News


పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చే ముందు జాగ్రత్త

Tuesday 10th December 2019
Markets_main1575949636.png-30142

  • ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ సూచన

న్యూఢిల్లీ: స్టాక్‌ బ్రోకర్లతో ఇన్వెస్టర్లు పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీవోఏ) ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్‌ఎస్‌ఈ హెచ్చరించింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రూ.2,300 కోట్ల విలువైన తమ క్లయింట్ల సెక్యూరిటీలను తన ఖాతాలోకి మళ్లించి, వాటిపై రుణాలు పొందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కార్వీ క్లయింట్ల పీవోఏను దుర్వినియోగం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ సోమవారం ఓ ప్రకటనలో సూచనలు చేసింది.

  • ఇన్వెస్టర్లు తమ తరఫున బ్రోకర్లు నిర్వహించాల్సిన హక్కులను పీవోఏలో స్పష్టంగా పేర్కొనాలి. అవి ఎప్పటి వరకు చెల్లుబాటయ్యేది కూడా ఒప్పందంలో ఉండేలా చూసుకోవాలి. 
  • పీవోఏకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌లో సెక్యూరిటీలను డెలివరీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి. సెబీ, స్టాక్‌ ఎక్సేంజ్‌ నిబంధనల ప్రకారం పీవోఏ అన్నది తప్పనిసరేమీ కాదు. 
  • ట్రేడ్‌ కాంట్రాక్టు 24 గంటల్లోపు ఇన్వెస్టర్లకు అందాలి. అదే విధంగా అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ ప్రతి మూడు నెలలకూ ఓ సారి తప్పకుండా వచ్చేలా చూసుకోవాలి.
  • బ్రోకర్‌ వద్ద మార్జిన్‌ కోసం ఉంచిన సెక్యూరిటీలను తనఖా పెట్టి నిధులు పొందేందుకు అనుమతించకూడదు. 
  • నిధులు, సెక్యూరిటీలను బ్రోకర్‌ వద్దే ఉంచేయకుండా సకాలంలో తెప్పించుకోవాలి. 
  • ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాల్లోకి క్రమం తప్పకుండా లాగిన్‌ అయి, బ్యాలన్స్‌ను తనిఖీ చేసుకోవాలి. డిపాజిటరీల నుంచి వచ్చే స్టేట్‌మెంట్‌లు, స్టాక్‌ ఎక్సేంజ్‌ల నుంచి నిధులు, సెక్యూరిటీలకు సంబంధించి వచ్చే ఎస్‌ఎంఎస్‌లను కూడా పరిశీలించుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలను గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని బ్రోకర్లకు తెలియజేయాలి.
  • బ్రోకర్‌ వద్ద తమ మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీకి సంబంధించి తాజా వివరాలు ఉండేలా చూసుకోవాలని ఇన్వెస్టర్లను ఎన్‌ఎన్‌ఈ కోరింది.  



You may be interested

కాఫీడే టెక్‌ పార్క్‌ విక్రయానికి యస్‌ బ్యాంకు బ్రేక్‌!

Tuesday 10th December 2019

బెంగళూరు: కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్‌ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్‌ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్‌ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై

మిల్లుకు షుగరొచ్చింది!!

Tuesday 10th December 2019

భారీగా పేరుకుపోతున్న చక్కెర నిల్వలు ఇప్పటికే గోదాముల్లో 140 లక్షల టన్నులు దీనికి తోడవనున్న తాజా 268 లక్షల టన్నులు డిమాండ్‌ను మించిపోయిన సరఫరా నష్టాల్లో కంపెనీలు; కొన్ని మూసివేత! హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వినియోగాన్ని ఉత్పత్తి మించిపోవటంతో దేశంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి భారత్‌లో 140 లక్షల టన్నుల చక్కెర నిల్వలున్నాయి. 2019 అక్టోబరు - 2020 సెప్టెంబరులో (ప్రస్తుత సీజన్లో) 268.5 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి

Most from this category