News


బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ "బేర్‌'

Monday 23rd March 2020
Markets_main1584946529.png-32634

సెన్సెక్స్‌ 3490 పాయింట్లు డౌన్‌
1004 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
మెటల్‌, రియల్టీ విలవిల


లోయర్‌ సర్క్యూట్‌తో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి ట్రేడింగ్‌ ప్రారంభమయ్యాక మరింత తిరోగమించాయి. మధ్యాహ్నం 12 కల్లా సెన్సెక్స్‌ 3490 పాయింట్లు పడిపోయి 26426కు చేరగా.. నిఫ్టీ 981 పాయింట్లు దిగజారింది. 7741 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్‌ 26,500 దిగువకు చేరగా.. నిఫ్టీ 8,000 పాయింట్లనూ కోల్పోవడం గమనార్హం!  

అమ్మకాల షాక్‌
అమ్మకాల ఉధృతికి ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బేర్‌మంటున్నాయి. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో రంగాలు 14-12 శాతం చొప్పున కుప్పకూలాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, ఫెడరల్‌, ఐసీఐసీఐ, బంధన్‌, బీవోబీ, ఆర్‌బీఎల్‌, హచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, కొటక్, ఎస్‌బీఐ 22-11 శాతం మధ్య పడిపోయాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆటో రంగంలో టీవీఎస్‌ మోటార్‌, మదర్‌సన్, హీరో మోటో, మారుతీ, బజాజ్‌ ఆటో, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ ఫోర్జ్‌, ఎంఅండ్‌ఎం, అమరరాజా, అపోలో టైర్‌, బాష్‌, టాటా మోటార్స్‌, ఐషర్, ఎక్సైడ్‌, ఎంఆర్ఎఫ్‌ 15-8 శాతం మధ్య పతనమయ్యాయి.

డౌన్‌డౌన్‌
మెటల్‌ కౌంటర్లలో ఏపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ, వేదాంతా, హిందాల్కో, హింద్‌ కాపర్‌, టాటా స్టీల్‌, నాల్కో, సెయిల్‌ 18-14 శాతం మధ్య దిగజారాయి. ఇదే విధంగా రియల్టీ కౌంటర్లలో సన్‌టెక్‌, బ్రిగేడ్‌ 20 శాతం చొప్పున డౌన్‌సర్క్యూట్‌ను తాకాయి. ఈ బాటలో శోభా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, మహీంద్రా లైఫ్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ 15-5 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర రంగాలలో ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఐటీ, ఫార్మా సైతం 10-6 శాతం మధ్య నీరసించాయి.



You may be interested

3వేల పాయింట్లు పతనమైన బ్యాంక్‌ నిఫ్టీ..!

Monday 23rd March 2020

మార్కెట్‌ మహాపతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 15శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా 17రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 వరకు ఈ

థైరోకేర్‌, లాల్ పాథ్‌ లేబ్స్‌ జూమ్‌

Monday 23rd March 2020

లాభాల్లో .. థైరోకేర్‌ టెక్నాలజీస్‌ డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌ దేశీయంగా కోవిడ్‌-19 ధృవీకరణ విషయంలో కొన్ని ప్రయివేట్‌ రంగ లేబొరేటరీలకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు వెలువడిన వార్తలు లిస్టెడ్‌ కంపెనీలకు జోష్‌నిచ్చాయి. దీంతో 12 శాతం కుప్పకూలిన మార్కెట్లలోనూ థైరోకేర్‌ టెక్నాలజీస్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం విశేషం. కరోనా వైరస్‌ను నిర్ధారించే రక్త పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొన్ని ల్యాబ్స్‌ను అనుమతించినట్లు తెలుస్తోంది. రియల్‌ టైమ్‌

Most from this category