News


బ్యాంకు నిఫ్టీ 513 పాయింట్ల రికవరీ

Thursday 8th August 2019
Markets_main1565257399.png-27642

బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ గురువారం ట్రేడింగ్‌లో తిరిగి 28000 స్థాయిని అందుకుంది. నేడు ఈ ఇండెక్స్‌ 27,840.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా జరిగిన అమ్మకాల్లో ఒక దశలో ఇండెక్స్‌ 171 పాయింట్లను కోల్పోయి 27,531.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం నుంచి మార్కెట్లో మొదలైన కొనుగోళ్లతో ఇండెక్స్‌ కనిష్టస్థాయిల నుంచి రివకరి అయ్యింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా షేర్లు లాభపడటంతో ఇండెక్స్‌ కనిష్టస్థాయి(27,840.10) నుంచి 513 పాయింట్లు పెరిగి 28000 స్థాయిని అందుకుని 28,044.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు (27,702.05)తో పోలిస్తే 1.20శాతం లాభంతో 28,033.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా పీఎన్‌బీ షేర్లు 3.50శాతం పెరిగింది. యస్‌ బ్యాంక్‌ 2.50శాతం, హెచ్‌డీఎఫ్‌స్‌ బ్యాంక్‌ 2శాతం ర్యాలీ చేశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ 1.50శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం పెరిగింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు అరశాతం పెరిగాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

బంగారంలో బుల్‌రన్‌!

Thursday 8th August 2019

2013 గరిష్ఠాలను దాటే ఛాన్స్‌ దేశీయంగా రూ.40వేలకు అవకాశం కమోడిటీల్లో బంగారం నూతన బుల్‌ సైకిల్‌లోకి ప్రవేశించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆరేళ్ల తర్వాత పసిడి 1400 డాలర్లపైకి చేరింది. ఈ స్థాయికి పైన 1450, 1475, 1500, 1520 డాలర్ల వరకు క్రమానుగత ర్యాలీకి ఛాన్సులున్నాయి. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత బంగారంలో బుల్స్‌ పరుగులు ఆరంభమయ్యాయని, ఇవి ఇప్పట్లో ఆగవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి కీలక బ్రేకవుట్‌ సాధించిందని,

ఫలితాలు హిట్‌..అరబిందో షేరు ర్యాలీ

Thursday 8th August 2019

జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో అరబిందో ఫార్మా అన్ని పారామితులలో విశ్లేషకుల అంచనాలను అధిగమించడంతో గురువారం(అగష్టు 08) ఇంట్రాడేలో ఈ కంపెనీ షేరు 7.8 శాతం ర్యాలీ చేసింది. ఈ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన ఈ కంపెనీ 39.5 శాతం వృద్ధిని సాధించడం గమనర్హం. యుఎస్, యూరప్, యాంటీరెట్రోవైరల్ వ్యాపారాలలో గణనీయమైన వృద్ధి కారణంగా, జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ. 635.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. యుఎస్ ఫార్ములేషన్

Most from this category