News


2020లో ఈ మూడు రంగాలదే హవా!

Monday 30th December 2019
Markets_main1577679649.png-30519

ఐసీఐసీఐ డైరెక్ట్‌ రిసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌పాండే
టెలికం, బ్యాంకింగ్‌, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన కంపెనీలు కొత్త ఏడాదిలో సత్తా చూపుతాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రిసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌పాండే అంచనా వేశారు. టెలికం రంగం క్రమంగా మంచి రూపుదిద్దుకుంటోందన్నారు. ఇన్‌ఫ్రా రంగంలో ఇప్పటివరకు ప్రైసింగ్‌ ప్రదర్శన స్తబ్దుగా ఉందని, ఇకపై ఇందులో మార్పు రానుందని చెప్పారు. ముఖ్యంగా కొత్త ఏడాది ద్వితీయార్ధంలో ఈ రెండు రంగాలు మంచి జోరు చూపవచ్చన్నారు. వీటితో పాటు ఎప్పటిలాగే బ్యాంకుల ఉత్తమ ప్రదర్శన కొత్త సంవత్సరంలో కొనసాగుతుందని తెలిపారు. 2019లో ప్రపంచ మార్కెట్లన్నీ విస్తృత స్థాయి ప్రదర్శన చూపినా, దేశీయ మార్కెట్లు మాత్రం ఏకీకృత ప్రదర్శన చూపాయన్నారు.(విస్తృత ప్రదర్శన అనగా వివిధ రంగాలకు చెందిన అనేక స్టాకులు ర్యాలీలో పాలుపంచుకోవడం. ఏకీకృత ప్రదర్శన అనగా కొన్ని రంగాలకు చెందిన కొన్ని స్టాకులు మాత్రమే ర్యాలీ జరపడం, మిగిలినవి స్తబ్దుగా ఉండడం లేదా నెగిటివ్‌గా ఉండడం.) 2020లో ఈ తరహా మారవచ్చని, మన మార్కెట్లో కూడా విస్తృతస్థాయి ప్రదర్శన ఆశించవచ్చని తెలిపారు. బ్రోకింగ్‌ పరిశ్రమలో అసంఘటిత విభాగం నుంచి సంఘటిత విభాగం దిశగా మార్పు కనిపిస్తోందని, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ మంచి పనితీరు చూపుతోందని తెలిపారు.



You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: మ్యూచువల్‌ ఫండ్స్‌ జోష్‌..

Monday 30th December 2019

2019లో మ్యూచువల్‌ ఫండ్స్‌ అసెట్స్‌ భారీగా పెరిగాయి. 2019 నవంబర్‌ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్‌ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి

2019 బిజినెస్‌ రివైండ్‌: స్థిరంగా బీమా రంగం..

Monday 30th December 2019

బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్‌ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15 శాతం వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు,

Most from this category