News


11000 పైన నిఫ్టీ ముగింపు

Monday 9th September 2019
Markets_main1568026419.png-28273

బ్యాంకింగ్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ రెండోరోజూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 37000 స్థాయిపైన 37,145.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి  వారం రోజుల తరువాత నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారి 11000పైన 11,003 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌ 11000 పైన ముగిసిన నేపథ్యంలో షార్ట్‌టర్మ్‌ అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందనీ, 11180 స్థాయిని పరీక్షిస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మందగించిన ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలను ప్రకటించవచ్చనే అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జర్మనీ ఎగుమతులు అనూహ్యంగా పెరగడం, బ్రిటన్‌ జూలై మాసపు ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి నమోదు కావడంతో యూరప్‌ మార్కెట్లు లాభాల ప్రారంభం కావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌తో ఐటీ షేర్లు నష్టపోయాయి. మిగిలిన అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్‌ రంగ ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం లాభపడి 27,504.65 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు రాణించాయి. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు 1శాతం రాణించాయి. 

భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, మారుతి, యూపీఎల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్‌ అటో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఐషర్‌మోటర్స్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ 1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.



You may be interested

11,042 దాటితే మరింత పైకి..!

Tuesday 10th September 2019

నిఫ్టీ-50 ఇక తదుపరి 11,042ను అధిగమించి నిలదొక్కుకుంటే తదుపరి ర్యాలీ చేయగలదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిఫ్టీ సోమవారం కీలకమైన 11,000 మార్క్‌ పైన క్లోజ్‌ అయింది. దీంతో డైలీ చార్ట్‌లో చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. గరిష్టంలో గరిష్టం, కనిష్టంలో కనిష్టాన్ని నమోదు చేయడం నిఫ్టీ వరుసగా మూడో రోజని మద్దతు స్థాయిలు అధిక స్థాయికి చేరాయనడానికి ఇది సూచికగా అనలిస్టులు పేర్కొంటున్నారు. దిగువ స్థాయిలో నిఫ్టీకి 10,900

11000పైన స్థిరంగా ఉంటేనే ర్యాలీ!

Monday 9th September 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా నిఫ్టీ గతవారం నెగిటివ్‌ ట్రెండ్‌ నుంచి క్రమంగా బయటపడుతోంది. ఈవారాన్ని నిఫ్టీ పాజిటివ్‌గా ఆరంభించింది. వీక్లీచార్టుల్లో నిఫ్టీ లాంగ్‌లోయర్‌ షాడో ఉన్న బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఇది దిగువ స్థాయిల్లో కొనుగోళ్లను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11వేల పాయింట్ల పైన బలంగా క్లోజయితే అప్‌మూవ్‌ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే నిఫ్టీ క్రమంగా 11200 పాయింట్ల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిఫ్టీ

Most from this category