News


బ్యాంకింగ్‌, చమురు రంగాల షేర్లలోకి అత్యధిక ఎఫ్‌పీఐలు

Monday 2nd December 2019
Markets_main1575260784.png-29996

నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన రంగాల షేర్లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో 70 శాతం ప్రధానంగా రెండు రంగాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్‌, చమురు మరియు గ్యాస్‌ రంగాల షేర్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో సింహభాగం చేరాయి. నవంబర్‌ 1- 15 కాలంలో ఎఫ్‌ఐఐలు దేశీయ స్టాక్స్‌లో 14326 కోట్ల పెట్టుబడులు పెట్టగా ఇందులో 46 శాతం అంటే 6630 కోట్లు బ్యాంకు స్టాకుల్లోకి, చమురు మరియు గ్యాస్‌రంగాల షేర్లలోకి 23 శాతం అంటే రూ. 3330 కోట్ల పెట్టుబడులు వెళ్లాయి. ఎకానమీ బలహీనంగా ఉన్నందున బలమైన బ్యాంకుల స్టాకులే బలమైన ప్రదర్శన చూపుతాయని ఎఫ్‌ఐఐలు భావించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంకుల్లోకి ఎక్కువ విదేశీ నిధులు వచ్చాయి. ఎన్‌పీఏల గొడవ లేకుండా ఉండడానికి చాలా బ్యాంకులు రిటైల్‌ విభాగాల రుణాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో ఇవి మంచి ఫలితాలు చూపవచ్చని అంచనా. మరోవైపు బీపీసీఎల్‌ ప్రైవేటైజేషన్‌ నేపథ్యంలో చమురు మరియు  గ్యాస్‌రంగంపై ఎఫ్‌ఐఐలకు మక్కువ పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. 

ఈ రెండు రంగాలతో పాటు ఎఫ్‌ఐఐలు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, బీమా, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, రియల్టీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, టెక్స్‌టైల్స్‌, ఆటో రంగాల షేర్లలో అమ్మకాలు జరిపాయి. 


FPI

You may be interested

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు

Monday 2nd December 2019

ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించాయ్‌  వాటిపై చర్య తీసుకోండి  కెయిట్‌ డిమాండ్‌  న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సం‍స్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ-కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌) తీవ్రంగా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇంకా ఇతర ఈ కామర్స్‌ సం‍స్థల చేతుల్లో

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 2nd December 2019

ట్రెంట్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సం‍స్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ. 520 టార్గెట్‌ ధరై రూ.605 ఎందుకంటే: టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌ కంపెనీ నాలుగు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెస్ట్‌సైడ్‌(బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ దుస్తులు), జూడియో(యువతరం కోసం క్యాజువల్‌ వేర్‌ దుస్తులు), స్టార్‌(ఫుడ్‌ అండ్‌ గ్రోసరీ రిటైల్‌ స్టోర్‌), ల్యాండ్‌మార్క్‌(ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌ కాన్సెప్ట్‌) విభాగాలు వార్షికంగా మంచి వృద్ధినే సాధిస్తున్నాయి. ఈ రిటైల్‌ సంస్థ ఇటీవలనే జూడియో పేరుతో వేల్యూ ఫ్యాషన్‌ పార్మాట్లో స్టోర్స్‌ను

Most from this category