News


ఇవి దృష్టిలో పెట్టుకోండి..

Wednesday 1st January 2020
Markets_main1577902192.png-30597

నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు ఎంతో అవగాహన కలిగి, రిస్క్‌ నిర్వహణ విధానాలను అనుసరిస్తూ, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారానే లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులతో, బంధువులో సూచించారని, షేరు ధర బాగా పెరుగుతుందన్న ఆకర్షణతో లేదా షేరు ధర గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయింది కదా చౌకగా లభిస్తుందనో.. ఈ తరహా అంచనాల ఆధారంగా ఇన్వెస్ట్‌ చేయడం మంచి విధానమేమీ కాదు. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు నిపుణుల అభిప్రాయాలను గుర్తు పెట్టుకుని, ఎప్పటికప్పుడు తమ స్టాక్‌ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. తగినంత అధ్యయనం, కంపెనీలకు సంబంధించి ఎన్నో ఆర్థిక అంశాల విశ్లేషణ తర్వాతే నిర్ణయం తీసుకోవడం సురక్షితం. ప్రముఖ బ్రోకరేజీ సంస్థలకు చెందిన నిపుణులు 2020లో లాభాలు ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్స్‌ను సూచించారు. అంతేకాదు ఈ సందర్భంగా మార్కెట్లపై వారి అభిప్రాయాలు కూడా విలువైనవే.

 

ఎస్‌బీఐ, అశోక్‌లేలాండ్‌, భారతీ ఎయిర్‌టెల్‌
‘‘బ్యాలన్స్‌డ్‌ పోర్ట్‌ఫోలియోతో కనీసం 40-50 శాతం పెట్టుబడులను మల్టీక్యాప్‌ విధానంలో, మరో 40-50 శాతం వరకు స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాల్లో.. ఇన్వెస్టర్లు వారి రిస్క్‌ ఆధారంగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి’’

- నవీన్‌ కులకర్ణి, రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

 

ఎస్‌బీఐ, సువెన్‌లైఫ్‌, ఎంఅండ్‌ఎం
‘‘మోస్తరు రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు డెట్‌ విభాగానికి అధిక కేటాయింపులు చేసుకోవాలి’’

- రుస్మిక్‌ఓజా, కోటక్‌ సెక్యూరిటీస్‌

 

మెటల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటొమొబైల్స్‌
‘‘రాబడులపై అంచనాలను తగ్గించుకోవాలి. నాణ్యమైన స్టాక్స్‌కే పరిమితం కావాలి. కొనుగోలు చేస్తున్న, కొనసాగిస్తున్న స్టాక్స్‌ విషయంలో స్పష్టత కలిగి ఉండాలి’’

-దీపక్‌ జసాని, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

 

ఐసీఐసీఐ బ్యాంకు, వోల్టాస్‌, జేబీ కెమికల్స్‌
‘‘నాణ్యమైన యాజమాన్యం, లాభాల్లో వృద్ధి చూపిస్తున్నవి, వృద్ధి అవకాశం కలిగిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేసుకోవాలి’’

- వినయ్‌ పండిట్‌, ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌

 

దీపక్‌ నైట్రేట్‌, ముత్తూట్‌ఫిన్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌
‘‘మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు కనబరుస్తాయి. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. వినియోగం, బీమా రంగ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది సూచన’’

- మానవ్‌చోప్రా, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ లైఫ్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌
‘‘ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో సైక్లికల్‌ స్టాక్స్‌, మెటల్స్‌, ఇండస్ట్రియల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌లో పెట్టుబడులు పెంచుకోవాలని సూచిస్తున్నాం’’

- వినోద్‌ నాయర్‌, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

 

మారికో, గుజరాత్‌ గ్యాస్‌, ఎంఅండ్‌ఎం
‘‘బోటమ్‌ అప్‌ విధానాన్ని అనుసరించాలి. మంచి కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఆరోగ్యకరమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలపై దృష్టి సారించాలి’’

- అజిత్‌మిశ్రా, రెలిగేర్‌ బ్రోకింగ్‌You may be interested

మళ్లీ రూ. 1 లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

Thursday 2nd January 2020

డిసెంబర్‌లో రూ. 1.03 లక్షల కోట్లు న్యూఢిల్లీ: వినియోగం పుంజుకుంటోందనడానికి నిదర్శనంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో నెలలో రూ. 1 లక్ష కోట్ల మైలురాయిని దాటాయి. డిసెంబర్‌లో రూ. 1,03,184 కోట్ల మేర జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. అంతక్రితం నవంబర్ నెలలో ఈ వసూళ్లు రూ. 1,03,492 కోట్లు. గతేడాది జూలైలో రూ. 1.02 లక్షల కోట్లు నమోదు కాగా, 2018 డిసెంబర్‌లో

కొత్త సంవత్సరం కనీసం ఈ ‘3’..

Wednesday 1st January 2020

కొత్త సంవత్సరంలో అయినా ఆర్థికంగా మెరుగ్గా జీవనం ఉండాలని అందరూ ఆకాంక్షిస్తారు. కానీ, ఇందుకోసం ఆచరణ ముఖ్యం. ముఖ్యంగా ప్రతీ కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక తప్పకుండా ఉండాలి. అప్పుడే లక్ష్యాలకు విఘాతం కలగదు. ఆచరణలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు... కనీసం ఈ మూడింటిని అయినా ముందుగా అమలు చేస్తే తర్వాత వేరే అంశాలపై ఫోకస్‌ పెట్టొచ్చు.    అత్యవసర నిధి రోజులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. దేశ జీడీపీ వేగవంతమైన వృద్ధి స్థాయి

Most from this category