News


బ్యాంకింగ్‌ షేర్ల దెబ్బ... నష్టాల ముగింపు

Thursday 10th October 2019
Markets_main1570702953.png-28807

క్రితం రోజు భారీగా ర్యాలీ జరిపిన బ్యాంకింగ్‌ షేర్లలో గురువారం అమ్మకాలు వెల్లువెత్తడంతో ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 297 పాయింట్ల నష్టంతో 37,880 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 79 పాయింట్ల క్షీణతతో 11,235 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ప్రధాన సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్‌ షేర్ల నష్టం కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 770 పాయింట్లు (2.7) శాతం పతనమయ్యింది. తాజాగా ఫలితాలు వెల్లడించిన ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌...నిఫ్టీ-50 సూచీలో అత్యధికంగా 6 శాతం పడిపోయింది. యస్‌బ్యాంక్‌ 5 శాతం క్షీణించగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐలు 3 శాతం చొప్పున నష్టాలతో ముగిసాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతం తగ్గింది. బ్యాంకింగేతర షేర్లలో గెయిల్‌, వేదాంత, టాటా మోటార్స్‌ షేర్లు 3 శాతం చొప్పున పతనమయ్యాయి. 

భారతి ఎయిర్‌టెల్‌ 5 శాతం అప్‌

రిలయన్స్‌ జియో...వాయిస్‌కాల్స్‌కు కూడా ఛార్జ్‌ చేయనున్నట్లు ప్రకటించడంతో టెలికాం షేర్లు జోరుగా ర్యాలీ జరిపాయి. భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు 5-6 శాతం మేర జంప్‌చేయగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3 శాతం పెరిగింది. గ్రాసిమ్‌ 3 శాతం, హిందుస్తాన్‌ యూనీలీవర్‌ 1.5 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.3 శాతం పెరిగాయి. 



You may be interested

నిరాశపరిచిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

Thursday 10th October 2019

లాభంతో పాటు ప్రొవిజన్స్‌లో కూడా పెరుగుదల సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఇండస్‌ఇండ్‌బ్యాంకు నికరలాభం గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగి రూ. 1384 కోట్లకు చేరింది. అయితే అనలిస్టులు సరాసరిన నికరలాభంలో 55- 60 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో బ్యాంకు ఎన్‌ఐఐ 32 శాతం వృద్దితో రూ. 2909 కోట్లకు చేరింది. ఇతరాదాయాలు 31 శాతం పెరిగి రూ. 1727 కోట్లను చేరాయి. నికర వడ్డీ ఆదాయంలో

హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్‌ భారీగా కొన్న షేర్లివే..!

Thursday 10th October 2019

   దేశీయ అతి పెద్ద ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, గత నెల మార్కెట్‌ భారీ ర్యాలీ తర్వాత పీఎస్‌యూ, బ్యాంకింగ్‌, ఇన్ఫ్రా తదితర రంగాలలోని స్టాకులను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ సెప్టెంబర్‌ నెలలో కోటి చొప్పున ఎస్‌బీఐ(స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), ఎన్‌హెచ్‌పీసీ(నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పోరేషన్‌) షేర్లును కొనుగోలు చేసింది.  కాగా ఈ పీఎస్‌యూల షేర్ల విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి

Most from this category