News


బ్యాంకులకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రైటాఫ్‌ల ముప్పు?

Friday 22nd November 2019
Markets_main1574407008.png-29783

దేశీయ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్..బ్యాంకులు, బాండ్‌హోల్డర్లకు సంబంధించిన రుణాలను చెల్లించడంలో విఫలమైంది. కాగా ఈ కంపెనీ మోసపూరిత చర్యలకు పాల్పడిందనే విషయం రుజువైతే, ఈ సంస్థకు అప్పులిచ్చిన రుణ దాతలు అధికంగా దాదాపు రూ. 36,000 కోట్ల రైట్‌ ఆఫ్‌లను ఎదుర్కోవలసి​ వస్తుంది. ఒక వేళ ఈ కంపెనీకి సంబంధించి ఆడిటింగ్‌ సంస్థ కేపీఎంజీ నివేదిక కంపెనీకి సానుకూలంగా వస్తే అప్పుడు కేవలం రూ. 5,500 కోట్ల ప్రోవిజన్లు అవసరమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన ఈ సెక్టార్లోని కంపెనీలకు కొత్త రుణాలు అందడం తగ్గాయి. ఫలితంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతోంది. ఈ కంపనీ షేరు ఈ ఏడాది 90 శాతానిపైగా పడిపోయింది. 
   యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు, డెట్‌ రిజల్యూషన్‌ ప్రణాళికను చర్చించడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక సారి డీహచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా కోర్టును ఆశ్రయిస్తే, ఈ ప్రణాళికను రిజల్యూషన్‌ ప్రోఫెషనల్స్‌ పునః పరిశీలిస్తారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిధులను డొల్ల కంపెనీలకు మళ్లిస్తుందని దేశీయ వెబ్‌సైట్‌ కోబ్రాపోస్ట్‌ ఆరోపించిన తర్వాత, ఈ ఆరోపణలను పరిశీలించాలని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణదాతలు ఈ ఏడాది కేపీఎంజీ ని నియమించారు. ఏప్రిల్‌ 2015, మార్చి 2019 మధ్య కాలంలో డీహెచ్‌ఎఫ్‌ ఖాతాల నుంచి ‘నిధుల దారి మళ్లింపు/వ్యాపారానికి వెలుపల ఫండ్స్‌ను తప్పుగా వినియోగించడం/ రుణదాతలు ఆమోదించిన దానికంటే అధికంగా ఉపయోగించడం’ వంటి చర్యలు జరిగాయో లేదో పరిశీలించేందుకు కేపీఎంజీని నియమించారని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. కాగా  దివాన్‌ కంపెనీ తన రుణాలను, అడ్వాన్స్‌లను ‘అంతర్గతంగా సంబంధం ఉన్న సంస్థలకు’, ‘డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్ల సంస్థలతో సంబంధం కలిగివున్న వ్యక్తులకు’ ఈ పరిశీలన కాలంలో రూ. 19,750 కోట్లను పంపిణి చేసిందని కేపీఎంజీ ప్రాథమిక నివేదిక పేర్కొంది. అంతేకాకుండా పంపిణీ చేసిన రుణాల వినియోగ పర్యవేక్షణ కోసం సరియైన ట్రాకింగ్ విధానాన్ని ఈ కంపెనీ అమలుచేయలేదని పేర్కొంది. సగానికి పైగా ‘సంబంధం ఉన్న కంపెనీలు’ తక్కువ ఆపరేషన్స్‌ను కలిగివున్నాయని ఈ నివేదిక తెలిపింది. దీంతోపాటు సంబంధిత పార్టీలు ఏర్పాటు భారత కంపెనీల చట్టం ప్రకారం జరిగిందో లేదో తెలుసుకోడానికి మరికొంత దర్యాప్తు అవసరమని ఈ నివేదిక పేర్కొంది. కాగా ఈ అంశంపై దివాన్‌ ఫైనాన్స్‌, కేపీఎంజీ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. 

 You may be interested

రెండు దశల్లో బీపీసీఎల్‌ వాటాల విక్రయం!

Friday 22nd November 2019

అమ్మకానికి ముందు జేవీల నుంచి ఎగ్జిట్‌ యోచన రిటైలింగ్‌, రిఫైనింగ్‌ వ్యాపారాల డీమెర్జర్‌ ఆలోచన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ప్రభుత్వం బీపీసీఎల్‌ వాటా విక్రయానికి ఎక్కువమంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం అవలంబించనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ నుంచి కొన్ని అసెట్స్‌ను వేరు చేయడం(కంపెనీ వ్యాపారాలను డీమెర్జ్‌ చేయడం లేదా జాయింట్‌ వెంచర్ల నుంచి బయటకు రావడం), షేర్ల విక్రయాన్ని దశలవారీగా పూర్తి చేయడమనే వ్యూహాన్ని ప్రభుత్వం పాటించనుందని తెలిసింది. ఇందులో

కోలుకుంటున్న పసిడి

Friday 22nd November 2019

నిన్నటి రోజు 10డాలర్లు నష్టపోయిన పసిడి ధర శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో స్వల్పంగా కోలుకుంది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,466 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా చైనా కనీసం పరిమిత ఒప్పందం కుదుర్చుకునేందుకు బీజింగ్‌లో కొత్త రౌండ్ ముఖాముఖి చర్చలకు అమెరికా  అగ్రశ్రేణి వాణిజ్య సంధానకర్తలను ఆహ్వానించినట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

Most from this category