News


3నెలల గరిష్టానికి బీఈఎంఎల్‌

Monday 17th December 2018
Markets_main1545043058.png-23009

 ముంబై మెట్రోపాలిటన్‌ రీజన్‌ డెవెలప్‌మెంట్‌ ఆథారిటీ(ఎంఎంఆర్‌డీఏ)నుంచి రూ.3015 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌(బీఈఎంఎల్‌) సోమవారం 8.31శాతం లాభంతో ముగిసింది. ఎంఎంఆర్‌డీఏ నుంచి మెట్రో కోచ్‌ల నిర్మాణం, సరఫరాలకు సంబంధించి మొత్తం 378 మెట్రో కోచ్‌ల సరఫరాకు ఆర్డర్‌ లభించినట్లు బీఈఎంఎల్‌ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. కాంట్రాక్టు విలువ రూ.3015 కాగా... 2020 జులై-2022 సెప్టెంబర్‌ నుంచీ వీటి సరఫరాలను ప్రారంభించనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేరు ఇంట్రాడేలో 8.50శాతం ర్యాలీ చేసి రూ.850.00ల గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు మూడు నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. నెలరోజుల కాలంలో షేరు ఏకంగా  21శాతం లాభపడింది. కాగా ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 521.00 రూ.1638.00లుగా నమోదయ్యాయి.

 



You may be interested

బైబ్యాక్‌, డివిడెండ్‌కు ఐవోసీకి తగిన వెసులుబాటు: ఫిచ్‌

Tuesday 18th December 2018

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్‌ పంపిణీకి ఇటీవల బోర్డులో నిర్ణయం తీసుకోగా, ఇందుకు రూ.11,000 కోట్ల నిధులను వ్యయం చేయనుంది. అయితే, ఈ మేర నిధుల సమీకరణ వనరులు దానికి ఉన్నట్టు ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొంది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఐవోసీ బైబ్యాక్‌ చేయాలని నిర్ణయించింది. ఒక్కో షేరు కొనుగోలు ధరగా రూ.149ను ఖరారు చేసింది. ఈ మొత్తానికి

10 స్టాక్స్‌.. అదిరే లాభాలు..

Monday 17th December 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. నిఫ్టీ 80 పాయింట్లకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్లు బుధవారం నాటి ఫెడ్‌ సమావేశంపై దృష్టి కేంద్రీకరించారు. గ్లోబల్‌ సెంటిమెంట్‌, ఫెడ్‌ రిజర్వు నిర్ణయం, క్రూడ్‌ ధరల కదలికలు వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. పలువురు అనలిస్ట్‌లు వచ్చే రెండు వారాల కాలంలో మంచి రాబడిని అందించగల పది స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో

Most from this category