News


నిఫ్టీ 10,850 స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి

Friday 13th September 2019
Markets_main1568356323.png-28351

వరుసగా ఐదు రోజుల లాభాలకు గురువారం సెషన్‌లో బ్రేక్‌ పడింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 166 పాయింట్లు కోల్పోయి 37,104 స్థాయికి, నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 10,981 స్థాయికి పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులలో నిఫ్టీ కీలకమైన 10,850 స్థాయిని కొల్పోతే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు.

సాంకేతిక విశ్లేషణ:
నిఫ్టీ 50 రోజువారి డైలీ చార్టులో బేరిష్‌ ఎంగల్‌ఫింగ్‌ నమూనాను ఏర్పాటు చేసిందని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు. గత కొన్ని సెషన్‌ల నుంచి తక్కువ పరిధిలో కదలాడిన నిఫ్టీని బేర్స్‌ తమ ఆధినంలోకి తీసుకున్నారనే విషయాన్ని ఈ బేరిష్‌ ఎంగల్‌ఫింగ్‌ నమూనా తెలుపుతోం‍ది. ఫలితంగా మార్కెట్‌లో అప్‌ ట్రెండ్‌ ముగిసినట్టేనని, ఒక వేళ నిఫ్టీ కీలకమైన 10,850 మద్ధతు స్థాయిని కోల్పోతే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు. 
నిఫ్టీ 10,964, 11,081, 11,100 స్థాయిల వద్ద నిరోధం ఎదుర్కొనే అవకాశం ఉంది.
గరిష్ఠంగా కాల్‌ ఓఐ(ఓపెన్‌ ఇంట్రెస్ట్‌): 11,000, 11,200
గరిష్ఠంగా పుట్‌ ఓఐ: 10,800, 10,600

సాంకేతికపరంగా స్టాక్‌ సిఫార్సులు:
బ్రోకరేజి: ఇండియానీవేష్ సెక్యూరిటీస్ లిమిటెడ్
యూపీఎల్‌: అమ్మొచ్చు; తాజా ధర: రూ. 567; టార్గెట్‌ ధర: రూ. 535; స్టాప్‌ లాస్‌: రూ. 591; డౌన్‌ సైడ్‌ 7 శాతం వరకు కదలగలదు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ : కొనచ్చు; తాజా ధర: రూ. 2,270; టార్గెట్‌ ధర: రూ. 2,375; స్టాప్‌ లాస్‌: రూ. 2,225; అప్‌సైడ్‌ 4.6 శాతం కదలగలదు.
కేస్ట్రాల్‌ ఇండియా: కొనచ్చు; తాజా ధర: రూ. 129; టార్గెట్‌ ధర: రూ. 144; స్టాప్‌ లాస్‌: రూ. 119; అప్‌సైడ్‌ 13.39 శాతం

 



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల క్షీణత

Friday 13th September 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ శుక్రవారం ఉదయం సెషన్‌లో 2.60శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2.50శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియా బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం

దిగివచ్చిన పసిడి

Friday 13th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర దిగివచ్చింది. ఆసియాలో శుక్రవారం ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు నష్టపోయి 1,503.20 వద్ద స్థిరపడింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు పురోగతి సాధిస్తున్నట్లు సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్‌ సాధనమైన ఈక్విటీ షేర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ‘‘వచ్చే నెలలో అమెరికా చైనాల మధ్య  మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇప్పటికే శాంతి పూర్వక వాతావరణ నెలకొనడం శుభపరిణామం.ఇరుదేశాల మధ్య వేడిక్కిన వాణిజ్య యుద్ధ

Most from this category