News


లాభాల మార్కెట్లో బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో...

Wednesday 18th December 2019
Markets_main1576653612.png-30287

మార్కెట్‌ ర్యాలీలోనూ బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ షేర్లు పతనంతో నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం నస్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ రూ.5,250 కోట్ల మొండిబకాయిలను కలిగి ఉన్నట్లు ఆర్‌బీఐ రిస్క్‌ అసెస్‌మెంట్‌ నివేదికలో పేర్కోంది. ఈ బ్యాంక్‌ ఎన్‌పీఏలకు రూ.4,090 కోట్ల ప్రోవిజన్లు కేటాయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఫలితంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌ షేరు నేటి ఇంట్రాడే 3శాతం నష్టపోయింది. మరోవైపు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ సైతం ఈ బ్యాంకు నెగిటివ్‌ రేటింగ్‌ను కేటాయించడటం ప్రతికూలాంశంగా మారింది. అలాగే యూనియన్‌ బ్యాంక్‌ షేరు, సెంట్రల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. పీఎన్‌బీ షేరు 2.50శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ అలహదాబాద్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం పతనయ్యాయి. ఇండియన్‌ బ్యాంక్‌ అరశాతం క్షీణించగా, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ 0.20శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30నిల.కు పీఎస్‌యూ ఇండెక్స్‌ 2శాతం నష్టంతో 2,515.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిన్నటి ముగింపు(32,140.25)తో పోలిస్తే 0.14శాతం నష్టంతో పోలిస్తే 32,140.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఆ మూడింటికే సత్తా ఉంది!

Wednesday 18th December 2019

రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించేవి అవే... టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో రూ.20 లక్షల మార్కెట్‌ క్యాప్‌ సాధించగల సత్తాకలిగినవని మోతీలాల్‌ ఓస్వాల్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఒత్తిడిలో ఉన్న టెలికం, ఇన్‌ఫ్రా, రియల్టీ, పీఎస్‌బీ రంగాల ఎర్నింగ్స్‌ మొత్తం ఎర్నింగ్స్‌లో 50 శాతం ఉండడం వల్ల ఎర్నింగ్స్‌ గ్రోత్‌ స్పష్టంగా కనిపించడం లేదన్నారు. అయితే దీర్ఘకాలంలో మాత్రం కంపెనీలు మంచి ఫలితాలు

చిన్న క్యాప్స్‌లో రికవరీ.. ఇప్పుడే కాదు!

Wednesday 18th December 2019

హేమాంగ్‌ జానీ అంచనా నెలన్నరగా వివిధ ఐపీఓలు, బ్లాక్‌డీల్స్‌ కారణంగా మార్కెట్లో లిక్విడీటీ అధికమొత్తంలో ఆవిరైందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జానీ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి మెరుగై, లిక్విడిటీ పెరిగే వరకు చిన్న స్టాకుల్లో రికవరీ కానీ, మార్కెట్లో బలమైన అప్‌మూవ్‌ కానీ ఆశించకూడదన్నారు. సూచీల్లోని కొన్ని స్టాకులు మాత్రమే ర్యాలీ జరుపుతూ ముందుకు తీసుకుపోతున్నాయని విశ్లేషించారు. దేశీయ ఎకానమీలో కొన్ని సవాళ్లున్నాయని, విస్తృతస్థాయి ఎర్నింగ్స్‌ రికవరీ ఆశించలేమని చెప్పారు. ఇప్పటివరకు

Most from this category