News


బేర్స్‌ పట్టులోకి వెళ్లినట్టేనా..?

Saturday 9th November 2019
Markets_main1573240493.png-29460

కీలకమైన 12,000 మార్క్‌పైన నిఫ్టీ క్లోజయిన మరుసటి రోజే దాన్ని కోల్పోయింది. శుక్రవారం నిఫ్టీ సూచీ 104 పాయింట్లు నష్టపోయి 11,908 వద్ద క్లోజయింది. అంతేకాదు 12,000 దిగువన మద్దతు స్థాయి 11,946ను కూడా కోల్పోయింది. దీంతో బేర్స్‌దే మరోసారి పైచేయిగా కనిపించింది. దీనిపై నిపుణుల అభిప్రాయాలు చూద్దాం..

 

ఇండెక్స్‌ అనిశ్చయ క్యాండిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. శుక్రవారం డైలీ చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఐదు రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌కు దిగువన ముగిసింది. దీంతో 11,946 స్థాయిని అధిగమిస్తే అది రికవరీకి మొదటి అడుగు అవుతుందన్నది అనలిస్టుల అభిప్రాయం. ‘‘11,850కు దిగువన నిఫ్టీ క్లోజ్‌ అయితే బలహీనత నిర్ధారణ అయినట్టే. ఇదే జరిగితే ప్రైస్‌చార్ట్‌లో కనిష్టంలో కనిష్టానికి చేరినట్టు. అసెండింగ్‌ ట్రెండ్‌లైన్‌ను కోల్పోయినట్టు కూడా అవుతుంది. మంచి మద్దతు స్థాయి 11,820 వద్ద ఉంది. ఇక్కడ బుల్స్‌ తమ వంతు పోరాటం చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి ఎగువ వైపున 12,034వరకే అవకాశం ఉంది’’ అని చార్ట్‌వ్యూఇండియాకు చెందిన మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. 

 

నిఫ్టీకి 12,000 స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోందని, 11,700 వరకు రివర్సల్‌కు అధిక అవకాశం ఉందని దోలత్‌ క్యాపిటల్‌కు చెందిన భవిన్‌మెహతా అన్నారు. డైలీ చార్ట్‌లో ఎంఏసీడీ నెగెటివ్‌ క్రాసోవర్‌ చూడబోతోందన్నారు. ‘‘వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ గత గరిష్ట స్థాయి వద్ద డోజి తరహా ప్యాటర్న్‌ను ఏర్పాటు చేయడాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ తరహా సందర్భాల్లో నిఫ్టీ 12,100పైన క్లోజయితే తప్ప, గరిష్ట స్థాయిల్లో అధిక అమ్మకాలు ఎదురువుతుంటాయి’’ అని మెహతా తెలిపారు. 12,000-12,050 స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఎదురువుతోందన్నారు మోతీలాల్‌ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ చందన్‌తపారియా. సూచీ 11,850పైన నిలదొక్కుకుంటేనే 12,035 స్థాయి దిశగా అప్‌మూవ్‌ ఉంటుందన్నారు. 



You may be interested

మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.500 కోట్లు తక్కువే: ధీరేంద్ర

Saturday 9th November 2019

మిడ్‌క్యాప్‌లు చౌకగా ఉన్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. లార్జ్‌క్యాప్‌లు అధిక న్యాత కలిగినవని, అదే సమయంలో ఖరీదుగా ఉంటాయనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. దీర్ఘకాలానికి లాభాలు పొందాలంటే ఈ విధమైన ఆలోచన సరికాదు’’అని వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అన్నారు. అక్టోబర్‌ నెలకు సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై తన అభిప్రాయాలను ఆయన ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.   మిడ్‌క్యాప్స్‌లోకి రూ.500 కోట్లే పెట్టుబడులు వచ్చాయి. కేవలం లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే ఆకర్షణీయంగా

మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌తో మార్కెట్‌ డౌన్‌..!

Friday 8th November 2019

12000 దిగువన ముగిసిన నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  మూడు రోజులుగా  రికార్డు ర్యాలీ చేస్తున్న మార్కెట్‌ మూడ్‌ను ‘‘మూడీస్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌’’ దెబ్బతీసింది. ఫలితంగా ఈ వారాంతాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 330 పాయింట్లు నష్టపోయి 40323 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 12000 దిగువున 11908 వద్ద స్థిరపడ్డాయి. ఆర్థిక, సంస్థాగత బలహీనతలను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి తగ్గిస్తున్నట్లు

Most from this category