News


ఐటీసీ షేరుకు ఫలితాల జోష్‌

Friday 25th October 2019
Markets_main1571976490.png-29131

2 శాతం అప్‌
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు రెండు శాతం పైచిలుకు లాభంతో ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ఆరంభంలో సుమారు 3 శాతం లాభంతో 256.90 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఓపెనయింది. తర్వాత వెనువెంటనే 257.20 రూపాయల గరిష్ఠాన్ని తాకింది. క్రమంగా అక్కడ నుంచి 253.25 రూపాయల వరకు దిగివచ్చింది. తిరిగి కోలుకొని 254.50 రూపాయల వద్ద కదలాడుతోంది.

గురువారం ఐటీసీ షేరు 249.05 రూపాయల వద్ద ముగిసింది. గురువారం మార్కెట్‌ ముగిసిన అనంతరం ఐటీసీ క్యు2 ఫలితాలు ప్రకటించింది. నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో దాదాపు 36 శాతం పెరిగింది. రెవెన్యూలో 5.31 శాతం వృద్ధి నమోదయింది. సెప్టెంబర్‌ చివరకు కంపెనీలో మెజార్టీ వాటా డీఐఐల చేతిలో ఉంది. కంపెనీలో డీఐఐలకు 74.58 శాతం, ఎఫ్‌ఐఐలకు 15.62 శాతం, ఇతరులకు 9.8 శాతం వాటాలున్నాయి. గత కొన్ని త్రైమాసికాలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఐటీసీలో వాటా క్రమంగా తగ్గించుకుంటుండగా, అంతే మొత్తంలో డీఐఐలు పెంచుకుంటూ పోతున్నాయి.

శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐలు టాప్‌గెయినర్లుగా ఉన్నాయి. ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే రూ. 260 వద్ద కాల్స్‌, రూ. 250 వద్ద పుట్స్‌ అధికంగా ఉన్నాయి. కంపెనీ షేరు 52వారాల గరిష్ఠ ధర రూ. 310, కనిష్ఠ ధర రూ. 234. క్యు2లో సిగిరెట్‌ఏతర విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో ఇన్వెస్టర్లు షేరుపై ఆసక్తిగా ఉన్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


ITC

You may be interested

మరింత పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌

Friday 25th October 2019

  యుఎస్‌ చమురు నిల్వలు పడిపోవడంతో పాటు, చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు (ఒపెక్‌), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ధరలను స్థీరికరించేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నారనే అంచనాల నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ గురువారం ట్రేడింగ్‌లో 61 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో చమురు ధరలు ఈ వారంలో వరుసగా మూడవ సెషన్లో కూడా లాభపడినట్టయ్యింది. కాగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం, చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరగడం వంటి

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 25th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 71.04 వద్ద  ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా గత సెషన్లో విదేశీ నిధుల ఔట్‌ఫ్లో కొనసాగడంతో పాటు, దేశీయ మార్కెట్‌లో ట్రెండ్‌ బలహీనంగా ఉండడంతో, వరుసగా ఐదు సెషన్‌లలో బలపడిన రూపీ, గురువారం సెషన్లో 11 పైసలు కోల్పోయి 71.02 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.03 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 3.13 శాతం

Most from this category