News


బేర్‌ మార్కెట్‌ రాబోతున్నది: జిమ్‌ రోగర్స్‌

Thursday 9th May 2019
Markets_main1557425723.png-25642

ఇన్వెస్ట్‌మెంట్‌ గురు జిమ్‌ రోగర్స్‌ త్వరలోనే బేర్‌ మార్కెట్‌ వస్తుందన్న అంచనాతో ఉన్నారు. త్వరలో వచ్చే బేర్‌ మార్కెట్‌ తన జీవితంలోనే అత్యంత దారుణంగా ఉంటుందని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. తాను పెరిగే మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయనని, పడిపోయే మార్కెట్లలోనే పెట్టుబడులు పెడతానన్నారు. భారత ప్రధాని మోదీ చెప్పుకోతగ్గ పెద్ద మొత్తంలో ఏమీ చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ గురు పలు కీలక అంశాలపై స్పందించారు. 

 

భారత్‌లో పెట్టుబడులపై...
మోదీ ప్రధానిగా ఎన్నిక కాకముందు తాను భారత మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసినట్టు జిమ్‌ రోగర్స్‌ తెలిపారు. మోదీ ఎన్నికైన తర్వాత ఆయన పెద్దగా ఏమీ చేయకపోయే సరికి భారత కంపెనీల షేర్లను విక్రయించేశానని, ఇప్పడు భారత మార్కెట్లో తనకు ఎటువంటి పొజిషన్లు లేవని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇన్వెస్ట్‌ చేయకపోవడానికి కారణం భారత మార్కెట్లు పెరుగుతూ పోవడమేనన్నారు. తాను మాత్రం స్టాక్‌ పడిపోతున్నప్పుడే కొనుగోలు చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. కొన్ని ప్రాంతాలు (ఇప్పటికే పడిపోయి ఉన్న మార్కెట్లు) మినహా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్స్‌ పట్ల అప్రమత్తతో ఉన్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కరెక్షన్‌కు గురైతే లేదా భారత మార్కెట్లు దిద్దుబాటుకు గురైనా పెట్టుబడులను పరిశీలిస్తానని చెప్పారు. భారత్‌లో మోదీ అయినా, మరొకరు ఎన్నికైనా మార్కెట్లను పూర్తిగా తెరవాలన్నది తన సూచనగా పేర్కొన్నారు. ఎందుకంటే ఇది 1990 కాదని, 2019 అని గుర్తు చేశారు. మోదీ కొన్ని మంచి పనులు చెసినట్టు పేర్కొన్నారు. అయితే, అవి చిన్నవేనని, తన అభిప్రాయంలో ఆయన చేసిన పెద్దవి ఏవీ లేవన్నారు. 

 

రష్యా, చైనాలో కొంటా...
ప్రస్తుతం రష్యా మార్కెట్‌పైనే తాను దృష్టి పెట్టినట్టు జిమ్‌ రోగర్స్‌ తెలిపారు. రష్యా షేర్లు, బాండ్లను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే రష్యా చౌకగా ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లు బాగా పెరిగి ఉన్నాయని, రానున్న ఒకటి లేదా రెండేళ్లలో కొన్ని సమస్యలు రానున్న విషయం తనకు తెలుసునన్నారు. ప్రపంచ మార్కెట్లు సమస్యలపాలైతే అప్పుడు స్టాక్స్‌ను కొనుగోలు చేస్తానని చెప్పారు. ఈ సమయంలో చైనాలో పెట్టుబడులు కూడా సరైనవేనన్నారు. ఒకవేళ తాను స్టాక్స్‌ ఇప్పుడు కలిగి ఉంటే అది రష్యా, చైనా మార్కెట్లలోనే అవుతుందన్నారు. చైనా షేర్లు వాటి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా తగ్గినట్టు చెప్పారు. 

 

భారీ కరెక్షన్‌...
‘‘వచ్చే బేర్‌ మార్కెట్‌ నా జీవిత కాలంలోనే అత్యంత దారుణమైనది. ఎప్పుడొస్తుందన్నది నాకు తెలియదు. దాన్ని చూడబోతున్నామన్నది నాకు తెలుసు. అమెరికా మార్కెట్‌లో పెద్ద సమస్య నెలకొని ఉండడం పదేళ్లయింది. అమెరికా చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘమైనది. 2008లో భారీ రుణాల సమస్యను ఎదుర్కొన్నాం. 2008 నుంచి చూస్తే అంతటా డెట్‌ ఆకాశాన్ని చేరిపోయింది. వచ్చే బేర్‌ మార్కెట్‌ మరింత భయానకంగా ఉంటుంది. కనుక పెట్టుబడులకు నేనేమీ తొందర పడడం లేదు. అమెరికా మార్కెట్లో నేను ఇన్వెస్ట్‌ చేయడం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది రెండేళ్లలో సమస్యలు వస్తాయని అంచనా వేస్తున్నా. అమెరికా మార్కెట్లో యాపిల్‌, గూగుల్‌ షేర్లు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. అవి పడిపోవడం లేదు. ఏ స్టాక్‌ మార్కెట్‌ అయినా ఇది ప్రమాదకర సంకేతం. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది బేర్‌ మార్కెట్‌ మొదలవుతుంది. తొలుత ఇది చిన్నగానే మొదలవుతుంది. ప్రజలు పట్టించుకోనప్పుడు మేజర్‌ మార్కెట్లకు విస్తరిస్తుంది. అప్పుడే వార్తల్లోకి వస్తుంది. 2007లో ఐస్‌లాండ్‌ దివాలా తీసింది. ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత ఐర్లాండ్‌, బేర్‌ స్టెర్న్స్‌, నార్తర్న్‌ రాక్‌ దివాలా తీశాయి. ఆ తర్వాత లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ దివాలాకు వెళ్లింది. అలాగే, ఇప్పుడు కూడా లాత్వియా కుప్పకూలింది. అర్జెంటీనా, వెనెజులా, టర్కీ, భారత్‌లోని బ్యాంకుల్లో, ఇండోనేషియలోనూ సమస్యలు ఉన్నాయి. ఇవి చిన్న మార్కెట్లే. కానీ, పెద్ద మార్కెట్లకు విస్తరించే వరకు వీటిని గుర్తించరు’’ అని జిమ్‌ రోగర్స్‌ వివరించారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Friday 10th May 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో వుండటంతో  చవిచూసిన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం సైతం గ్యాప్‌డౌన్‌తో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40  గంటలకు దాదాపు 40 పాయింట్ల తగ్గుదలతో 11,296 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,336 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నుంచి ఒక మంచి లేఖ అందుకున్నానంటూ గురువారం అమెరికా అధ్యక్షుడు వెల్లడించడంతో

ఎంఎస్‌సీఐ ఇండియా సూచీలోకి కొత్త చేరికలు

Thursday 9th May 2019

ఎంఎస్‌సీఐ ఇండియా ఆరు నెలలకోసారి సూచీల్లో మార్పులను ఈ నెల 13న సమీక్షించాల్సి ఉంది. ఐసీఐసీఐ డైరెక్ట్‌ నివేదిక ప్రకారం... బ్యాంకింగ్‌, బీమా కంపెనీలకు కొత్తగా చోటు లభించనుంది. ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను ఈ సూచీలో చేర్చే అవకాశాలున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా. అధికారికంగా ఈ మార్పులపై ఈ నెల 13న ప్రకటన వెలువడనుంది. ఈ నెల

Most from this category