News


ప్లెడ్జ్‌ షేర్లతో భయపెడుతున్న బేర్స్‌

Tuesday 12th February 2019
Markets_main1549966664.png-24160

మార్కెట్లు భయాందోళనలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లను మరింత భయపెట్టేందుకు కొన్ని కధలు ప్రచారమవుతాయని, ప్రస్తుతం ప్లెడ్జ్‌షేర్లపై వస్తున్న కధనాలతో బేర్‌ ఆపరేటర్లు పనిగడుపుకుంటున్నారని ప్రముఖ అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పట్లో కొనుగోళ్ల మద్దతు లభించని కంపెనీల గురించి పూర్తిగా తెలుసుకొని వాటి షేర్లపై దాడి చేస్తున్నారన్నారు. ఒకపక్క ఆ షేరుపై దాడి చేయడం, మరోపక్క ప్లెడ్జ్‌ షేర్లపై కధనాలు ప్రచారంలో ఉంచడం ద్వారా షార్ట్‌ పొజిషన్లు, పుట్‌ పొజిషన్లలో భారీ లాభాలు సంపాదిస్తున్నారని తెలిపారు.

 

మార్కెట్‌ బయట ఎన్‌బీఎఫ్‌సీలు షేర్లను కుదువ పెట్టుకొని రుణాలిస్తుంటాయి. సాధారణంగా ఇచ్చిన రుణానికి డబుల్‌ విలువ చేసే షేర్లను ఎన్‌బీఎఫ్‌సీలు తనఖాగా పెట్టుకుంటాయి. ఒక సమయంలో మార్కెట్లో భయాందోళనలు చెలరేగేవేళ, కొంతమంది ఇలాంటి కంపెనీ షేరుపై ఉద్దేశపూర్వక దాడి చేస్తారు. దీంతో అప్పిచ్చిన ఎన్‌బీఎఫ్‌సీ భయంతో సదరు షేరును భారీగా అమ్మడం మొదలుపెడుతుంది. తన వద్ద తనఖాగా రెట్టింపు మొత్తానికి షేర్లు ఉండడంతో భారీగా మార్కెట్లో అమ్మకాలను చేపడుతుంది. దీంతో సదరు షేరు ధర ఇంకా వేగంగా పతనమవుతుంది. 


ఇదంతా ఒక నిర్ణీత క్రమంలో జరిగే తప్పిదమని నిపుణులు దుయ్యబడుతున్నారు. సెబి, ఆర్‌బీఐ ఇలాంటి అక్రమాలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా మార్చాలని, ఇందుకోసం మొత్తం రుణాన్ని, తనఖా ఉంచిన షేర్లను మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలని, అక్కడే రుణదాత, గ్రహీత మార్కెట్‌ ధర ప్రకారం తమ లావాదేవీ ముగించుకునేలా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఇందువల్ల థర్డ్‌పార్టీ ఆపరేటర్లు షేర్లపై దాడి చేయకుండా చూడవచ్చన్నారు. ప్రస్తుత విధానంలో రుణదాతకు తన మొత్తం లభిస్తుందని, కానీ కంపెనీని నమ్మి పెట్టుబడి పెట్టిన సన్నకారు ఇన్వెస్టరు భారీగా నష్టపోతాడని దేవన్‌ చెప్పారు. ఇదే వరుస కొనసాగితే చిన్న ఇన్వెస్టరు మార్కెట్‌ వంక చూడాలన్నా భయపడతాడని హెచ్చరించారు. అందువల్ల ‍ప్రభుత్వం, నియంత్రణా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. You may be interested

నాలుగో రోజూ నష్టాలే..!

Tuesday 12th February 2019

10850 దిగువకు నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ కీలక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన అమ్మకాలతో మార్కెట్‌ మంగళవారం  నష్టాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ షేర్ల పతనంతో సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 10850 స్థాయిని కోల్పోయి 57పాయింట్లను నష్టంతో 10,831.40 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు పతనమై 36,153.62 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఈ నాలుగు రోజుల పతనంలో భాగంగా

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Tuesday 12th February 2019

మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అ‍మ్మకాలతో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం క్షీణతతో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం మేర పతనమైంది. మధ్యాహ్నం గం.2:50ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(27,227.80)తో పోలిస్తే 0.75శాతం నష్టంతో 27,036.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category