News


స్వల్పలాభంతో ముగింపు

Friday 16th August 2019
Markets_main1565951510.png-27815

మార్కెట్‌ వారాంతాన్ని స్వల్ప లాభంతో ముగించింది. బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 39 పాయింట్ల లాభంతో 37,350.33, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 11,048 వద్ద ముగిసాయి. అంతర్జాతీయ మార్కె‍ట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న మార్కెట్‌ నేడు నష్టంతో మొదలైంది. ఒకదశలో సెన్సెక్స్‌  335 పాయింట్లు క్షీణించి 36,974 వద్ద, నిఫ్టీ 105 పాయింట్ల వరకు పతనమైన 10,924.30 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ప్రధాని నరేంద్రమోది నిన్నటి రోజు దేశీయ ఆర్థికరంగ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరిపిన నేపథ్యంలో నేడు కేంద్రం కీలకమైన ప్రకటన చేయవచ్చనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, అటో రంగానికి చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి బలపడంతో ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోగా, మెటల్‌ షేర్లకు సైతం అమ్మకాల సెగ తగిలింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు మద్దతు లభించడంతో 198 పాయింట్లు పెరిగి 28,217.00    వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెనెక్స్‌ 470 పాయింట్ల రేంజ్‌లో 36,974.41 - 37,444.45 స్థాయిలో, నిఫ్టీ 144 పాయింట్ల స్థాయిలో  10,924.30-11,068.65 శ్రేణిలో కదలాడాయి. 

గ్రాసీం, యస్‌ బ్యాంక్‌, మారుతీ, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం వరకు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, వేదాంత, టీసీఎస్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. 



You may be interested

పరిస్థితి బాగుంటే సర్‌ఛార్జ్‌ ఓకే

Friday 16th August 2019

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చీప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రసూన్‌ గాజ్రి అంతర్జాతీయంగా, దేశియంగా స్థూల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో పాటు బలహీనమైన కార్పోరేట్‌ ఆదాయాలు, కొనసాగుతున్న ఆర్థిక మందగమనం వలన దేశియ మార్కెట్లలో భారీగా అనిశ్చితి నెలకొని ఉందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చీప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రసూన్‌ గాజ్రి అన్నారు. ‘మన ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మందగమనం లేకపోయి ఉంటే ఎఫ్‌పీఐ(ఫారిన్‌ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు)లపై విధించే ఎటువంటి పన్ను అయినా కూడా మార్కెట్‌ను నష్టపరిచేది కాదు’ అని

మారుతి జోరు

Friday 16th August 2019

అటో రంగ షేర్ల రికవరిలో భాగంగా శుక్రవారం దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకీ కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.5810.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచి మారుతి కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశంలో 2.50శాతం లాభపడి రూ.5949.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత క్రితం ముగింపు(రూ.5815.55)తో పోలిస్తే 2.25శాతం

Most from this category