STOCKS

News


ఎస్సార్‌ స్టీల్‌..ఏయే బ్యాంకులకు ఎంతొస్తుంది?

Saturday 16th November 2019
Markets_main1573897651.png-29645

సుప్రీం కోర్టు తీర్పు వలన ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు దాఖలైన రూ. 42,000 కోట్ల బిడ్‌లో సుమారుగా 92 శాతం వాటాను, ఈ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు పొందనున్నాయి. ఎస్సార్‌ స్టీల్‌కు రుణాలిచ్చిన ఆపరేషనల్‌ రుణ దాతలు రూ. 1,196 కోట్లను పంచుకోనున్నారు. ఫలితంగా బ్యాంకుల డిసెంబర్‌ క్వార్టర్‌ లాభాల దృక్పథం మెరుగవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అనేక దివాలా కేసులను తొందరగా పరిష్కారించేందుకు వీలు కుదిరిందని తెలిపారు.  
    ఈ కేసుకు సంబంధించి బ్యాంకులు 50-100 శాతం ప్రొవిజన్లను కేటాయించాయి. కోర్టు తీర్పు వలన  బ్యాంకుల ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో మెరుగుపడడమే కాకుండా, చాలా వరకు బ్యాంకుల ప్రొవిజన్లు తొలగిపోతాయి. ఫలితంగా ఈ బ్యాంకుల లాభం మెరుగుపడుతుంది. ‘ఇది బ్యాంకులకు ట్రిపుల్‌ బొనాంజా లాంటిది. అధిక మొత్తంలో రికవరీకావడంతో పాటు, 100 శాతం వరకు ప్రొవిజన్లు తొలగిపోతాయి’ అని సిండికేట్‌ బ్యాంక్‌, ఎండీ, మృత్యుంజయ్‌ మహాపాత్ర అన్నారు. ‘ఒకవేళ కొత్త యాజమాన్యం ఈ కంపెనీని నడపడానికి రుణాలు కావాలంటే, రూ. 1000 కోట్లకు పైగా ఉన్న మా ఎక్స్‌పోజర్‌ తాజా వ్యాపారానికి తిరిగి ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. 
   రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ), ఎస్సార్‌ స్టీల్‌ కేసును దివాలా కోర్టుకు పంపిన 830 రోజుల తర్వాత, లక్ష్మీ మిట్టల్‌ ఆర్సెలర్‌ మిట్టల్‌  ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది. గతంలో ఈ కేసును స్వీకరించిన ట్రిబ్యునల్‌, ఎస్సార్‌ స్టీల్‌ కోసం వచ్చిన బిడ్‌ను సెక్యూర్డ్‌, అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలు సుమారుగా చెరిసగం పంచుకోవాలని తీర్పిచ్చింది. కాగా తాజాగా సుప్రీం కోర్టు, ఈ ట్రెబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టి దివాలా కేసుకు సంబంధించిన బాకీల చెల్లింపులో సెక్యూర్డ్‌ రుణదాతల కమిటీకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తీర్పునిచ్చింది. ‘దివాలా చట్టం కింద ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల పరిష్కారం కోసం మధ్యంతర ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టడమనేది, రెగ్యులేటర్లు, రుణదాతలు, ఎన్‌సీఎల్‌టీల మధ్య పరస్పర చర్యను అనుమతించే ముఖ్యమైన దశ ’ అని చార్టర్డ్‌ అకౌంటింగ్‌ సంస్థ సిరిల్‌ అమర్‌చంద్ మంగల్‌దాస్, భాగస్వామి, విశ్వనాథన్‌ అన్నారు.  
ఏయే బ్యాంకులకు ఎంతెంతా?
ఎస్సార్‌ స్టీల్‌కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ. 13, 131 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివుంది. ఎడిల్‌వీజ్‌ అసెట్ రీకనస్ట్రక్షన్‌ కంపెనీ రూ. 8,266 కోట్ల రుణాలను,  కెనరా బ్యాంక్ రూ. 3,798 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 2,913 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ రూ. 2,481 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగి ఉంది. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 2,294 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంకులు ప్రతి బ్యాంక్‌ రూ. 1000 కోట్లకు పైగా ఎక్స్‌పోజర్‌ను కలిగివున్నాయి. రుణదాతల కమిటీ ఆమోదించిన పంపిణీ విధానం ప్రకారం ఎస్‌బీఐ అధికంగా రూ. 12,161 కోట్లను, కెనరా బ్యాంక్ రూ. 3,493 కోట్లను పొందనున్నాయి. అదేవిధంగా ఐడీబీఐ బ్యాంక్ రూ. 2,282 కోట్లు, ఎడిల్‌వీజ్‌ ఏఆర్‌సీ రూ. 7,600 కోట్లకు పైగా పొందనున్నాయి. పీఎన్‌బీ వంటి ఇతర రుణదాతలు రూ. 2,700 కోట్లను పొందనుండగా, డాయిష్‌ బ్యాంకు రూ. 2, 603 కోట్లను  పొందనుంది.



You may be interested

ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకుంటున్నారు!

Saturday 16th November 2019

బ్యాంకు షేర్ల జోరుతో నిఫ్టీ బ్రేకవుట్‌ సాధ్యం మెటల్స్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లు ర్యాలీ జరపడం, అదే సమయంలో ఎఫ్‌ఎంసీజీ షేర్లు మందకొడిగా ఉండడం లాంటివి రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌ పెరుగుతుందనేందుకు నిదర్శనాలని ప్రముఖ అనలిస్టు కునాల్‌ బోత్రా చెప్పారు. ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకొనేందుకు ఎక్కువ సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌ అని, రిస్క్‌కు వెరసి రక్షణాత్మకంగా వ్యవహరించడాన్ని రిస్క్‌-ఆఫ్‌ ట్రేడింగ్‌ అని అంటారు. ఎకానమీపై నమ్మకం పెరిగే సమయంలో రిస్క్‌-ఆన్‌

నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ నష్టంతో ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 11942.60తో పోలిస్తే 16.60 పాయింట్లు నష్టంతో 11,926.00 వద్ద స్థిరపడింది. ఇక ఈవారంలో మార్కెట్‌ నాలుగు రోజులు మాత్రమే పనిచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావితం చేసే అంశాలేమి లేకపోవడం, దేశీయంగా సెప్టెంబర్‌ మాసపు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలతో పాటు అక్టోబర్‌ ఎగుమతులు క్షీణించడంతో ఈ వారం ఆద్యంతం సూచీలు పరిమితి శ్రేణిలో కదలాడాయి. వారం

Most from this category