యాప్‌లను అధిగమించే ప్రదర్శనను చేయడం ఖాయం. వచ్చే 6-12 నెలలకు గాను ఇది మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహం. 
ఎన్‌పీఏ ఒత్తిళ్లను ఎదుర్కొటున్న కంపెనీలే.. 
తీవ్ర ఎన్‌పీఏ(మొండి బకాయిలు) ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికి నిలదొక్కుకొని, అన్ని ప్రోవిజన్లను ఏర్పాటు చేసి, బాటమ్‌ లైన్‌ తగ్గిన బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలపై మేము దృష్ఠి సారించాం. ముందుకెళ్లే కొద్ది వీటి ప్రోవిజన్‌ ఖర్చులు తగ్గుముఖం పడతాయి. వాటి లాభాలు పెరుగుతాయి. ఈ అంశాన్ని అధారంగా చేసుకుంటే ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకులలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులు పరిశీలించవచ్చు. ఈ బ్యాంకుల ఎన్‌పీఏలు అసాధరణంగా పెరగాయి. కానీ ఈ బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌ మెరుగుపడుతుండడంతో పాటు, మేనేజ్‌మెంట్‌ కూడా మంచి దృక్పథంతో ఉన్నాయి. ఈ బ్యాంకులు అధికంగా ప్రోవిజన్లను ఏర్పాటు చేయడంతో గత రెండుమూడు త్రైమాసికాలలో వీటి లాభాలు తీవ్రంగా  ప్రభావితమయ్యాయి. కొత్తగా బ్యాంక్‌ ఎన్‌పీఏలను ఎదుర్కొంటే తప్ప, ఇవి తిరిగి గాడిలో పడడానికే అవకాశాలెక్కువున్నాయి. 
   పెద్ద కంపనీలు దన్నుగా ఉన్న పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లేదా ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ వంటి ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలపై మేము దృష్ఠి సారిస్తున్నాం. ముందుకెళ్లే కొద్ది ఈ కంపెనీల ఖర్చులు తగ్గడంతోపాటు, వీటి వృద్ధి కూడా గాడిలో పడుతుందని అంచనావేస్తున్నాం. బ్యాలెన్స్‌ షీట్‌ నాణ్యత పర్వాలేదనిపించే, నిధులను సమీకరించగలిగే  ఒత్తిడిలో ఉన్న మిడ్‌క్యాప్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను ఎంచుకోవడం మంచిది. 
ఎస్‌బీఐ ఐపీఓ.. మంచి అవకాశం
ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. ఇది విభిన్నమైన వ్యాపారం. ఈ దేశంలో క్రెడిట్‌ కార్డు వ్యాపారం చాలా వరకు విస్తరించింది. ఎస్‌బీఐ కార్డ్‌ ఈ వ్యాపారంలో మంచి విలువను సొంతం చేసుకుం‍ది. అందువలన ఈ ఐపీఓ ఈ ఏడాది వచ్చిన మంచి ఐపీఓలలో ఒకటిగా నిలుస్తుంది. రిటైల్‌ ఇన్వెస్ట్‌ర్లు డబ్బు సంపాదించుకోడానికి ఇదొక మంచి అవకాశం. ఎస్‌బీఐ కార్డ్‌ మార్కెట్‌లో నమోదైన తర్వాత కూడా కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే వ్యవస్థలో క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారం విస్తరించడం, వీరు విధించే చార్జీలను గమనిస్తే ఈ  కంపెనీ మంచి లాభదాయకమైన వ్యాపారంగా మారుతుందని చెప్పగలను. ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓకి సంబంధించి, చాలా వరకు పోర్టుఫోలియోలు, రిటైల్‌, సంస్థాగత ఇన్వెస్టర్లు తమ ప్రధాన హోల్డింగ్‌గా మార్చుకోడానికి ప్రయత్నిస్తారు. You may be interested

‘‘టైమ్స్‌ గ్రూప్‌’’ చేతికి అంబానీ మీడియా ఆస్తులు..!?

Thursday 28th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన న్యూస్‌ మీడియా ఆస్తులను ఇండియా టైమ్స్‌ గ్రూప్‌నకు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నారని వార్తలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నష్టాల్లో నడుస్తున్న మీడియా వ్యాపారాన్ని వదిలించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని, అందులో భాగంగా తన న్యూస్‌ మీడియా ఆస్తులను ఇండియా టైమ్స్‌ గ్రూప్‌నకు అమ్మేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. గతవారంలో నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌లో కొంతవాటాను జపాన్‌

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 28th November 2019

మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్‌ 3.50 శాతం లాభపడింది. ఓరియంటల్‌ బ్యాంక్‌ అత్యధికంగా 7.50శాతం లాభపడింది. యూనియన్‌ బ్యాంక్‌ 7శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 6.50శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 6శాతం, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ 6.50శాతం ర్యాలీ చేశాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం, అలహదాబాద్‌

Most from this category