News


రికవరీ బాటలో బ్యాంకింగ్‌

Thursday 21st November 2019
Markets_main1574321888.png-29759

-బీఎన్‌పీ పారిబా
ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం నుంచి మందగమనంలో ఉందని, ఫలితంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణాలివ్వడం తగ్గిందని, కానీ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం, బ్యాంకుల నియంత్రణ సామర్ధ్యం పెరగడం, తక్కువ పన్ను రేటు వంటి అంశాల వలన దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ రికవరీకి  సిద్ధంగా ఉందని బీఎన్‌పీ పారిబా పేర్కొంది. బ్యాంకుల డిజిటిల్‌ కార్యక్రమాలు పెరగడం, తక్కువగా శ్రామిక అవసరాలను ఉపయోగిస్తుండడం వంటి కారణాల వలన బ్యాంకుల ఆపరేషనల్‌ సామర్ధ్యం పెరిగిందని, ఫలితంగా ఖర్చులు-ఆదాయం నిష్పత్తి తగ్గుముఖం పడుతోందని ఈ బ్రోకరేజి తెలిపింది.  ‘తక్కువ వడ్డీ రుణాలు, ఖర్చుల నియంత్రణ సామర్ధ్యం, పన్ను తగ్గింపు ప్రయోజనాలు వంటి అంశాల వలన ప్రైవేట్‌ బ్యాంకుల ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ) 370 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుంది. ఆర్‌ఓఈ అధికంగా ఉంటే పీబీ(ప్రైస్‌ టూ బుక్‌) నిష్పత్తి కూడా వృద్ధి చెందుతుంది. ప్రస్తుత వాల్యుషన్‌ల స్థాయి నుంచి ప్రైవేట్‌ బ్యాంకులు, వచ్చే ఐదేళ్లలో చక్రగతిన 10-15 శాతం పెరుగుతాయని అంచనావేస్తున్నాం’ అని బీఎన్‌పీ పారిబా పేర్కొంది.  ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వచ్చే ఐదేళ్లలో మంచి లాభాలనిస్తాయని, కానీ ఈ బ్యాంకుల ఆర్‌ఓఈ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావచ్చని, ఫలితంగా ఈ బ్యాంకులు ప్రస్తుత వాల్యుషన్‌ స్థాయి నుంచి పరిమితంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వచ్చే ఐదేళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బలమైన షేర్‌హోల్డింగ్‌ రిటర్న్‌లను ఇవ్వగలిగే స్థాయిలో ఉందని, సీఏజీఆర్‌(కాంపౌండ్‌ యాన్యుల్‌ గ్రాస్‌ రెవెన్యూ) 20 శాతానికి పైగా ఉంటుందని ఈ బ్రోకరేజి అభిప్రాయపడింది. అనుబంధ సంస్థల్లోని షేర్‌హోల్డర్ల విలువను అందుబాటులోకి తీసుకురావడంతో కోటక్‌ మహింద్రాబ్యాంక్‌ కూడా మంచి రిటర్న్‌లను ఇవ్వగలదని బీఎన్‌పీ పారిబా అంచనావేస్తోంది. 
వచ్చే పదేళ్లలో ఇన్సురెన్స్‌..
‘ఇండియాలో వినియోగదారులు ఇన్సురెన్స్‌ను చాయిస్‌గా కాకుండా అవసరంగా చూస్తున్నారు. ఇన్సురెన్స్‌పై అవగాహన పెరగడం, ఇన్సురెన్స్‌ను అందించే కంపెనీలు పెరగడం, బీమా అందరికి అందుబాటు ధరలలో ఉండడంతో ఈ సెక్టార్‌, అతి పెద్ద ‘జన్‌ధన్‌’ కదలికను చూస్తుంది’ అని ఈ బ్రోకరేజి అభిప్రాయపడింది. ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లోని చాలా వరకు నియంత్రణ సమస్యలు పరిష్కారమయ్యాయి, మరికొన్ని పరిష్కార దిశలో ఉన్నాయి. 2005-15 మధ్య కాలంలో బ్యాంకులు ఏవిధంగా వృద్ధి చెందాయో, అదేవిధంగా వచ్చే 10 ఏళ్లలో ఇన్సురెన్స్‌ సెక్టార్‌ దూసుకుపోతుంది’ అని బీఎన్‌పీ పారిబా తెలిపింది. అంతేకాకండా బలమైన బ్యాంకులు అండగా ఉన్న ఇన్సురెన్స్‌ కంపెనీలు వచ్చే 10 ఏళ్ల కాలంలో రాణిస్తాయని అభిప్రాయపడింది. ‘హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సురెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ వంటి కంపెనీలు మా టాప్‌ 3 ఎంపికలుగా ఉన్నాయి’ అని వివరించింది. కాగా గత ఏడాది కాలం నుంచి చాలా వరకు స్థూల ఆర్థిక సూచీలు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇవి ఆయా రంగాలలో మందగమనం ఏవిధంగా ఉందో వివరిస్తున్నాయి. ఆటో విక్రయాలు, సిమెంట్‌ ఉత్పత్తి, ఐఐపీ, గ్రామీణ వేతన వృద్ధి, నిరుద్యోగం డేటా, ఎగుమతుల వృద్ధి మొదలైన అన్ని రంగాల స్థూల ఆర్థిక డేటా కొన్ని త్రైమాసికాల కనిష్ఠానికి పడిపోయాయింది. ‘గత మూడు నెలల కాలంలో మొత్తం 35 స్థూల ఆర్థిక సూచీలలో కేవలం నాలుగు మాత్రమే పాజిటివ్‌ ట్రెండ్‌ను చూపిస్తున్నాయి’ అని బీఎన్‌పీ పారిబా పేర్కొంది. 
    పండుగ సీజన్‌ వలన ఆర్థిక సంవత్సరం 2020 క్యూ3లో ఆర్థిక వ్యవస్థ రికవరి ఉంటుందని అంచనాలున్నాయి. కానీ దీని తర్వాత కూడా చాలా స్థూల ఆర్థిక సూచీలు నెగిటివ్‌లోనే నమోదవుతున్నాయి. ‘కేవలం వ్యవస్థలో డిమాండ్‌కు సంబంధించిన సమస్యలు మాత్రమే లేవు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తయారీ సంస్థలు మార్పులు చేయడానికి అధిక సమయం తీసుకోవడం వంటి సరఫరాకు సంబంధించిను సమస్యలు కూడా ఉన్నాయి’ అని ఈ బ్రోకరేజి పెర్కొంది. దీంతోపాటు బ్యాంకులు ఇచ్చే రుణాలు తగ్గడం, మూలధన వ్యయం సైకిల్‌ తిరిగి పుంజుకోడానికి నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయని తెలిపింది. ‘వ్యవస్థీకృత రిస్క్‌ లేదని గృహ రుణాలకు సంబంధించిన మా విశ్లేషకులు, విక్రయం కాని రియల్‌ఎస్టేట్‌ జాబితా తెలుపుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌ ఆర్థిక సంవత్సరం 2020 ప్రథమార్ధం సీఈటీ(కామన్‌ ఈక్విటీ టైర్‌1)1 లో 10.6 శాతం ఉంది. ఇది 2014లో 8.3 శాతంగా ఉంది. అదే విధంగా పీసీఆర్‌(ప్రొవిజన్‌ కవరేజ్‌ రేసియో) 59 శాతం వద్ద ఉంది. ఇది 2014లో 41 శాతంగా నమోదైంది’ అని ఈ బ్రోకరేజి వివరించింది. ‘కార్పోరేట్‌ ట్యాక్స్‌ రేట్లు తగ్గడం వలన అదనంగా 82 బేసిస్‌ పాయింట్ల వరకు సీఈటీ 1 పెరుగుతుంది. ఇది బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ మరింత మెరుగుపడడానికి సహాయపడుతుందని అంచనావేస్తున్నాం. అదేవిధంగా ఇళ్లను కొనుగోలు చేసే సామర్ధ్యం 2006 స్థాయికి చేరుకుంది. రుతుపవనాలు మంచి స్థాయిలోనే ఉండడంతో రిజర్వాయర్‌లో 20 శాతం వరకు మిగులు జలాలు పెరుగుతాయి. ఒత్తిడిలో ఉన్న రంగాల బ్యాలెన్స్‌షీట్లు స్వల్పంగా రికవరి అవుతాయి’ అని బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది. 



