News


11550 కోల్పోతే 11400పాయింట్లకు నిఫ్టీ?!

Thursday 24th October 2019
Markets_main1571907291.png-29112

నిపుణుల అంచనా
నిఫ్టీ చార్టుల్లో సందిగ్దతకు నిదర్శనమైన డోజీ క్యాండిల్‌ ఏర్పడింది. ప్రస్తుతం నిఫ్టీకి 11700 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. ఈ స్థాయిని దాటితేనే మరింత అప్‌మూవ్‌ వచ్చి క్రమంగా 12100 పాయింట్ల వరకు నిఫ్టీ ఎగబాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నిఫ్టీలో బలహీనత పెరిగి 11550 పాయింట్ల కీలక మద్దతు కోల్పోతే క్రమంగా 11450- 11400 పాయింట్ల వరకు దిగజారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే మరో బలమైన మద్దతు 11100 పాయింట్ల వద్ద ఉందని తెలిపారు. నిఫ్టీ ఆప్షన్‌ నెలవారీ డేటా చూస్తే 11000, 11500 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా ఉండగా, 12000, 11700 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఈ డేటా చూస్తే అటు 11400, ఇటు 11800 పాయింట్ల మధ్యలో నిఫ్టీ కదలికలుండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీఐఎక్స్‌ 16- 18 రేంజ్‌లోనే కదలాడవచ్చు. మార్కెట్‌ ముందుకు కదలాలంటే వీఐఎక్స్‌ 16 దిగువకు రావాల్సిఉంటుంది. ఒకవేళ 18 స్థాయిని దాటితే ప్రాఫిట్‌బుకింగ్‌ వేగవంతం అవుతుంది.
ఎన్నికల ఫలితాలతో నిరాశ
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందన్న అంచనాలతో మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. కానీ ఫలితాల ట్రెండ్‌ అంత ఆశాజనకంగా లేకపోవడంతో మధ్యాహ్న సమయానికి నష్టాల్లోకి మరలాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో రంగాల్లో ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు స్వల్పకాలానికి మాత్రమే మార్కెట్‌ను ప్రభావితం చేయగలవని, దీర్ఘకాలానికి ఫండమెంటల్స్‌, ప్రభుత్వం తీసుకువచ్చే సంస్కరణలు మాత్రమే మార్కెట్‌ నడిపిస్తాయని ఎక్కువమంది అనలిస్టులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇకపై మరలా ఎర్నింగ్స్‌పై అందరి దృష్టి మరలుతుందని చెప్పారు.



You may be interested

దేశీయ బ్రోకరేజ్‌ల టాప్‌ ‘బై’ సిఫార్సులు!

Thursday 24th October 2019

గత సెషన్లో ఐటీ, ఆటో స్టాకులలో కొనుగోళ్లు అధికంగా జరగడంతో దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు, నిఫ్టీ  11,600 స్థాయికి పైన, సెన్సెక్స్‌ 39,000 స్థాయికి పైన ముగిశాయి. దీర్ఘ, మధ్యస్థ కాలానికి గాను వివిధ బ్రోకరేజిలు బై సిఫార్సు చేసిన 11 స్టాకులు.. బ్రోకరేజి: మోతీలాల్ ఓస్వాల్  ఏసీసీ : రేటింగ్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .1,525 | టార్గెట్‌ ధర: రూ .1,900 | అప్‌సైడ్‌: 24 శాతం  కోరమాండల్

మారుతీ సుజుకీ లాభంలో 39 శాతం క్షీణత

Thursday 24th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి మారుతీ సుజుకీ రూ. 1358.60 కోట్ల నికరలాభం ప్రకటించింది. గతేడాది క్యు2తో పోలిస్తే ఇది 39.35 శాతం తక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 2240 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ తక్కువ లాభం నమోదు చేసినా, అనలిస్టుల అంచనాలను మాత్రం దాటేసింది. అనలిస్టుల్లో ఎక్కువమంది కంపెనీ రూ. 950 కోట్ల లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. తాజా సమీక్షా కాలంలో

Most from this category