News


బ్యాంకింగ్‌ షేర్ల పరుగులు

Monday 27th August 2018
Markets_main1535358176.png-19682

నిప్టీ-50లో టాప్‌గెయినర్లుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ షేర్లు
ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ షేర్ల ర్యాలీ సోమవారం సూచీలను పరుగులు పెట్టిస్తుంది. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు ఇండెక్స్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌లు 2నుంచి 3శాతానికి పైగా ర్యాలీచేశాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎస్‌బీఐ(3.15శాతం), ఐసీఐసీఐ బ్యాంకు(3.09శాతం) లాభపడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్ల విభాగంలో చోటు దక్కించుకున్నాయి.
నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 3,248.95 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3శాతం ర్యాలీ చేసి 3,308.85 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3214.60)తో పోలిస్తే 2.83శాతం లాభంతో 3,305.65 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని ఉన్న మొత్తం 11 షేర్లకు అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా కెనరాబ్యాంకు 4శాతం లాభపడగా, ఎస్‌బీఐ, యూనియన్‌బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా, బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు 3నుంచి 2శాతం ర్యాలీ చేశాయి. అలాగే ఇండియన్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, పీఎన్‌బీ, అలహాదాబాద్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, ఓరియంట్‌ బ్యాంకు షేర్లు 1శాతం పెరిగాయి. ఐడీబీఐ బ్యాంకు షేరు మాత్రం స్వల్పంగా అరశాతం లాభపడింది. ఇదే సమయానికి ఎస్‌బీఐ బ్యాంకు షేరు 3శాతం లాభంతో  నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.
నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌:-  నేడు ఎన్‌ఎస్‌ఈలో 15,882.00 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2శాతం ర్యాలీ చేసి 16,096.20 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(15,814.50)తో పోలిస్తే 1.70శాతం లాభంతో 16,083.95 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలో ఉన్న మొత్తం 10 షేర్లకు గానూ ఒక్క ఫెడరల్‌ బ్యాంకు తప్ప మిగితా అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈసూచీలోని ఆర్‌బీఎల్‌ అ‍త్యధికంగా, 4శాతం లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంకు 3శాతం లాభపడింది. కోటక్‌, యస్‌ బ్యాంకు, ఇండస్ఇండ్‌ బ్యాంకు షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. ఐడీఎఫ్‌సీబ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు ఒకశాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సౌత్‌బ్యాంకు షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఐతే ఫెడరల్‌ బ్యాంకు షేరు మాత్రం ఒకశాత నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఐసీఐసీఐ బ్యాంకు షేరు 3శాతం లాభపడి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో నాలుగో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

3 వారాల్లో లాభాలందించే 12 స్టాక్స్‌

Monday 27th August 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పరుగులు పెడుతున్నాయి. కొత్త గరిష్ట స్థాయిలను అధిగమిస్తూ ముందుకు కదులుతున్నాయి. ఇలాంటి సమయంలో పలు బ్రోకరేజ్‌ సంస్థలకు చెందిన అనలిస్ట్‌లు వచ్చే మూడు వారాల కాలంలో లాభాలు అందించే 12 స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం.. అనలిస్ట్‌: ప్రభుదాస్‌ లీలాధర్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ వైశాలి పరేఖ్‌ స్టాక్‌: భెల్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.90 స్టాప్‌ లాస్‌: రూ.74 భెల్‌ స్టాక్‌ డైలీ చార్ట్‌లో హైయర్‌ బాటమ్‌ను

12 శాతం రాబడికి 12 సిఫార్సులు

Monday 27th August 2018

వచ్చే 1- 3 నెలల కాలానికి దాదాపు 12 శాతం వరకు రాబడినిచ్చే 12 స్టాకులను అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. చార్ట్‌వ్యూ ఇండియా మజార్‌ మహ్మద్‌ రికమండేషన్లు 1. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 540. స్టాప్‌లాస్‌ రూ. 490. పలుమార్లు ఈ స్టాకుల రూ. 490 వరకు దిగివచ్చి బౌన్స్‌ బ్యాక్‌ అయింది. తాజాగా మరోమారు ఇదే తరహా ధోరణి చూపే క్రమంలో ఉంది. చార్టుల్లో ఇండికేటర్లు మరో బౌన్స్‌బ్యాక్‌

Most from this category