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు..హిందుస్తాన్‌ కాపర్‌ 5% డౌన్‌

Thursday 21st November 2019

హాంగ్‌కాంగ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడంతో యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గురువారం సెషన్‌లో మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మధ్యాహ్నం 2.37 సమయానికి 1.24 శాతం నష్టపోయి 2,493.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హిందుస్థాన్‌  కాపర్‌ 5.18 శాతం, సెయిల్‌ 3.30 శాతం, కోల్‌ ఇండియా 2.19 శాతం, టాటా స్టీల్‌ 1.83 శాతం, జిందాల్‌ స్టీల్‌

వొడాఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లను ఏం చేద్దాం?

Thursday 21st November 2019

అనలిస్టుల సూచనలు స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై రెండేళ్ల మారిటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది టెల్కోలకు పాజిటివ్‌ వార్తే కానీ వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లు మాత్రం గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏజీఆర్‌ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ సాయం ఏమీ ప్రకటించకపోవడంతో ఈ షేర్ల కౌంటర్లలో అమ్మకాలు పెరిగాయి. మధ్యాహ్న సమయానికి ఐడియా షేరు దాదాపు 4 శాతం, ఎయిర్‌టెల్‌ సుమారు 2.5 శాతం నష్టాల్లో ఉన్నాయి. ఇటీవల

Most from this category